వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Doctor: ఆడ పిల్ల పుడితే ఆస్పత్రి ఫీజ్ ఉండదట.. ఎక్కడంటే..

|
Google Oneindia TeluguNews

పూణేకు చెందిన ఒక వైద్యుడు తన "బేటీ బచావో జనందోలన్"లో భాగంగా ఆడపిల్లను రక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.మిషన్‌లో భాగంగా ఎక్కువ మంది ఆడపిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నాడు. తన ఆసుపత్రిలో ఆడ పిల్లలు పుట్టినందుకు ఆసుపత్రి ఫీజులను మాఫీ చేస్తున్నాడు. ఆడపిల్లలకు అద్భుతమైన స్వాగతం పలికుతున్నాడు. మహారాష్ట్రలోని పూణే సిటీలోని హదప్సర్ ప్రాంతంలో మెటర్నిటీ-కమ్-మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్ గణేష్ రఖ్ 11 సంవత్సరాల క్రితం "బేటీ బచావో మిషన్"ని ప్రారంభించారు.

2,400
అప్పటి నుంచి లింగ వివక్షపై అవగాహన కల్పించడానికి వారి తల్లిదండ్రుల నుంచి రుసుము వసూలు చేయడం లేదు.2,400 కంటే ఎక్కువ మంది ఆడపిల్లలు పుడితే ఆస్పత్రి ఫీజ్ తీసుకోలేదు డాక్టర్ రఖ్. అంతేకాదు తన ఆసుపత్రిలో ఆడపిల్లను ప్రసవించిన ప్రతిసారీ కేక్‌లు కట్ చేసి వేడుకను నిర్వహిస్తారట. తల్లిదండ్రులకు సన్మానం కూడా చేస్తారట. "నేను ఈ బేటీ బచావో మిషన్‌ను దాదాపు 11 సంవత్సరాల క్రితం ప్రారంభించాను.

ఈ మిషన్‌లో, మేము ఆడపిల్ల పుట్టినప్పుడల్లా రోగికి మొత్తం ఆసుపత్రి ఫీజును మాఫీ చేస్తాము. మేము ఆడపిల్ల పుట్టినప్పుడు కూడా జరుపుకుంటాము. కేక్‌లు కట్ చేసి, మిఠాయిలు పంచి, ఆడపిల్లల తల్లిదండ్రులను సత్కరిస్తున్నామని, 11 ఏళ్లలో దాదాపు 2,430 మంది ఆడపిల్లలను మా ఆసుపత్రిలో ప్రసవించారు. ఆడపిల్ల జన్మనిచ్చిన సందర్భంగా మా ఆసుపత్రిలో వేడుక జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.

If a girl child is born, no fee will be charged in that hospital in Pune

25 లక్షల మంది వాలంటీర్లు
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తల్లికూతురుకు ఇంటి వరకు వెళ్లే ఏర్పాట్లు కూడా చేస్తారట. "మాకు ప్రజల నుంచి, మా వైద్యులు, సామాజిక సంస్థల నుంచి కూడా అద్భుతమైన మద్దతు లభించింది. ఇప్పటి వరకు చాలా మంది వైద్యులు, 13000 సామాజిక సంస్థలు, 25 లక్షల మంది వాలంటీర్లు మాతో కలిసి పనిచేస్తున్నారు." డాక్టర్ రఖ్ చెప్పారు.

English summary
Dr. Ganesh Rakh initiated a program to save the girl child as part of "Beti Bachao Janandolan". Apart from fee mapping, if a girl child is born, there is a celebration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X