వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''నేను ఢిల్లీకే ముఖ్యమంత్రిని'', ''పంజాబీలను ఆప్ విశ్వసించడం లేదు''

తాను ఢిల్లీకే ముఖ్యమంత్రి అని, పంజాబ్ కు కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ఎన్నికైన ఎంఏల్ఏలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకొంటారని ఆప్ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ :పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా తాను లేనని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.తమ పార్టీకి పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం కట్టబెడితే ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలయ్యేలా చూస్తామని ఆయన చెప్పారు.

పంజాబ్ ఎన్నికలపై ఆప్ కేంద్రీకరించి పనిచేస్తోంది. 2014 ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పార్టీ అనూహ్యంగా నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొంది. ఈ విజయాలతో ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ కేంద్రీకరించింది.

పంజాబ్ రాష్ట్రంలో ఆప్ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.పంజాబ్ లో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకొంటే ఆప్ ఖాతాలో మరో రాష్ట్రం చేరనుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఆప్ కు ఓటు వేస్తే కేజ్రీవాల్ కే ఓటు వేసినట్టేనని ఆ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై ప్రత్యర్థులు ఆప్ పై విమర్శులు గుప్పిస్తున్నారు.

ఢిల్లీకే ముఖ్యమంత్రిని పంజాబు కాదన్న కేజ్రీవాల్

ఢిల్లీకే ముఖ్యమంత్రిని పంజాబు కాదన్న కేజ్రీవాల్

తాను ఢిల్లీకే ముఖ్యమంత్రినని పంజాబ్ కాదని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కడితే ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేసేందుకు తాను ముందుంటానని చెప్పారు. పంజాబ్ ఎన్నికల సందర్భంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. అరవింద్ కేజ్రీవాల్ కూడ విస్తృతంగా పంజాబ్ లో పర్యటిస్తున్నారు.అయితే ఈ ఎన్నికల్లో ఆప్ కు వేసే ఓట్లు అరవింద్ కేజ్రీవాల్ కు వేసినట్టేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.అయితే ఈ ప్రచారంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తోంటే అరవింద్ కేజ్రీవాల్ వివరణ ఇచ్చాడు. తాను ఢిల్లీకే ముఖ్యమంత్రినని ప్రకటించాడు.

ఆప్ ప్రచారంపై ప్రత్యర్థుల విమర్శలు

ఆప్ ప్రచారంపై ప్రత్యర్థుల విమర్శలు

పంజాబ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది ఆప్.2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన పార్లమెంట్ స్థానాలే ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రధానంగా కేంద్రీకరించి పనిచేసేందుకు కారణమైంది. ఈ రాష్ట్రంలో సిద్దూను తమ పార్టీలోకి తీసుకోవాలని భావించినా సిద్దూ మాత్రం చివరి నిమిషంలో మనసు మార్చుకొన్నారు. స్థానికేతరులను, ఆ పార్టీలకు ఓట్లు వేయకూడదని ప్రత్యర్థులు ఆప్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

ఎంఏల్ఏలే సిఎం అభ్యర్థిని ఎన్నుకొంటారు

ఎంఏల్ఏలే సిఎం అభ్యర్థిని ఎన్నుకొంటారు

పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పార్టీ నిర్ణయించదని ఆప్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంఏల్ఏలే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకొంటారని ఆ పార్టీ ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఉన్నట్టు సర్వేలు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వ్యతిరేకత ఇతర పార్టీలకు ఏ మేరకు కలిసి వస్తోందోననే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

పంజాబ్ వ్యతిరేక పార్టీలకు బుద్దిచెప్పండి

పంజాబ్ వ్యతిరేక పార్టీలకు బుద్దిచెప్పండి

పంజాబ్ వ్యతిరేక పార్టీలకు బుద్దిచెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకొని అకాలీదళ్ బిజెపి సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. పంజాబ్ కు వ్యతిరేకంగా ఉండే పార్టీలను, నాయకులను తిరస్కరించాల్సిందిగా పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ ట్వీట్ చేశాడు.దొరికిన అవకాశాన్ని వదులుకొనేందుకు ఆప్ ప్రత్యర్థులు వదులుకోవడం లేదు.

English summary
iam cm for delhi , not punjab said aravind . on fed 4th elections in punjub ,aap concentrate on punjub elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X