వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు వస్తే కేంద్రంలో హంగ్: ఎన్డీఏకు 237..యూపీఏకు 166 స్థానాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో ప్రీ పోల్ సర్వే చేశాయి. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే 99 స్థానాలు కోల్పోతుందని, కేంద్రంలో హంగ్ ఏర్పడుతోందని ఈ సర్వేలో తేలింది. లోకసభలో మేజిక్ ఫిగర్ 272. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 237 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 166 సీట్లు వస్తాయని తేలింది.

ఎన్డీయేకు 99 సీట్లు తగ్గుతుండగా, యూపీఏకు 106 సీట్లు పెరగనున్నాయని తేలింది. ఇతరులు 140 స్థానాల్లో గెలుస్తారని ఈ సర్వేలో వెల్లడైంది. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటికే బీఎస్పీ, ఎస్పీలు కలిశాయి. వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా జతకలిస్తే బీజేపీకి మరింత పెద్ద షాక్ తప్పదని తేలింది.

ఏపీబీ-సీ ఓటరు సర్వే: యూపీలో బీజేపీకి 25, ఎస్పీ-బీఎస్పీలకు 51 సీట్లు, ప్రియాంకగాంధీ రాకతో...ఏపీబీ-సీ ఓటరు సర్వే: యూపీలో బీజేపీకి 25, ఎస్పీ-బీఎస్పీలకు 51 సీట్లు, ప్రియాంకగాంధీ రాకతో...

Hung Parliament if elections held today, NDA would lose 99 seats: Mood of the Nation poll

2014 లోకసభ ఎన్నికల్లో బీజేపీకి ఉత్తర భారత దేశంలో భారీ సీట్లు వచ్చాయి. ఈసారి ఆ సీట్లు రావని ఈ సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు ఉత్తరాదిన భారీ దెబ్బ పడనుందని తేలింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరనుందని ఈ సర్వేలో వెల్లడైంది.

English summary
The Congress can turn the tide in its favour in the Lok Sabha election if Rahul Gandhi can convince Mamata Banerjee, Mayawati and Akhilesh Yadav to join hands with him and fight collectively against the Bharatiya Janata Party (BJP). This is the finding of the India Today-Karvy Insights Mood of the Nation poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X