వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య..అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన భర్త

దాంపత్య జీవితంలో అసంతృప్తి ఉంటే ఆ దంపతులను వివాహేతర సంబంధాల వైపు నడిపిస్తుంది. వివాహం తర్వాత సంతృప్తికరమైన అనుబంధం లేకపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం వంటి కారణాలతో వ్యక్తులు కొత్త సంబంధాల కోసం వెతుకుతున్నారు. దాంపత్య జీవితం పట్ల నిరాసక్తత, విసుగు ఉన్నప్పుడు వివాహేతర సంబంధాల పట్ల ఆకర్షితులను చేస్తోంది. ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధాలు చాలా సులభంగా పెరిగిపోతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

దంపతులు వైవాహిక జీవితానికి సరైన గౌరవం ఇవ్వకపోవడం, సంస్కృతిని పక్కనపెట్టడం కూడా ఇందుకు కారణమౌతుంది. తాజాగా ఓ వివాహిత వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఆమె భర్త ఇచ్చిన ట్విస్ట్‌కు అందరి మైండ్ బ్లాక్ అయింది.మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త, భార్యను ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

husband who married his wife to a man who was having an extramarital affair

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన బబ్లూ, రాధిక భార్యాభర్తలు. 2017లో వీరికి పెళ్లికి జరిగింది. వీరి సంసార జీవితం హాయిగా సాగుతోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలోకి మూడో వ్యక్తి ప్రవేశించాడు. అక్కడి నుంచి కథ మొత్తం మారిపోయింది. కుటుంబపోషణ కోసం భర్త తరుచు బయటకు వెళ్లి పనులు చేస్తుండేవాడు. ఇదే అవకాశంగా తీసుకున్న భార్య తమ గ్రామంలోనే తనకంటే వయస్సులో చాలా చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.అయితే రాధిక ఎఫైర్ విషయం కుటుంబానికి తెలిసింది.

Take a Poll

భార్య సంబంధం గురించి కుటుంబ సభ్యులు భర్త బబ్లూకి తెలియజేశారు. పద్దతి మార్చుకోవాలంటూ భార్య రాధికను హెచ్చరించాడు భర్త. అయితే రాధిక తన ప్రవర్తన మార్చుకోలేదు. ప్రియుడితో తన బంధాన్ని కొనసాగించింది. దీంతో విసిగిపోయిన భర్త , భార్య కోరిక మేరకు ప్రియుడును ఆమెకిచ్చి వివాహం జరిపించాడు. అంతేకాకుండా కోర్టుకి తీసుకెళ్లి తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేశాడు.

husband who married his wife to a man who was having an extramarital affair

ఓ నోటరైజ్డ్ అఫిడవిట్ తయారుచేసి తర్వాత రాధికకి ఆమె ప్రియుడితో ఊర్లోని గుళ్లోనే పెళ్లి జరిపించాడు. ఊరు మొత్తం ఈ పెళ్లి చూసింది. ఇద్దరు పిల్లలను తానే సొంతంగా సాకుతానని, తాను ఎంత కష్టమైనా పడి వారికి బాగా చూసుకుంటానని బబ్లూ గ్రామస్థుల ముందు చెప్పాడు. రాధిక కూడా దానికి అంగీకరించింది.ప్రియుడి మోజులో పడి బంగారం లాంటి పిల్లలు,భర్తను వదులుకున్నావ్..నాలుగు రోజులు మోజు తీరాక ఆ ప్రియుడు నిన్ను వదిలేస్తాడు..నీ బతుకు అప్పుడు కుక్కలు చింపిన విస్తరవుతుంది చూస్తుండు అంటూ రాధికను సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలతో విమర్శిస్తుండగా..బబ్లూను ప్రశంసిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+