కరోనా వైరస్ ఎఫెక్ట్: ఫైవ్‌స్టార్ హోటల్ సిబ్బందికి సెల్ఫ్ క్వారంటైన్ ఆదేశాలు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లో ప్రవేశించిన ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్ల యాజమాన్యాలు అప్రమత్తం అయ్యాయి. వివిధ దేశాల నుంచి తమ హోటళ్లలో దిగే విదేశీయులపై నిఘా ఉంచాయి. ఢిల్లీలోని హయత్ రీజెన్సీ హోటల్‌లో దిగిన ఓ వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆ హోటల్ యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. ఆ వ్యక్తి హోటల్ దిగిన రోజు విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మొత్తాన్నీ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది.

ఫైవ్‌స్టార్ హోదా ఉన్న ఈ హోటల్‌లో ఆవరణలో గల లా పిజ్జా రెస్టారెంట్‌లో కిందటి నెల 28వ తేదీన భోజనం చేసిన ఓ వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీనితో అతనికి సేవలను అందించిన లా పిజ్జా రెస్టారెంట్ సిబ్బంది, కిందటి నెల 28వ తేదీన హయత్ రీజెన్సీ హోటల్‌లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులందరికీ 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ విధించింది.

Hyatt Regency in Delhi has asked its staff to self-quarantine for 14 days

ఈ మేరకు హోటల్ జనరల్ మేనేజర్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ జూలియన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రోజువారీ ఉష్ణోగ్రతలను పరిశీలించడంతో పాటు హోటల్‌కు వచ్చే వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రధాన ద్వారం, ఇతర మార్గాల వద్ద ప్రత్యేక తనిఖీ ఏర్పాట్లను చేశామని వెల్లడించారు. సెల్ఫ్ క్వారంటైన్ విధించిన ఉద్యోగులందరికీ 14 రోజుల తరువాతే.. విధులకు హాజరయ్యేలా ఆదేశించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+