ఇందిరా గాంధీ బతికివుంటే..: హిమంత సీరియస్ కామెంట్స్
Indira Gandhi: పాకిస్తాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి సంబంధించిన పలు అంశాలు, నాటి వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్ట్ అవుతున్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన 1971 నాటి యుద్ధ విశేషాలు గుర్తు చేసుకుంటోన్నారు.
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి అప్పట్లో ఇందిరా గాంధీని దుర్గామాతగా అభివర్ణించిన సంఘటనలు వెల్లువెత్తుతున్నాయి. సిమ్లా ఒప్పందం ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఈ పరిస్థితుల మధ్య భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెరపైకి వచ్చారు. ఇందిరాగాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇందిరా గాంధీ ఇప్పుడు జీవించి ఉంటే- సిమ్లా ఒప్పందంలో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు తిరిగి తీసుకోలేదని ప్రశ్నించేవాడినని అన్నారు. 1971 నాటి పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన తర్వాత పశ్చిమ బెంగాల్ చికెన్స్ నెక్ కారిడార్‌ను ఎందుకు విస్తరించలేదని నిలదీసేవాడినని చెప్పారు.
చికెన్ నెక్ కారిడార్‌ను 100 మైళ్ల మేర విస్తరించడానికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నిరాకరించారని హిమంత బిస్వ శర్మ విమర్శించారు. మంగళవారం ఆయన గువాహటిలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ సైకియాతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇందిరా గాంధీ హయాంలో పాకిస్తాన్‌పై భారత్ యుద్ధాన్ని, ఇప్పటి పరిస్థితుల గురించి ప్రస్తావించారు. పాకిస్తాన్‌తో భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటికీ లేదని తేల్చి చెప్పారు హిమంత. 1971 నాటి యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ గెలిచిందని, అది సైన్యం గొప్పదనమని వ్యాఖ్యానించారు.
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జీవించి ఉంటే- ఒక ఇస్లామిక్ దేశాన్ని (బంగ్లాదేశ్) సృష్టించడానికి ఆమె ఎందుకు అంగీకరించారని నిలదీసేవాడినని హిమంత చెప్పారు. సిమ్లా ఒప్పందంలో భాగంగా పాక్ ఆక్రమిత్ కాశ్మీర్‌ను ఎందుకు తిరిగి తీసుకోలేదు?, దీని వెనుక ఉద్దేశం ఏమిటీ?, యుద్ధ విరమణ చర్చల్లో చికెన్ నెక్ కారిడార్‌ను ఎందుకు చేర్చలేదు? అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.
ఇప్పటి బంగ్లాదేశ్ నుండి 100 మైళ్ల దూరంలో మాత్రమే ఉన్న చికెన్ నెక్ కారిడార్‌ను ఎందుకు అక్కడి వరకూ విస్తరించలేదు?, ఓ ఇస్లామిక్ దేశాన్ని ఎందుకు సృష్టించాల్సి వచ్చిందని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. పాకిస్తాన్‌తో ప్రస్తుత కాల్పుల విరమణను హిమంత బిశ్వ శర్మ సమర్థించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం అమలు చేసిన ఆపరేషన్ సింధూర్ ఉద్దేశం ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నాశనం చేయడం, ఉగ్రవాదులు, వాటి సంస్థలను నేలమట్టం చేయడం మాత్రమేనని హిమంత స్పష్టం చేశారు. అది విజయవంతమైందని అన్నారు.
దీని తర్వాత ఉగ్రవాదుల తరపున పాకిస్తాన్ భారత్‌పై యుద్ధానికి దిగిందని గుర్తు చేశారు. ఆ దాడులను భారత ఆర్మీ సమర్థవంతంగా, సాహసోపేతంగా తిప్పికొట్టిందని ప్రశంసించారు. తాము ఇలాగే దాడులను కొనసాగించితే భారత్ ఊచకోత కోస్తుందని పాకిస్తాన్ గ్రహించిందని, అందుకే లొంగిపోయిందని చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications