కార్తి చిదంబరానికి పెద్ద ఊరట, బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరం అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయనను సీబీఐ కొద్ది రజోుల క్రితం అరెస్టు చేసింది. విచారణ నిమిత్తం న్యాయస్థానం కార్తిని విచారణ అధికారుల కస్టడీకి కూడా ఇచ్చింది.

ఆయనను విచారణాధికారులు పలుమార్లు విచారించారు. మరోవైపు ఆయన బెయిల్ ప్రయత్నాలు ఇటీవలి వరకు విఫలమయ్యాయి. తాజాగా, శుక్రవారం ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications