కాశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి
Poonch attack: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. దాడులకు తెగబడ్డారు. వైమానిక దళం కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎయిర్‌ఫోర్స్ జవాన్ వీరమరణం పొందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పట్ల కేంద్ర ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహులో గాంధీ స్పందించారు. ఆటవిక చర్యగా అభివర్ణించారు.
జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సురాన్‌కోట్ సమీపంలో షాసితార్ వద్ద వైమానిక దళానికి చెందిన గరుడ్ విభాగం ప్రత్యేక బలగాల కాన్వాయ్ వెళ్తోన్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అయిదుమంది జవాన్లు గాయపడ్డారు.

సమాచారం అందిన వెంటనే రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన భద్రత బలగాలు, స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఉధంపూర్ కమాండ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒకరు వీరమరణం పొందారు.
అనంతరం రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్లు యుద్ధ ప్రాతిపదికన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దాడి చేసిన టెర్రరిస్టుల కోసం అణువణువూ తనిఖీలు జరిపారు. షాసితార్, సనై, జర్రా వాలి గలీ.. వంటి ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు.
ఉగ్రవాదుల కదలికలు ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే అన్ని వాహనాలనూ తనిఖీ చేస్తోన్నారు జవాన్లు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనడానికి సిద్ధపడ్డారు. అత్యంత సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేశారు.
ఈ దాడి పట్ల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జవాన్లపై దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. జవాన్ వీరమరణం పొందడటం పట్ల సంతాపం తెలిపారు. ఇలాంటి దాడుల సమయం దేశం యావత్తూ సైన్యానికి అండగా ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications