సీబీఐ డైరెక్టర్‌గా అపాయింట్ అయిన కర్ణాటక డీజీపీ కీలక వ్యాఖ్యలు..!!
న్యూఢిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగట్లేదు. రోజులు గడుస్తున్నప్పటికీ.. సీఎల్పీ నేత ఎన్నికలో జాప్యం కొనసాగుతూనే వస్తోంది. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్‌లల్లో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. సిద్ధరామయ్య-డీకే శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు. కర్ణాటక రాజకీయాలన్నీ ఇక ఢిల్లీ వేదికగా సాగుతున్నాయి.
I will be back to Karnataka after completing my next assignment ie in May 2025. Thanks for all the support.
— DGP KARNATAKA (@DgpKarnataka) May 17, 2023
ఈ పరిస్థితుల మధ్య కర్ణాటక పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్ బదిలీ అయ్యారు. కేంద్ర సర్వీసులకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో- ఆయనను కర్ణాటక ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే కేంద్రం ఆయనను కీలకమైన సీబీఐ డైరెక్టర్‌గా అపాయింట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1986 బ్యాచ్, కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్.. రెండు సంవత్సరాల పాటు సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగుతారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న సుబోధ్ జైస్వాల్ పదవీ కాలం ఈ నెల 25వ తేదీన ముగియనుంది. ఈలోపే ప్రవీణ్ సూద్ బాధ్యతలను స్వీకరిస్తారు.
కేంద్ర సర్వీసులకు వెళ్లనున్న నేపథ్యంలో- ప్రవీణ్ సూద్.. కన్నడిగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఈ ఉదయం వరుస ట్వీట్లు పోస్ట్ చేశారు. 2020 ఫిబ్రవరిలో తాను రాష్ట్ర డీజీపీగా బాధ్యతలను స్వీకరించానని, కర్ణాటక డీజీపీ అనే అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యాయనని, డీజీపీగా ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రజల మన్ననలు పొందగలిగానని చెప్పారు.
I will soon be handing over charge to my successor and exiting out of this official handle of DG & IGP Karnataka. I started this handle in Feb 2020 after taking charge and connected with all of you on official matters. Glad to note that more than 1.6 lakh people are following it.
— DGP KARNATAKA (@DgpKarnataka) May 17, 2023
కర్ణాటక డీజీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను లక్షా 60 వేల మందికి పైగా నెటిజన్లు ఫాలో అవుతుండటమే దీనికి నిదర్శనమని ప్రవీణ్ సూద్ అన్నారు. సీబీఐ డైరెక్టర్‌గా తన పదవీ కాలం ముగిసిన తరువాత.. 2025 మే నాటికి మళ్లీ సొంత రాష్ట్రానికి తిరిగి వస్తానని ప్రవీణ్ సూద్ వివరించారు. త్వరలోనే తన తదుపరి కొత్త డీజీపీకి బాధ్యతలను అప్పగించనున్నట్లు చెప్పారు. కన్నడ ప్రజలు అందించిన ఆదరాభిమానాలను మరిచిపోలేనని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications