Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓనర్ ఇంటిలో రూ. 2 కోట్లు నగలు చోరీ చేసిన భర్త, రిటన్ గిఫ్ట్ ఇచ్చి షాక్ ఇచ్చిన భార్య!

బెంగళూరు/తిరువనంతపురం: బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడ్డాడన్న ఆరోపణలతో తాను పనిచేస్తున్న ప్రైవేట్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇంట్లో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కారు డ్రైవర్‌ భార్య ఇప్పుడు స్వయానా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త చోరీ చేసి ఇంటిలో దాచిపెట్టిన రూ. 1. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అప్పగించడం హాట్ టాపిక్ అయ్యింది.

ఆత్మహత్య చేసుకున్న కారు డ్రైవర్ జిమోన్ వర్గీస్ కొద్ది రోజుల క్రితం ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి గిరిజా దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటి యజమాని గిరిజా నివాసంలోనే కారు డ్రైవర్ జిమోన్ వర్గీస్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ చేయగా జియోన్ వర్గీస్ అతని యజమాని గిరిజా ఇంటిలో దొంగతనం చేసినట్లు బయటపడింది.

Husband commits suicide after stealing Rs 2 crore jewelery from owners house in Bengaluru

అయితే మృతుడి భార్య జుబీనా వర్గీస్‌ పులకేశినగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రూ. 1.50 కోట్ల విలువైన 38 రకాల బంగారు, వజ్రాల ఆభరణాలను పోలీసులకు అప్పగించినట్లు డీసీబీ భీమా శంకర్‌ గులేద్‌ తెలిపారు. కేరళకు చెందిన జియోన్ వర్గీస్ అతని భార్య జుబీనా, ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరు వచ్చి నివాసం ఉంటున్నాడు.

నాలుగేళ్లుగా గిరిజా ఇంట్లో వర్గీస్‌తోపాటు నలుగురు వ్యక్తులు ఇంటి పని చేస్తున్నారు. కారు డ్రైవర్‌గా ఉన్న జియోన్ వర్గీస్ అతని యజమాని గిరిజా ఇంట్లో వారికి తెలియకుండా నగలు ఒక్కొక్కటిగా చోరీ చేశాడు. తన ఇంటిలో పని చేస్తున్న వారి మీద నమ్మకంతో గిరిజా ఇంట్లో స్వేచ్ఛగా తిరిగేలా అవకాశం ఇచ్చారని పోలీసులు అంటున్నారు.

ఇదే అదనుగా జియోన్ వర్గీస్ ఇంటి యజమాని గిరిజా నమ్మకాన్ని వమ్ము చేశాడు. ఇటీవల ఇంట్లో నగలు కనిపించకపోవడంతో ఎట్టకేలకు గత నెల 21వ తేదీన గిరిజా పులకేశి నగర్ పోలీస్ స్టేషన్‌లో చోరీపై ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని గిరిజా ఫిర్యాదులో పేర్కొన్నారు.

Husband commits suicide after stealing Rs 2 crore jewelery from owners house in Bengaluru

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు చేయడంతో భయాందోళనకు గురైన జియోన్ వర్గీస్ తన ఇంటి యజమాని గిరిజా అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో 7 పేజీల డెత్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మృతుడు జియోన్ వర్గీస్‌ ఆరోపించారు.

అయితే పోలీసుల విచారణలో ఇంటి దోపిడీలో జియోన్ వర్గీస్ పాత్ర బయటపడింది. చోరీకి గురైన నగల పెట్టెలో మృతుడు జియోన్ వర్గీస్ వేలిముద్ర లభ్యమైంది. జియోన్ వర్గీస్ భార్య జుబీనా స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నగలు అప్పగించింది. జియోన్ వర్గీస్ చోరీ చేసిన కొన్ని నగలను కేరళలో తాకట్టు పెట్టినట్లు విచారణలో తేలిందని పులకేశీనగర్ పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+