‘నేను నోరు విప్పితే దేశం వణికిపోతుంది’: ఖడ్సే సంచలనం
ముంబై: మహారాష్ట్రలో నెల క్రితం వరకూ మంత్రి కొనసాగి.. పలు ఆరోపణలు రావడంతో తన పదవికి రాజీనామా చేసిన బిజెపి నేత ఏక్‌నాథ్ ఖడ్సే గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను నోరు తెరిస్తే దేశం మొత్తం వణికిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురువారం తన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఒకవేళ గొంతు విప్పితే భారతదేశం మొత్తం గజగజ వణికిపోతుందన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి, శివసేనతో పార్టీ కలవడానికి తానే కారణమని అన్నారు.

లేకపోతే శివసేనకు చెందిన నాయకుడే రాష్ట్రంలో సీఎం అయ్యేవారని చెప్పారు. అండర్ వరల్డ్ డాన్, ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో ఉంటున్న దావూద్ ఇబ్రహీం నుంచి ఫోన్ కాల్స్, ల్యాండ్ డీల్స్ తదితర వివాదాల్లో ఖడ్సేకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు ఒత్తిడి పెంచడంతో ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ తన మంత్రి వర్గం నుంచి ఆయన తొలగించారు. అంతేగాక, ఆరోపణలపై జుడీషియల్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో తన వద్ద దేశాన్ని వణికించే సమాచారం ఉందని చెప్పడం సంచలనంగా మారింది. కాగా, ఖడ్సేను వెంటనే కస్టడీకి తీసుకుని విచారించాలని కాంగ్రెస్, ఎన్సీపీ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications