ఈవీఎంలు లేకపోతే మీకు 40 సీట్లు కూడా దక్కవు: కోర్టుకెళ్తోన్నాం
EVMs: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత.. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డయిన ఫలితాలను తారుమారు చేశారంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తోన్నాయి.దాదాపుగా 140కి పైగా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తోన్నారు. సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్.. ఇప్పటికే ఈ అంశంపై గళం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయపోరాటానికీ సిద్ధపడుతున్నారు.
ప్రత్యేకించి- ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోన్నాయి. ఎందుకంటే- రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ.. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. అనేక నియోజకవర్గాల్లో వేల కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు.ఈవీఎంల పనితీరుపై అనుమానాలను మరింత బలాన్ని కలిగించే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) లోక్‌సభ సభ్యుడు రవీంద్ర వైకర్ బావమరిది మంగేష్ పండిల్కర్.. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలను తన మొబైల్ ఫోన్ ద్వారా తెరిచినట్లు తేలింది. ఈ ఘటనలో ఆయనపై కేసు నమోదైంది.

మొన్నటి ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రవీంద్ర వైకర్. కేవలం 48 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్‌ను ఓడించారు. వైకర్‌కు 4,52,644, గజానన్ కీర్తికర్‌కు 4,52,596 ఓట్లు పోల్ అయ్యాయి.ఓట్ల లెక్కింపు కంటే ముందే గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంలో మంగేష్ తన మొబైల్ ఫోన్‌లో అమర్చిన ఓ ప్రత్యేక డివైజ్‌తో ఈవీఎంను తెరిచారు. ఈ విషయాన్ని ఇదే లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గుర్తించారు. దీన్ని రిటర్నింగ్ అధికారి దినేష్ గౌరవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు పెట్టారు.
తమ అభ్యర్థి 48 ఓట్ల తేడాతో ఓడిపోవడం, రవీంద్ర వైకర్ బంధువు మొబైల్ ఫోన్‌తో ఈవీఎంను అన్ లాక్ చేసిన ఉదంతాన్ని శివసేన (యూబీటీ) తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధపడుతోంది. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు కేంద్రంలో చోటు చేసుకున్న అక్రమాలపై కోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు ఆదిత్య థాకరే వెల్లడించారు.ముంబై పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలు లేకపోతే బీజేపీకి కనీసం 40 సీట్లు కూడా దక్కేవి కాదని ఆదిత్య థాకరే తేల్చి చెప్పారు. వాటిని హ్యాక్ చేయడం ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగిందంటూ మండిపడ్డారు. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగివుంటే ముంబై నార్త్ వెస్ట్ సీటులో తామే గెలిచివుండేవాళ్లమని అన్నారు
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications