హిందూవులు పిల్లల్ని కంటూనే ఉండండి: బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ
Recommended Video

లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణపై ముజఫర్ నగర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులు పిల్లల్ని కనడం ఆపొద్దని సూచించారు.
ఇద్దరు పిల్లలు ముద్దనేది అందరికీ సమ్మతమేనని సైనీ చెప్పారు. కానీ ఇతరులు దానిని పాటించడం లేదన్నారు. చట్టం అందరికీ సమానేమనని, ఈ దేశం ప్రతి ఒక్కరిదని, హిందువులు పిల్లల్ని కనడం ఆపొద్దని సూచించారు. హిందువులు పిల్లలను కంటూనే ఉండాలని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ఖతౌలీ నియోజకవర్గం నుండి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఇద్దరు పిల్లలున్నారు కదా.. మూడో బిడ్డ ఎందుకని తన భార్య అడిగిందని, కానీ నలుగురైదుగురు పిల్లలు కావాలని ఆమెకు చెప్పానని సైనీ తెలిపారు.ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సైనీకి కొత్తేం కాదు.
నూతన సంవత్సర వేడుకలు, వాలంటైన్స్ డే క్రైస్తవుల పండుగ అని, దానిని హిందువులు చేసుకోరాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో దుమారం రేగింది. ఇక గోవులను చంపారని కొందరిపై దాడి చేసిన ఘటనలో ఈయనపై కేసులు కూడా నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications