వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ఉచితంగా రోమింగ్ కాల్స్ పై ఛార్జీలను ఎత్తివేసిన ఐడియా

రిలయన్స్ పోటీని తట్టుకొనేందుకుగాను ఎయిర్ టెల్ బాటలోనే ఐడియా కూడ పయనిస్తోంది. రోమింగ్ లో ఉన్నసమయంలో ఇన్ కమింగ్ కాల్స్ కు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ కంపెనీ ప్రకటించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రిలయన్స్ జియో నుండి ఎదురౌతున్న పోటీని తట్టుకొనేందుకుగాను టెలికం కంపెనీలు తమ టారిఫ్ రేట్లలో మార్పులుచేర్పులు చేస్తున్నాయి. ఎయిర్ టెల్ బాటలోనే తాజాగా ఐడియా కూడ పయనించాలని నిర్ణయించింది. ఈ మేరకు రోమింగ్ లో ఉన్న సమయంలో ఇన్ కమింగ్ కాల్స్ కు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ కంపెనీ ప్రకటించింది.

రిలయన్స్ జియో నుండి ఎదురౌతున్న పోటీని తట్టుకొనేందుకుగాను ఇతర టెలికం కంపెనీలు తమ టారిఫ్ లను మార్పులు చేర్పులు చేస్తున్నాయి.

ఇటీవలనే ఎయిర్ టెల్ తన టారిఫ్ రేట్లను ప్రకటించింది.రోమింగ్ లో ఉన్న చార్జీలు ఎత్తివేస్తూ ఎయిర్ టెల్ నిర్ణయం తీసుకొంది. ఇదే బాటలో పయనించనున్నట్టు ఐడియా ప్రకటించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి 20 కోట్ల మంది ఐడియా వినియోగదారులు ఇన్ కమింగ్ కాల్స్ ను రోమింగ్ లో ఉన్నప్పుడు ఇక పై ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఐడియా ప్రకటించింది. 2జీ, 3జీ 4 జీ నెట్ వర్క్ లలో దేశంలో ఎక్కడి నుండైనా ఇకపై సాధారణ ఛార్జీలకే కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది ఐడియా.

idea

ఆపై డేటా చార్జీలు కూడ సొంత సర్కిల్ లో ఉన్నవే. దేశవ్యాప్తంగా వర్తిస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. డేటాకు కూడ ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. ప్రీ పెయిడ్ ,పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు వర్తిస్తోందని ఐడియా ప్రకటించింది.

అంతర్జాతీయ రోమింగ్ కోసం ప్రత్యేక ప్యాక్ లను తెచ్చింది ఐడియా. ఆసియాలో రూ.2,499, యూరప్ దేశాల్లో అయితే రూ.5999 రీ చార్జీ చేసుకోవడం ద్వారా 400 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ తో పాటు వంద ఎస్ ఎం ఎస్ లు 3 జీబీ ఇంటర్నెట్ తో పాటు అపరిమిత ఇన్ కమిగ్ కాల్స్ పొందొచ్చని తెలిపింది. ఈ ప్యాక్ లు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని తెలిపింది ఐడియా.

English summary
Idea Cellular, India’s third largest mobile operator, will start providing free incoming calls to customers roaming in the country from April 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X