గోవులను వధిస్తే చంపేస్తాం: బిజెపి ఎమ్మెల్యే హెచ్చరిక

Posted By:
Subscribe to Oneindia Telugu

జైపూర్: రాజస్థాన్ బిజెపి ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవులను అక్రమంగా రవాణా చేసినా, గోవధ చేసినా చంపేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. గత శనివారం అల్వార్‌లో జకీర్ అనే వ్యక్తి ట్రక్కులో ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.

బారికేడ్లను ట్రక్కుతో ఢీకొట్టి జకీర్ పారిపోయాడు. స్థానికులు పట్టుకొని అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై అహుజా స్పందించారు. ఆవులను అక్రమంగా తరలించినా.. హత్య చేసినా.. వారు కూడా హత్యకు గురవుతారని ఆయన హెచ్చరించారు.

gyan dev ahuja

జకీర్ స్థానికుల దాడిలో గాయపడలేదని, పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ట్రక్కు బోల్తా పడి గాయాలు అయ్యాయని అన్నారు.

ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో ప్రతీ రోజు 50 వేల బొక్కలు, 3 వేల కండోమ్స్, 500ల గర్భనిరోధక ఇంజెక్షన్లు, 10 వేల సిగరెట్లు లభిస్తున్నాయని నిరుడు వ్యాఖ్యానించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajasthan BJP MLA from Ramgarh Gyan Dev Ahuja has said, "If you smuggle cows, you will be killed."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి