సైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లు
మంగళూరు : ఉగ్రవాదులపై సైన్యం దాడులు నిర్వహిస్తే .. విపక్షాలకు ఆధారాలు కావాలట, అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పాకిస్థాన్ పై వైమానిక దళం చేసిన మెరుపుదాడులకు సంబంధించి సాక్ష్యాలు కావాలని అడిగారు. వారి సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తం చేశారు అని మండిపడ్డారు. శనివారం ఆయన మంగళూరులో ప్రచారం నిర్వహించారు.

సైనికాధికారుల లేఖ తర్వాత ..
రాజకీయ లక్ష్యాల కోసం సాయుధ బలగాలను ఉపయోగించుకోవడం ఏంటని మాజీ సైనికాధికారులు రాసిన లేఖ దుమారం రేపింది. ఆ మరుసటి రోజే ప్రధాని మోదీ దాడుల గురించి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వారిది కుటుంబ పాలన
కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్, జేడీఎస్ అని .. కర్ణాటక ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శించారు మోదీ. వారు కుటుంబ రాజకీయాల నుంచి స్పూర్తి పొందుతుంతే .. బీజేపీ మాత్రం జాతీయత నుంచి స్పూర్తి పొందుతోందని గుర్తుచేశారు. అక్కడ వారి కుటుంబాలకు లాభం చేకూర్చాలని ప్రయత్నిస్తుంటే .. మేం మాత్రం బలహీనవర్గాల సాధికారత కోసం అహర్నిసలు శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సిద్ధాంతం వంశోదయ, మా సిద్ధాంతం అంత్యోదయ అని తీవ్రస్థాయిలో విమర్శించారు మోదీ.












Click it and Unblock the Notifications