సెక్స్ వీడియోలతో ఇలా: వేశ్యగా మార్చే ప్లాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరువనంతపురం: ప్రేమించిన వ్యక్తిని నమ్మి అతడిని వివాహం చేసుకొంది. అయితే భర్తే ఆమెను సౌదీలో వేశ్యగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకొని తండ్రి సహయంతో తప్పించుకొన్నానని బాధితురాలు చెబుతోంది. ఓ జాతీయ మీడియాలో ఈ మేరకు బాధితురాలు కథనాలను ప్రసారం చేసింది.

చదువుకొనేందుకు వెళ్ళిన యువతి.. కాలేజీలోనే తోటి యువకుడితో ప్రేమలో పడింది. అయితే ప్రేమ కోసం మతం మార్చుకోవడమే కాకుండా అతడినే వివాహం చేసుకొంది.

అయితే ప్రియుడు ఆమెను మోసం చేసిన విషయాన్ని ఆమె ఎట్టకేలకు గ్రహించింది. తనకు న్యాయం చేయాలని ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

వేశ్యగృహనికి అమ్మేయాలనుకొన్నాడు

వేశ్యగృహనికి అమ్మేయాలనుకొన్నాడు


ప్రేమించిన వ్యక్తే నమ్మించి మోసం చేశాడు. అంతేకాదు ఆమెను నమ్మించి వివాహం చేసుకొన్నాడు. చదువుకొనేందుకు వచ్చిన ఆ యువతి మరో యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరి మతాలు వేరైనా.. యువతి మతం మార్చుకొని ఆ యువకుడిని వివాహం చేసుకొంది. కేరళకు చెందిన యువతి బెంగుళూరులో చదువుకొనేందుకు వెళ్ళి అక్కడే యువకుడిని వివాహం చేసుకొంది. అయితే సౌదీకి తీసుకెళ్ళి వేశ్యగృహనికి విక్రయించాలని ప్లాన్ చేశాడని ఆ యువతి ఆరోపించింది. తండ్రి సహయంతో ఆ యువతి కేరళకు చేరుకొంది. తనకు న్యాయం చేయాలని ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది.

శృంగారంలో పాల్గోన్న వీడియోలు చూపి బెదిరించాడు

శృంగారంలో పాల్గోన్న వీడియోలు చూపి బెదిరించాడు

తన ప్రియుడు తనతో శృంగారంలో పాల్గొన్నప్పుడు తీసిన వీడియోలను చూపించి బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోమన్నాడు. ఈ యేడాది మే నెలలో పెళ్ళి చేసుకొన్నానని ఆమె చెబుతోంది. అయితే తల్లిదండ్రులకు తెలియకుండానే వివాహం చేసుకొన్నానని బాధితురాలు ఆరోపిస్తోంది.

ఐసిస్ ఉగ్రవాదుల వీడియోలు చూపేవాడు

ఐసిస్ ఉగ్రవాదుల వీడియోలు చూపేవాడు

ఐసిస్ ఉగ్రవాదుల వీడియోలు చూపేవాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఇస్లామిక్ క్లాసులకు హాజరుకమ్మనేవాడు. జకీర్ నాయక్ వీడియోలను చూడమనేవాడు. అక్టోబర్ 9వ తారీఖున సిరియా వెళ్లేందుకు ప్లాన్ చేశాడని ఆమె చెబుతున్నారు.అక్టోబర్ 9వ తారీఖున సిరియా వెళ్లేందుకు ప్లాన్ చేశాడు. నన్ను వేశ్యగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకున్నానని బాధితురాలు అంటున్నారు.

తండ్రి సహయంతో తప్పించుకొన్నా

తండ్రి సహయంతో తప్పించుకొన్నా

అక్టోబర్ 3న, తాను ఉన్నప్రాంతాన్ని తల్లిదండ్రులకు వాట్సప్ చేసి.. నా కష్టాన్ని తెలిపాను. ఆలస్యం చేస్తే నేను ప్రాణాలతో బతికి ఉండనని వెల్లడించాను. మా నాన్న అక్టోబర్ 4వ తారీఖున సౌదీకి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా తనను తప్పించాడని బాధితురాలు చెప్పారు. అక్టోబర్ 5వ,తేదిన అహ్మదాబాద్‌కు చేరుకొన్నట్టు బాధితురాలు ప్రకటించారు.ప్రస్తుతం తనకు విడాకులు మంజూరు చేయాలంటూ అతడికి శిక్ష విధించి తనకు న్యాయం చేయాలంటూ కేరళ హైకోర్టులో ఆమె న్యాయపోరాటం చేస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 25-year-old woman on Friday approached the Kerala High Court alleging that she was forcefully converted after her marriage to a Muslim and taken to Saudi Arabia for sex slavery.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి