ఒడిశాలో కుప్పకూలిన వైమానిక దళ విమానం
Recommended Video

ఒడిశాలో కుప్పకూలిన వైమానిక దళ విమానం
న్యూఢిల్లీ: ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో భారత వైమానిక దళ (ఐఎఎఫ్) హాక్ అడ్వాన్స్‌డ్ ట్రైనర్ జెట్ మంగళవారం కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగిన చోటు జార్ఖండ్ సరిహద్దుల్లో ఉంది.
ట్రైనీ పైలట్ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, కొద్దిగా గాయాల పాలయ్యారు. అతి సాధారణంగా జరిగే శిక్షణలో భాగంగా విమానం ఖరగ్‌పూర్లోని కలైకుండ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరింది. సంఘటనపై విచారణకు ఆదేశించారు.

నెల రోజుల క్రితం ఐఎఎఫ్‌కు చెందిన మైక్రోలైట్ వైరస్ ఎస్‌డబ్ల్యు -80 హెలికాప్టర్ అస్సాంలోని ముజాలీ దీవిలో కూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్ వింగ్ కమాండర్లు జె. జేమ్స్, డి. వాట్స్ మరణించారు.
అస్సాం ప్రమాదంలో పైలట్లు అత్యవసరంగా హెలికాప్టర్‌ను దించే ప్రయత్నం చేశారు. అయితే, అది ఇసుకలోకి కూరుకపోయి మంటలు లేచాయి.












Click it and Unblock the Notifications