లవ్ మ్యారేజ్, టిక్ టాక్ మోజులో అక్రమ సంబంధం, భర్త నైట్ డ్యూటీలు,భార్యకు అదే పని,ఫోన్ ఎంగేజ్, క్లోజ్
చెన్నై/ కడలూరు: టిక్ టాక్ పలువురు యువకులతో పాటలు పాడి, డ్యాన్స్ లు చేస్తూ పరిచయాలు పెంచుకుని వారితో అక్రమ సంబంధం సాగిస్తున్న వివాహిత దారుణ హత్యకు గురైయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మాటలు పెడచెవిన పెట్టి పరాయి పురుషుల వ్యామోహంతో కాపురాన్ని నిర్లక్షం చేసిన ఆమె జీవితం నాశనం అయ్యింది. చెప్పిన మాట వినకుండా టిక్ టాక్ లో సుమారు 300కు పైగా వీడియోలు పెట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుని మా పరువు తీసిందని, అందుకే చంపేశానని భర్త పోలీసుల విచారణలో అంగీకరించాడు. భర్త నైట్ డ్యూటీలకు వెళ్లడం, భార్య ఫోన్ చేతిలో పట్టుకుని అదే పనిగా గంటలు గంటలు పరాయి పురుషులతో మాట్లాడటంతో ఆమె జీవితం క్లోజ్ అయ్యింది.

ప్రేమ పెళ్లి, ముచ్చటైన పిల్లలు
తమిళనాడులోని కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని కాడాంబులియార్ ప్రాంతానికి చెందిన కుమారవేల్ అలియాస్ కుమార్ (27), నైవేలీ దిడీర్ కుప్పం ప్రాంతానికి చెందిన రాజేశ్వరి (26) ప్రేమించుకున్నారు. తరువాత పెద్దలకు నచ్చచెప్పిన కుమారవేల్, రాజేశ్వరి ప్రేమ వివాహం చేసుకున్నారు. కుమారవేల్, రాజేశ్వరి దంపతులకు 7 ఏళ్లు, 3 ఏళ్లు వయసు ఉన్న ఇద్దరు ముచ్చటైన పిల్లలు ఉన్నారు.

భర్త నైట్ డ్యూటీలు
కుమారవేల్ కారు డ్రైవర్. సొంతంగా కారు తీసుకున్న కుమారవేల్ ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తూన్నాడు. నైట్ డ్యూటీలు ఎక్కువ చేస్తున్న కుమారవేల్ పగటి పూట ఇంటిలో ఉంటున్నాడు. రాజేశ్వరికి మొబైల్ ఫోన్ల పిచ్చి ఎక్కువగా ఉంది. మొబైల్ ఫోన్ తో ఎక్కువ కాలం గడుపుతున్న రాజేశ్వరికి ఇంతకు ముందు ఆమె భర్త కుమారవేల్ ఎందుకు అలా చేస్తున్నావు, ఊరికే లేనిపోని ఆలోచనలు వస్తాయి, మొబైల్ ఫోన్ కు వీలైనంత దూరంగా ఉండాలని సూచించాడు.

స్మార్ట్ ఫోన్ కావాలి !
తనకు స్మార్ట్ మొబైల్ ఫోన్ కావాలని రాజేశ్వరి చెప్పడంతో అతను కొత్త మొబైల్ ఫోన్ తీసిచ్చాడు. ఇక అంతే స్మార్ట్ మొబైల్ ఫోన్ వచ్చిన తరువాత టిక్ టాక్ లోకి రాజేశ్వరి ఎంట్రీ ఇచ్చింది. టిక్ టాక్ లో పరిచయం అయిన యువకులతో పాటలు పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

టిక్ టాక్ లోని ఆమె నీ భార్య కదా ?
టిక్ టాక్ లో రాజేశ్వరి వీడియోలు చూసిన కొందరు స్నేహితులు, సాటి డ్రైవర్లు ఆ వీడియోల్లో ఉన్నది నీ భార్య కదా ? అని కుమారవేల్ ను ప్రశ్నించారు. టిక్ టాక్ లోని కొన్ని వీడియోలు చూసిన భర్త కుమారవేల్ షాక్ కు గురైనాడు. టిక్ టాక్ లో లెక్కలేనన్ని వీడియోల్లో భార్య రాజేశ్వరి దర్శనం ఇవ్వడంతో కుమారవేల్ అయోమయానికి గురైనాడు.

అక్రమ సంబంధం
టిక్ టాక్ పిచ్చితో భార్య రాజేశ్వరి చెప్పిన మాట వినడం లేదని తెలుసుకున్న కుమారవేల్ నాలుగు నెలల క్రితం బన్రూట్టి అన్వర్ షా నగర్ లోని నాలుగో వీధిలో అద్దె ఇంటిని తీసుకుని అక్కడికి మకాం మార్చాడు. అన్వర్ షా నగర్ లోకి ఇంటిని మార్చిన తరువాత అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మురుగన్ అనే వ్యక్తితో రాజేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకుంది.

గంటలు గంటలు ఫోన్ ఎంగేజ్, అదే పని !
రాత్రి డ్యూటీకి వెళ్లిన కుమారవేల్ అనేక సార్లు భార్య రాజేశ్వరి మొబైల్ కు ఫోన్ చేశాడు. అయితే ఎప్పుడు ఫోన్ చేసిన భార్య రాజేశ్వరి ఫోన్ ఎంగేజ్ రావడంతో కుమారవేల్ విసిగిపోయాడు. ఇంటికి వెళ్లిన కుమారవేల్ ఎవరితో మాట్లాడుతున్నావ్ ? ఎప్పుడు చూసినా మొబైల్ ఫోన్ ఎంగేజ్ వస్తోంది ? ఎందుకు ? అని ప్రశ్నించాడు. భర్త ఎప్పుడు అడిగినా ఏదో ఒక సినిమా స్టోరీ చెప్పిన రాజేశ్వరి తప్పించుకోవడానికి ప్రయత్నించింది.

అడ్డంగా బుక్కైన భార్య
రాత్రి ఇంటికి వెళ్లిన కుమారవేల్ షాక్ కు గురైనాడు. ఇంటిలో భార్య రాజేశ్వరి వేరే వ్యక్తితో నగ్నంగా కనపడటంతో కుమారవేల్ ఊగిపోయాడు. వెంటనే కారు జాకీ ఎత్తడానికి ఉపయోగించే ఇనుపరాడ్ తీసుకుని దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. భార్య రాజేశ్వరితో పాటు అక్కడే ఉన్న వ్యక్తి తప్పించుకుని పరారైనాడు. వెంటనే ఇనుప రాడ్ తీసుకున్న కుమారవేల్ భార్య రాజేశ్వరి తల మీద దాడి చెయ్యడంతో ఆమె కుప్పకూలిపోయింది. తలకు తీవ్రగాయాలైన రాజేశ్వరి ప్రాణాలు గాలిలో కలిసిపోయారు.

టిక్ టాక్ లో 300 వీడియోలు
రాజేశ్వరి హత్యకు గురి కావడంతో ఆమె తల్లి సుశీల అల్లుడు కుమారవేల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేశ్వరి తల్లి సుశీల ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన మాట వినకుండా తన భార్య సుమారు 300కు పైగా ఆడుతూ పాడుతూ తీసుకున్న టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిందని, వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం సాగిస్తుందని తెలియడంతో ఆమెను హత్య చేశానని కుమారవేల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications