తమిళనాడు రాజకీయ తెరపై కొత్త కాంబినేషన్.. తెరపైకి రజనీకాంత్-కమల్‌హాసన్...
తమిళనాడు పొలిటికల్ స్క్రీన్‌పై కొత్త కాంబినేషన్ కనిపించబోతోంది. గత 44 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్‌ను ఏలుతున్న రజనీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు కమల్‌హాసన్ సంకేతాలు ఇచ్చారు. ఒడిశాలోని సెంచూరియన్ వర్సిటీ నుంచి కమల్ హాసన్ గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. తిరిగి చెన్నై వచ్చిన సందర్భంలో మీడియా ప్రతినిధులు కమల్‌ను రాజకీయాల గురించి ప్రశ్నించారు. రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తారా అంటే ఓ ఎస్ అంటూ సిగ్నల్ ఇచ్చారు.

కలిసి పనిచేస్తాం..
వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ స్పష్టంచేశారు. దీంతో రజనీ-కమల్ రాజకీయ ముఖచిత్రంపై సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. సినిమాల్లో పోటీ పడి నటించిన మిత్రులు.. రాజకీయాల్లో కలిసి పనిచేయడం అరుదు. అలాంటిది కమల్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

44 ఏళ్ల నుంచి..
రజనీ, తాను గత 44 ఏళ్లుగా సినిమాల్లో కలిసి నటిస్తున్నామని చెప్పారు. రాజకీయాల్లో కూడా కలిసి పనిచేసే అవకాశం రావొచ్చని హింట్ ఇచ్చారు. దీంతో రజనీ-కమల్ కలిసి పనిచేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ స్థాపించగా.. రజనీకాంత్ పార్టీ ప్రకటిస్తానని హింట్ ఇచ్చారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు వీరిద్దరూ తమ పార్టీలను బలోపేతం చేసుకొని ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది.

రికార్డే..
కమల్-రజనీ కలిసి పనిచేస్తే అదో రికార్డే అవుతుంది. ఇదివరకే స్టార్లు కలిసి ప్రచారం చేసిన సందర్భాలు అరుదు. ఎంజీఆర్, కరుణానిధి పనిచేసినా.. వారిలో ఒకరు రచయిత అయిన సంగతి తెలిసిందే. రజనీ-కమల్ ఇద్దరూ నటులే.. అదీ కూడా సూపర్ స్టార్లే కావడం ఆసక్తి కలిగిస్తోంది. వీరి కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

రజనీ రియాక్ట్..
కమల్ కామెంట్లపై రజనీ స్పందించాల్సి ఉంది. కమల్ సూచనకు రజనీ అంగీకారం తెలిపితే అభిమానులకు పండగే. కమల్-రజనీ కాంబినేషన్ కోసం సమిష్టిగా కలిసి పనిచేసి.. పార్టీని అధికారంలోక తీసుకొస్తామని కొందరు చెప్తుండటం వారి క్రేజీ కాంబినేషన్‌కు అద్దం పడుతుంది.












Click it and Unblock the Notifications