జైసల్మేర్‌లో కుప్పకూలిన మిగ్ 21 యుద్ధ విమానం: పైలట్ మృతి
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం శుక్రవారం సాయంత్రం రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో కుప్పకూలింది. విమానం పైలట్ కోసం అన్వేషణ ప్రారంభించినట్లు సంబంధిత వైమానిక దళం అధికారులు వెల్లడించారు.
సామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెసర్ట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో మిగ్-21 ప్రమాదం జరిగిందని జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ పీటీఐకి తెలిపారు. పైలట్ దుర్మరణం పాలయ్యారు.

ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఇటీవల తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటన మరువకముందే మరో విమానం ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది.
తమిళనాడులో IAF హెలికాప్టర్ ప్రమాదంలో మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిద్దర్, మరో 11 మంది మరణించిన కొద్ది వారాల తర్వాత ఈ సంఘటన జరిగింది.
కోయంబత్తూరులోని సూలూర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంఐ-17వీ-5 హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications