వీడెవడండీ బాబు.. భార్య పార్ట్‌ను కొరికేశాడు..!
ఇటీవల కాలం భార్యాభర్తలకు చెందిన అనేక ఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తూ ఉంటాయి. చాలా చోట్ల భార్యలు తమ భర్తల్ని ప్రియుడితో కలిసి హత్య చేస్తుంటే.. కొన్ని చోట్ల భర్తలు తమ భార్యలను హత్య చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసి చాలా మంది పెళ్లి అంటేనే భయంతో దూరంగా పారిపోతున్నారు. ఇటీవల చాలా వరకు భార్యలు భర్తల్ని హతమార్చిన ఘటనలు ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాయి. మరికొన్ని చోట్ల భర్తలు తామేం తక్కువనా అనే విధంగా ముక్కుల్నికొరికేస్తున్నారు. ఓ భర్త తన భార్య ముక్కు అందంగా ఉంది.. ఏదో రోజు కొరుక్కు తింటానని చెప్పి చివరకు అన్నంత పని చేశాడు. మరో ఘటనలో ప్రియుడితో ప్రేమలో మునిగి తేలుతోందని కోపంతో ఊగిపోయిన భర్త తన భార్య ముక్కు కొరికాడు. తాజాగా కర్ణాటకలో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
కర్ణాటకలోని దావణగెరెలో ఓ భర్త తన భార్య ముక్కు కొరికేశాఢు. దీనికి గల కారణం ఏంటంటే.. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం ఈ ఘటనకు దారితీసింది. గాయపడిన ఆ మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

అసలు సంగతి ఏమిటంటే.. ?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవణగెరెకు చెందిన విద్య అనే మహిళ తన భర్త విజయ్ పూచీకత్తుతో లోన్ తీసుకుంది. అయితే విద్య తిరిగి రుణం చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో ఫైనాన్స్ వాళ్లు భర్త విజయ్ ను వేధింపులకు గురిచేశారు. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. విజయ్ తన భార్యను నేలపైకి తోసేశాడు. దీంతో విద్య కిందపడిపోయింది. ఆ సమయంలో విజయ్ తన భార్య ముక్కును కొరికేశాడు. ఆ మహిళ సాయం కోసం కేకలు వేయడం ప్రారంభించింది. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయిన మహిళను చన్నగిరిలోని ప్రభుత్వాస్పతికి తరలించారు. ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో విద్య తన భర్త విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications