IAS Officer: బెంగళూరు జిల్లా కలెక్టర్ అరెస్టు, 14 రోజులు రిమాండ్. ఐటీ హబ్ చరిత్రలో, రూ. 5 లక్షలు డీల్ !
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు జిల్లాధికారి (జిల్లా కలెక్టర్)ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించడం కలకలం రేపింది. భూమి వివాదానికి సంబంధించి సెటిల్ మెంట్ చెయ్యడానికి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా కలెక్టర్ మంజునాథ్ ను, ఆ కార్యాలయం సిబ్బందిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఎస్ఐ ఉద్యోగాల స్కామ్ కేసులో ఏడీజీపీ అమృత్ పాల్ ఐపీఎస్ ను అరెస్టు చెయ్యడంతో కర్ణాటకలోని పోలీసు శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.

ఐఏఎస్ అధికారికి 14 రోజులు రిమాండ్
బెంగళూరు జిల్లాధికారి మంజునాథ్ సూచనమేరకే మేము లంచం తీసుకున్నామని సిబ్బంది అంగీకరించడంతో ఐఏఎస్ అధికారి మంజునాథ్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు జిల్లాధికారి మంజునాథ్ ను 14 రోజులు రిమాండ్ కు పంపించడం కలకలం రేపింది.

రూ. 15 లక్ష్లలు లంచం డిమాండ్
బెంగళూరులో నివాసం ఉంటున్న వ్యక్తికి బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ సమీపంలోని కూడ్లు గ్రామంలో 38 గుంటల భూమి ఉంది. ఈ భూమి వివాదం బెంగళూరు జిల్లా న్యాయాలయంలో విచారణ జరుగుతోంది. ఈ వివాదం పరిష్కరించడానికి బెంగళూరు జిల్లాధికారి కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ (మేనేజర్)గా పని చేస్తున్న మహేష్ రూ. 15 లక్షలు లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

రూ. 5 లక్షలు తీసుకుంటూ చిక్కిపోయారు
చివరికి ఇరు వర్గాల మీద చర్చలు జరగడంతో రూ. 5 లక్షలు లంచం ఇవ్వడానికి డీల్ కుదిరింది. బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు జిల్లాధికారి కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న మహేష్ బాధితురడి నుంచి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ రవిశంకర్, ఆయన సిబ్బంది వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కలెక్టర్ చెప్పారని రూ. 5 లక్షలు తీసుకున్నాము
బెంగళూరు జిల్లాధికారి మంజునాథ్ సూచనమేరకు మేము రూ. 5 లక్షలు లంచం తీసుకున్నామని మంజునాథ్ ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ కథ అడ్డం తిరిగింది. బెంగళూరు జిల్లాధికారి మంజునాథ్ కు నోటీసులు ఇచ్చిన ఏసీబీ అధికారులు ఆయన్ను ఏసీబీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు.

నిన్న ఐపీఎస్, నేడు ఐఏఎస్ అధికారి అరెస్టు
బెంగళూరు జిల్లాధికారి మంజునాథ్ లంచం తీసుకోవాలని చెప్పారని వివచారణలో వెలుగు చూడటంతో ఆయన్ను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. ఇప్పటికే ఎస్ఐ ఉద్యోగాల స్కామ్ కేసులో ఏడీజీపీ అమృత్ పాల్ ఐపీఎస్ ను అరెస్టు చెయ్యడంతో కర్ణాటకలోని పోలీసు శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications