'మూడు ముద్దుల జీవితం'.. భార్యను బలి చేసిన భర్త కథ!
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఒక హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ముందుగా ఆత్మహత్యగా కనిపించిన ఒక మహిళ మరణం, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణానికి పాల్పడిన భర్తతో పాటు అతని ఇద్దరు ప్రియురాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గంజాం జిల్లాలోని నువాగావ్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఘటనకు దారితీసిన పరిస్థితులు ఇవే..
సంతోష్ నాయక్(30) అనే కూలీకి, అతని భార్య పూజ నాయక్(28)కు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సంతోష్ తన భార్యను కాకుండా మరో ఇద్దరు మహిళలు అనితా నాయక్(26), శృతి పరీడా(21)లతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు ఈ విషయంపై పూజకు, సంతోష్‌కు తరచుగా గొడవలు జరిగేవి. సంతోష్ తన ప్రియురాళ్లతో బహిరంగంగా తిరుగుతూ పూజను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. దీనిపై పూజ తన కుటుంబ సభ్యులకు అనేక సార్లు చెప్పింది. పంచాయతీ స్థాయిలో కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీనితో సంతోష్, అతని ప్రియురాళ్లు పూజ పట్ల మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇద్దరు ప్రియురాళ్లతో సంతోష్ కలిసి ఉండటానికి పూజ అడ్డుగా ఉందని భావించారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లి
గత సోమవారం పూజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని సంతోష్ ఆమె తల్లి శాంతి నాయక్‌కు ఫోన్ చేసి చెప్పాడు. తన కూతురు ఇంటికి వెళ్లిన శాంతిని సంతోష్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. ఇంటి తలుపు వద్దనే నేలపై గుడ్డలో చుట్టి ఉన్న తన కూతురిని చూసి శాంతికి అనుమానం కలిగింది. తన కూతురిని సంతోష్, అతని ప్రియురాళ్లు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని ఆమె పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు అందిన వెంటనే బేలాగుంఠ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం రిపోర్టులో మృతదేహంపై గాయాలు ఉండటం, మెడకు ఉన్న గాయం ఆత్మహత్య కాదని తేలింది. దీంతో పోలీసుల అనుమానం బలపడింది. ఘటన జరిగిన రోజు పూజ, సంతోష్ మధ్య తీవ్ర వాదనలు జరిగాయని దర్యాప్తులో తేలింది. గొడవ మధ్యలోనే లేదా తర్వాత ముగ్గురు నిందితులు కలిసి పూజను హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చూపించడానకి శవాన్ని ఉరేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నిందితుల అరెస్ట్
ప్రాథమిక ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు నిందితులు సంతోష్, అనిత, శృతిలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులను ప్రశ్నిస్తూ.. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హత్యలో ఈ ముగ్గురే కాకుండా ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి దోషులకు కఠిన శిక్ష పడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications