Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా గుండె బద్దలైంది: భారత్‌లో కరోనా పరిస్థితులపై సత్య నాదెళ్ల ఆవేదన, ‘సాయం చేస్తాం’

న్యూయార్క్/న్యూఢిల్లీ: భారతదేశంలో గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చి వందలాది మంది ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికీ సెకండ్ వేవ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజు లక్షలాది మంది కరోనా బారినపడుతుండగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తన సొంత దేశంలో కరోనా కల్లోలంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆవేదన వ్యక్తం చేశారు.

విపత్కర పరిస్థితుల్లో భారత్..

విపత్కర పరిస్థితుల్లో భారత్..

భారత్‌లో కరోనా పరిస్థితులు చూస్తుంటే తన హృదయం బద్దలవుతోందని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ విపత్కర సమయంలో తాము భారత్‌ కు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఆక్సిజన్, దానికి సంబంధించిన వైద్య అత్యసరాలను భారత్‌కు అందించే విషయంలో సాయం చేస్తామని చెప్పారు.

నా గుండె బద్దలైందని సత్య నాదెళ్ల

'భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి చూసి నా హృదయం బద్దలైంది. సాయం చేస్తామని ప్రకటించిన అమెరికా ప్రభుత్వానికి నా ధన్వవాదాలు. సహాయక చర్యలకు సహాయపడటానికి మైక్రోసాఫ్ట్ తన వాయిస్, వనరులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కొనసాగిస్తుంది. క్లిష్టమైన ఆక్సిజన్ ఏకాగ్రత పరికరాల కొనుగోలుకు మద్దతు ఇస్తుంది' అని సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

భారత్‌లో.. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు, కొత్త కేసులు

భారత్‌లో.. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు, కొత్త కేసులు

కాగా, సెకండ్ వేవ్‌లో మనదేశంలో కరోనా బారినపడుతున్నవారి సంఖ్య అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. గత వారం రోజుల్లోనే ఇండియాలో 22.5 లక్షల కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. అదే సమయంలో 89శాతం మరణాల రేటు పెరిగింది. ఇది ప్రపంచంలోనే చాలా తీవ్రమైన పరిస్థితి కావడం గమనార్హం. ఆదివారం కూడా 3.55 లక్షల కేసులు నమోదు కావడం, 2807 మరణాలు సంభవించడం గమనార్హం. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇప్పటి వరకు ఈ స్థాయిలో కేసులు, మరణాలు నమోదుకాలేదు.

ఢిల్లీకి అమెరికా ఆక్సిజన్..

ఢిల్లీకి అమెరికా ఆక్సిజన్..

ఇక దేశంలో పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో కేంద్రప్రభుత్వం.. ద్రవ ఆక్సిజన్‌ను కేవలం వైద్యం నిమిత్తమే ఉపయోగించాలని, పరిశ్రమలు వినియోగించకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వం పలు దేశాల నుంచి ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటోంది. కాగా, ఆదివారం 300 ఆక్సిజన్ కన్సెంట్రేటర్స్‌ను అమెరికా.. ఇండియాకు పంపించింది. సోమవారం మధ్యాహ్నం వరకు ఈ ఐదు టన్నుల ఆక్సిజన్ కన్సెంట్రేటర్స్ న్యూయార్క్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరనున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+