కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి సంచలన నిర్ణయం

ఐపీఎస్ అధికారిణి డీ రూప, తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి మధ్య తలెత్తిన వివాదం మరింత ముదిరింది. ఇవ్వాళ రోహిణి సింధూరి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరువునష్టం దావా వేశారు.

బెంగళూరు: కర్ణాటక కేడర్ కు చెందిన తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎస్ అధికారిణి డీ రూపా ముద్గిల్ తో తలెత్తిన వివాదం అనంతరం బదిలీ వేటును ఆమె ఎదుర్కొన్నారు. డీ రూపతో వివాదం తలెత్తిన నేపథ్యంలో- ఆ ఇద్దరినీ బదిలీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. దేవాదాయ శాఖ కమిషనర్ ఉన్న రోహిణి సింధూరిపై బదిలీ వేటు వేసింది. ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. వెయిటింగ్ లో ఉంచింది.

బదిలీ తరువాత..

బదిలీ తరువాత..

ఇదే వివాదంలో ఐపీఎస్ అధికారిణి డీ రూపను కూడా కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న డీ రూపను ఆ హోదా నుంచి తప్పించింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో డీ రూప భర్త, ఐఎఎస్ అధికారి మునీశ్ మౌద్గిల్ ను కూడా బదిలీ చేసింది బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం. సర్వే సెటిల్ మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ గా ఉన్నమునీశ్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కు పంపించింది.

పరువునష్టం దావా..

పరువునష్టం దావా..

ఈ వివాదం తరువాత రోహిణి సింధూరి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డీ రూపపై పరువునష్టం దావా వేశారు. ఏకంగా కోటి రూపాయలను చెల్లించడంతో పాటు- బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. రూపతో పాటు 66 మందికి సమన్లను జారీ చేసింది. న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.

19 ఆరోపణలు..

19 ఆరోపణలు..

తన ప్రైవేట్ ఫొటోలను రోహిణి సింధూరి బహిర్గతం చేశారని, వాటిని తోటి ఐఎఎస్ అధికారులకు షేర్ చేశారంటూ డీ రూప ఆరోపించిన విషయం తెలిసిందే. దీనితో పాటు 19 రకాల ఆరోపణలు చేశారు. వాటన్నింటినీ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే సా.రా. మహేష్‌ తో చర్చల విషయం బహిర్గతం కావడంతో రోహిణి సింధూరిపై ఆరోపణల వర్షం కురిపించారు. రోహిణి సింధూరి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేతో

ఎమ్మెల్యేతో

మైసూరులో సా.రా. మహేష్ భూఆక్రమణకు పాల్పడినట్లు స్వయంగా ఆయనపై ఆరోపణలు చేసిన రోహిణి సింధూరి ఇప్పుడు ఆయనను ఎందుకు కలిశారని ప్రశ్నించారు. అలాంటి నాయకుడిని రోహిణి సింధూరి తోటి ఐఏఎస్ అధికారి మణిమన్నన్ తో వెళ్లి కలిశారని, దీనికి గల కారణాలను వెల్లడించాలని డీ రూప డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే లేదా రాజకీయ నాయకులను ఐఎఎస్ స్థాయి అధికారి కలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

26 లక్షల విలువ..

26 లక్షల విలువ..

బీజేపీకి చెందిన మైసూరు లోక్ సభ సభ్యుడు ప్రతాప సింహాపైనా రోహిణి సింధూరి గతంలో పలు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. బెంగళూరు జాలహళ్లిలో విశాలమైన ఇంటిని రోహిణి సింధూరి కట్టుకున్నారని, స్థిరాస్తి రిటర్న్స్‌లో ఈ ఇంటి ప్రస్తావన లేదని గుర్తు చేశారు. కోట్ల విలువ రూపాయల విలువ చేసే ఇటాలియన్ ఫర్నీచర్, 26 లక్షల రూపాయల విలువ చేసే జర్మన్ ఇంటీరియర్స్ ను దీనికి వినియోగించారని అన్నారు. వీటన్నింటికీ డబ్బలు ఎక్కడివని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+