ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 300 ప్లస్, కాంగ్రెస్ డౌన్

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మళ్లీ భారతీయ జనతా పార్టీనే భారీ మెజార్టీతో అధికార చేపడుతుందని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ 343 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇండియా టుడే సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఓపీనియన్ పోల్ వెల్లడించింది.

ఇక, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 232 స్థానాలు సాధించిన కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి భారీగా స్థానాలు తగ్గి 188 సీట్లకే పరిమితమవుతుందని తాజా సర్వే తేల్చింది. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోని 1,25,123 మందిని సర్వే చేయగా ఈ విషయాలు వెలుగుచూశాయి. ఓట్ షేర్ కూడా ఎన్డీఏకు 3 శాతం పెరిగి 47 శాతం సాధిస్తుందని తెలిపింది. ఇండియా కూటమి కేవలం 1 శాతం ఓట్లను పెంచుకుంటుందని పేర్కొంది.

.

If Lok Sabha elections were held in the country right now NDA would have 300 plus seats

ఇప్పటికిప్పుడు ఈరోజే ఎన్నికలు జరిగితే బీజేపీ ఒంటరిగానే 281 సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. ఇక, కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వచ్చిన 99 స్థానాల నుంచి 78కి పడిపోతుందని అంచనా వేసింది. బీజేపీకి 3 శాతం ఓటింగ్ పెరగడంతో 41 శాతానికి చేరనుండగా. కాంగ్రెస్ పార్టీ మాత్రం 20 శాతం దగ్గరే నిలిచిపోయింది.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో బాధపడుతోందని, అది ఆ పార్టీ నిర్మాణంలోనే ఉందని రాజకీయ విశ్లేషకులు యామిని అయ్యర్ ఇండియా టుడేతో అన్నారు. కాగా, గత ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినప్పటికీ.. ఆ మార్క్ సాధించలేకపోయింది. అంతేగాక, ప్రభుత్వ ఏర్పాటులో బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.

బీజేపీని 400 సీట్ల నినాదమే దెబ్బతీసిందని తెలుస్తోంది. 400 సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో దళిత, ఓబీసీ ఓట్లను బీజేపీకి దూరం చేసే కాంగ్రెస్ ప్రయత్నం కొంతమేర సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. అయితే, సార్వత్రికి ఎన్నిలు జరిగిన ఆరు నెలల తర్వాత వరుసగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం గమనార్హం. ఢిల్లీలో దాదాపు 27 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+