రూ. 1.5 లక్షల కోట్లతో 114 యుద్ధ విమానాలు:ఆత్మనిర్భర్ భారత్ కింద ఇక్కడే తయారీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకం స్ఫూర్తితో భారత వైమానిక దళం 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది. రూ.1.5 లక్షల కోట్లతో 114 యుద్ధ విమానాలను మకూర్చుకోవాలనుకుంటున్న భారత్ వాటిలో 96 యుద్ధ విమానాలను స్వదేశంలోనే తయారు చేసేందుకు సిద్ధమవుతోంది.మిగిలిన 18 ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్న విదేశీ విక్రేతల నుంచి దిగుమతి చేయబడతాయి.
నివేదిక ప్రకారం.. భారతీయ వైమానిక దళం 'బై గ్లోబల్ అండ్ మేక్ ఇన్ ఇండియా' పథకం కింద 114 మల్టీరోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ (MRFA)ని కొనుగోలు చేసే ప్రణాళికలను కలిగి ఉంది. దీని కింద భారతీయ కంపెనీలు విదేశీ విక్రేతతో భాగస్వామ్యం చేయడానికి అనుమతించబడతాయి.
'ఇటీవల, భారతీయ వైమానిక దళం విదేశీ విక్రయదారులతో సమావేశాలు నిర్వహించింది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును ఎలా చేపడుతుందో దాని గురించి వారిని అడిగింది' అని ప్రభుత్వ వర్గాలు వార్తా సంస్థకు తెలిపాయి.

ప్రాథమిక 18 విమానాలను దిగుమతి చేసుకున్న తర్వాత, తదుపరి 36 విమానాలు దేశంలోనే తయారు చేయబడతాయి, చెల్లింపులు పాక్షికంగా విదేశీ కరెన్సీ, భారతీయ కరెన్సీలో చేయబడతాయి.
చివరి 60 ఎయిర్‌క్రాఫ్ట్‌ల బాధ్యత భారతీయ భాగస్వామిపై ఉంటుంది, దానికి సంబంధించిన చెల్లింపును భారత ప్రభుత్వం భారత కరెన్సీలో చెల్లిస్తుంది.
బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, సాబ్, మిగ్, ఇర్కుట్ కార్పొరేషన్, డస్సాల్ట్ ఏవియేషన్‌తో సహా గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు టెండర్‌లో పాల్గొంటారని భావిస్తున్నారు.
ఐఏఎఫ్ దాని ఫైటర్ జెట్ అవసరాలకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారం కోసం వెతుకుతోంది. ఎందుకంటే తక్కువ కార్యాచరణ ఖర్చుతో కూడిన విమానం సేవకు మరింత సామర్థ్యాన్ని అందిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 114 యుద్ధ విమానాలు అమ్ముల పొదిలో చేరుతుండటంతో పాకిస్థాన్, చైనాలు కొంత కలవరానికి గురవుతున్నాయి.












Click it and Unblock the Notifications