క్యాంపస్ ప్లేస్‌మెంట్స్: ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్
న్యూఢిల్లీ: డిసెంబర్ వచ్చిదంటే చాలు... భారత్‌లోని అన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్ధల్లో క్యాంపస్ నియామకాలు జరుగుతుంటాయి. ఐతే ఈ ఏడాది ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్ధికి వార్షికంగా రూ. 1.5 కోట్ల వేతనం ఇస్తామని ఓ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చింది.
మొత్తం 27 కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించగా 163 మందికి అవకాశాలు లభించాయని కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐఐటీ-ఖరగ్‌పూర్ ఛైర్మన్ ప్రొపెసర్ సుధీర్ కుమార్ బరారీ తెలిపారు. ఈ ఏడాది ఓ భారత ఐఐటీ విద్యార్థికి లభించిన అత్యధిక వేతన ఆఫర్ ఇదే కావడం గమనార్హం.

ఈ ఆఫర్ విదేశాలకు వెళ్లి పని చేసే ఒప్పందంపై ఆ విద్యార్థికి లభించిందని, ఇక మనదేశంలో పనిచేసే విషయానికి వస్తే ఓ విద్యార్థి రూ.42 లక్షల ప్యాకేజి అందుకున్నాడని తెలిపారు. విద్యార్థి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.
మొత్తం క్యాంపస్ ఇంటర్యూల్లో ఇప్పటి వరకు 251 మందికి జాబ్ ఆఫర్లను లభించాయన్నారు. ఇందులో 88 మందికి ముందుగా ఆఫర్లు వచ్చాయన్నారు. 24మందికి ఒకే కంపెనీలో జాబ్ ఆఫర్లు ఇచ్చి ఎక్కువ జాబ్ ఆఫర్లు ఇచ్చిన కంపెనీగా ఈఎక్స్ఎల్ సర్వీసెస్ ప్రై.లిమిటెడ్ నిలిచిందన్నారు.












Click it and Unblock the Notifications