వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్జికల్ స్ట్రైక్ ప్రకటనను హోంమంత్రి ఎందుకు చేయలేదు!!

By Chanakya
|
Google Oneindia TeluguNews

సర్జికల్ స్ట్రైక్ ప్రకటనను హోంమంత్రి ఎందుకు చేయలేదు!!! దీని వెనుక ఎవరూ ఊహించనంత స్కెచ్.పాక్‌ ఆక్రమణలో ఉన్న జైషే మొహమ్మద్‌పై భారత వైమానిక దళం దాడి చేసిందంటే.. ఇదో అతిపెద్ద వార్త. దేశం యావత్తూ దీన్ని ఎంతో ఆసక్తిగా చూస్తుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలని అందరూ ఆతృతగా చూస్తారు. అయితే దేశ హోంమంత్రి, డిఫెన్స్ మినిస్టరో, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రో ప్రకటన చేయకుండా ఫారిన్ సెక్రటరీ విజయ్ గోఖలేతో ప్రకటన చేయించడం అందరి ఆశ్చర్యపరిచింది.

అయితే దీని వెనుక కూడా ఓ అతిపెద్ద వ్యూహం ఉందనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం.విదేశీ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని మాత్రమే చెప్పేసి వెళ్లిపోయారు. ఒక్క అక్షరం కూడా ఎక్కువ మాట్లాడలేదు. అంతే కాదు ఆయన వాడిన పదాలు కూడా చాలా ఆచితూచి ఉన్నాయి. టెర్రరిజాన్ని అంతమొందించడానికి తీసుకున్న చర్యగా ఆయన అభివర్ణించారు.

అంతేకాదు ఇదో నాన్ మిలటరీ ఆపరేషన్ అని జైషే క్యాంప్ పై మాత్రమే తమ టార్గెట్ అనే విషయాన్ని ఆయన వెల్లడించారు.సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగా తాము ఈ దాడి చేశామని, ఆ దేశ పౌరులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదని గోఖలే చెప్పారు. ఆశ్చర్యం ఏమంటే ఈ విషయాలను ఎయిర్‌ఫోర్స్ చీఫ్ చెప్పలేదు. గోఖలేనే వివరించారు.

IAF Bombing Destroys Jaish Camp in Pakistan’s Balakot

డిప్లమాట్స్ ఎందుకు విదేశీ వ్యవహారాల దౌత్యవేత్తలు చాలా ఆచితూచి మాట్లాడతారు. వాడే ప్రతీ పదం వెనుక చాలా ఆంతర్యం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. భారత దేశ స్టాండ్‌ను అంతర్జాతీయ కమ్యూనిటీకి చేరాలంటే వీళ్లే సరైన వ్యక్తులు.

మరో పాయింట్ ఏంటంటే.. పుల్వామా దాడి జరిగి ఇప్పటికే 11 రోజులైంది. ఈ గ్యాంగ్‌లో 25 దేశాల దౌత్యవేత్తలతో గోఖలే చర్చలు జరిపారు. పాకిస్తాన్ దుశ్చర్యలను, పరోక్షంగా వాళ్ల సహకారాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టిలో ఎండగట్టేందుకు మార్గం సుగమం చేశారు. ఇప్పటికే 100 దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచారు. దాడిని పూర్తిస్థాయిలో ఖండించారు.

దాడి పాక్ పై కాదు.. ఉగ్రవాదంపైనే భారత వైమానిక దళం చేసిన ఈ దాడి ముష్కర మూకలపైనే కానీ పాక్ పై మాత్రం కాదు అనే సందేశాన్ని ఇవ్వగలిగారు.ఎందుకంటే అప్పుడే మనకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు మరింతగా వస్తుంది. ఈ నేపధ్యంలో గోఖలే వాడిన పదాల దగ్గర నుంచి ఆయన వ్యవహార శైలి వరకూ వివిధ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. అందుకే రెగ్యులర్‌గా మాట్లాడే రాజకీయ నాయకులు కాకుండా డిప్లమాట్స్‌ను ఎంచుకోవడం వెనుక స్టోరీ ఇది.

English summary
According to government sources, 12 Mirage-2000 fighter jets pounded the camp with 1,000 kg of laser guided-bombs, killing up to 350 terrorists and trainers who were moved there for their protection after the Pulwama terror attack on February 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X