సీమాను పాకిస్తాన్ కు పంపించకపోతే 26/11 సీన్ రిపిట్ అవుతుందని ఫోన్, లవ్ జీ!

ముంబాయి/నోయిడా: తన ప్రేమికుడితో కలిసి జీవించేందుకు అక్రమంగా భారత్‌కు వచ్చిన నలుగురు పిల్లల తల్లి సీమాను పాకిస్థాన్‌కు తిరిగి పంపించాలని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ముంబాయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఉర్దూలో మాట్లాడుతూ సీమా హైదర్ ను వెంటనే పాకిస్తాన్ కు పంపించకపోతే భారత్ మీద దాడులు చేస్తామని హెచ్చరించారు.

తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడానికి భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్‌ను వెంటనే పాకిస్తాన్ కు పంపించాలని, మా దేశానికి ఆమె తిరిగి రాకపోతే భారతదేశం వినాశనాన్ని ఎదుర్కొంటుందని పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి బెదిరించాడని సమాచారం. అంతేకాకుండా 26/11 తరహాలో ఉగ్రదాడులు జరుగుతాయని పోలీసులను గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించినట్లు సమాచారం.

If Seema Haider is not sent to Pakistan, we will do terrorist attacks like 26/11

ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఉర్దూలో మాట్లాడుతూ సీమా హైదర్ పాకిస్తాన్ కు తిరిగి రాకపోతే భారతదేశం విధ్వంసం ఎదుర్కొంటుందదని చెప్పాడు. అంతేకాకుండా 26/11 ముంబాయి ఉగ్రదాడి ఘటన వంటి దాడి జరుగుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కాల్ చేసిన వ్యక్తి పోలీసులను బెదిరించాడని తెలిసింది.

బుధవారం అర్థరాత్రి ఫోన్ కాల్‌ అందిందని, వెంటనే విచారణకు ఆదేశించామని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ముంబాయి పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు. ముంబాయి పోలీస్ కంట్రోల్ రూమ్ కు తరచూ ఇలాంటి కాల్స్ వస్తున్నాయని, పోలీసులు ఇప్పుడు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విచారిస్తున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన సీమా హైదర్ 2014లో గులామ్ హైదర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో స్థిరపడింది. నేపాల్ ద్వారా వీసా లేకుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినందుకు జూలై 4వ తేదీన సీమా హైదర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్ గేమ్ పబ్ జీ లో పరిచయమైన తన ప్రేమికుడు సచిన్‌ను కలవడానికి సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చింది.

If Seema Haider is not sent to Pakistan, we will do terrorist attacks like 26/11

పాకిస్తాన్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌కు జైలు శిక్ష కూడా పడింది. సచిన్ జైలు నుంచి విడుదలైన తర్వాత సీమాను కలిశాడు. సచిన్, సీమా తమ పిల్లలతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలోని సచిన్ తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నారు. నేపాల్‌లో ఒకరినొకరు వివాహం చేసుకున్నామని సీమా హైదర్, సచిన్ చెబుతున్నారు.

సీమా హైదర్, సచిన్ 2019లో పబ్ జీ ఆడుతున్నప్పుడు సన్నిహితంగా మెలిగారు. చివరికి సీమా హైదర్ భారతదేశానికి వచ్చి ప్రియుడు సచిన్ తో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. పని నిమిత్తం సౌదీ అరేబియాలో ఉన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్‌కు ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసిందని పోలీసులు అంటున్నారు. తన భార్య సీమా హైదర్ తో తాను కలిసి జీవించడానికి అవకాశం కల్పించాలని ఆమె భర్త గులామ్ హైదర్ భాతర్ అధికారులకు మనవి చేస్తున్నాడు.

If Seema Haider is not sent to Pakistan, we will do terrorist attacks like 26/11

తన ప్రియుడు సచిన్ తో కలిసి ఉండేందుకు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్ తాను పాకిస్తాకు తిరిగి వెళ్లనని తేల్చి చెప్పింది. పాకిస్థాన్‌లో మహిళలు ఎదుర్కొంటున్న భయాందోళనలను ఇది తెలియజేస్తోంది. సీమా హైదర్‌కి ఇప్పటికే గులామ్ హైదర్ అనే వ్యక్తితో వివాహం అయ్యి నలుగురు పిల్లలు ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో తన ప్రేమికుడు సచిన్‌తో కలిసి ఉండటానికి ఆమె తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించింది. ఈ ఆరోపణలపై ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించడంతో ఆమె బెయిల్‌పై విడుదల చేశారు. తాను భారతీయ సంస్కృతిని మనస్పూర్తిగా స్వీకరించానని, పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలని కోరుకోవడం లేదని సీమా హైదర్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+