Hyderabad: సీఎం ఇంటికి మాజీ సీఎం లగాయిత్తు, ఏం జరుగుతోంది. మొన్న, నిన్న, నేడు ?
హైదరాబాద్/ బెంగళూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావ్ మరోసారి భారతదేశంలోని అనేక పార్టీల నాయకులతో భేటీ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రారంభిస్తునన్న తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావ్ పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల నాయకులను హైదరాబాద్ రప్పించుకుని వారి మద్దతు కూడుగట్టుకుంటున్నారు. భారతదేశంలోని పలు రాజకీయ పార్టీల నాయకుల మద్దతు కూడకట్టుకోవడంలో కేసీఆర్, టీఆర్ ఎస్ నాయకులు చాలా బిజీ అయిపోయారు. ఇదే సందర్బంలో మాజీ ముఖ్యమంత్రి ఒకరు కేసీఆర్ ఇంటి లగాయిత్తు అంటు వెళ్లిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

హైదరాబాద్ లో మాజీ సీఎం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ కుమారుడు, జేడీఎస్ నాయకుడు హెచ్. డీ. కుమారస్వామి శుక్రవారం హైదరాబాద్ చేరుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అవిర్భాబం జరుతున్న సందర్బంగా కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి హైదరాబాద్ వెళ్లడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

మొన్న బీజేపీతో ?
గతంలో హెచ్ డీ. కుమారస్వామి ముఖ్యమంత్రి కావడానికి ప్రత్యక్షంగా బీజేపీ సహకరించింది. ఆ సందర్బంలో హెచ్ డీ. కుమారస్వామి ముఖ్యమంత్రిగా, బీఎస్. యడియూరప్ప ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. తరువాత బీజేపీ, జేడీఎస్ పార్టీల మద్య తేడా రావడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

నిన్న కాంగ్రెస్ తో
తరువాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న హెచ్ డీ కుమారస్వామి మరోసారి సీఎం అయ్యారు. తరువాత ఆపరేషన్ కమల పేరుతో బీఎస్ యడియూరప్ప కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేశారు. తరువాత బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో కర్ణాటక మాజీ సీఎం హెచ్. డీ. కుమారస్వామి హైదరాబాద్ చేరుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావ్ తో మరోసారి భేటీ అయ్యారు.

కుమారస్వామికి భేలే చాన్స్ లు
వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో జేడీఎస్. బీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఇరు పార్టీల నాయకులు ప్రకటించారు. మొత్తం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావ్ మరోసారి కర్ణాటక సీఎం హెచ్. డీ. కుమారస్వామిని. జేడీఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు.