హైదరాబాద్-ఉజ్జయిని: ప్రముఖ పుణ్యేక్షేత్రాలతో ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ ఇదే
హైదరాబాద్: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకునే యాత్రికుల కోసం మంచి టూరిజం ప్యాకేజీ అందిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ వెళ్లే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. 'మధ్యప్రదేశ్ మహా దర్శన్' (Madhya Pradesh Maha Darshan) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
విమాన మార్గంలో (Flight Route) కూడా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తుండటం గమనార్హం. 'మధ్యప్రదేశ్ మహా దర్శన్' (Madhya Pradesh Maha Darshan) పేరుతో ఐఆర్‌సీటీసీ (IRCTC Tourism) ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రస్తుతం ఈ టూర్ ఆగస్ట్ 3వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో ఉజ్జయిని (Ujjain), ఓంకారేశ్వర్ (Omkareshwar), మహేశ్వర్ (Maheshwar) లాంటి అధ్యాత్మిక (Spiritual) పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు.

ఈ పర్యటన హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది.
ఈ టూర్ వివరాలు:
మొదటి రోజు హైదరాబాద్ (Hyderabad)లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు (RGIA)లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 7.45 గంటలకు ఇండోర్ (Indore) చేరుకుంటారు. హోటల్ చెకిన్ అనంతరం ఉజ్జయిని (Ujjain) బయలుదేరాలి. అక్కడ స్థానిక ఆలయాలైన హరసిద్ధి మాత ఆలయం (Harsiddhi Mata Temple), సాందీపని ఆశ్రమం (Sandipani Ashram), కాల భైరవ ఆలయం (Khala Bhairava Temple), మంగళనాథ్ ఆలయం (Mangalanath Temple), చింతామన్ గణేష్ (Chintaman Ganesh Temple) ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం మహాకాళేశ్వర్ ఆలయ (Mahakaleshwar Temple) దర్శనం (మీ స్వంతంగా) చేసుకోవచ్చు. అనంతరం రాత్రికి ఉజ్జయినిలో బస చేస్తారు.
రెండో రోజు ఉదయం అల్పాహారం చేసి మహాకాళేశ్వర్ ఆలయ దర్శనం (మీ స్వంతంగా) ఉంటుంది. అనంతరం ఓంకారేశ్వర్ (Omkareshwar)కు బయలుదేరుతారు. సాయంత్రం ఓంకారేశ్వర్ చేరుకున్న తర్వాత ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి ఓంకారేశ్వర్‌లో బస ఉంటుంది.
మూడో రోజు అల్పాహారం చేసి మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. తర్వాత మహేశ్వర్ (Maheshwar) బయలుదేరుతారు. మహేశ్వర్ చేరుకున్న అనంతరం అహల్యదేవి ఫోర్ట్ (Ahilya Devi Fort ), నర్మదా ఘాట్ (Narmada Ghat) సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ఇండోర్ బయలుదేరాలి. రాత్రికి ఇండోర్‌లో బస ఉంటుంది.
నాలుగో రోజు ఇండోర్‌లో అన్నపూర్ణ మందిర్ (Annapurna Mandhir), లాల్ భాగ్ ప్యాలెస్ (lal Bagh Palace) సందర్శన ఉంటుంది.. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 7.20 గంటలకు ఇండోర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.
ఈ మహా దర్శన్ టూర్ ప్యాకేజీ ధర విషయానికొస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,000, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.22,200, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,300, చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్‌లో బస, 4 బ్రేక్‌ఫాస్ట్, 3 డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే యాత్రికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ 'మధ్యప్రదేశ్ మహా దర్శన్' టికెట్ బుక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications