Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పన్నీర్ సెల్వం తదుపరి టార్గెట్ జాజ్ సినిమాస్: వివేక్ ఎవరు ? ఎందుకు!

జాజ్ సినిమాస్ శశికళ బినామీ అంటూ అనేక మంది ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే శశికళను దెబ్బ తియ్యాలంటే జాజ్ సినిమాస్ ను టార్గెట్ చేసుకోవాలని పన్నీర్ సెల్వం వర్గం ప్లాన్ వేసిందని సమాచారం.

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం శశికళ ఫ్యామిలీకి చుక్కలు చూపించడానికి సిద్దం అయ్యారు. శశికళతో పాటు ఇప్పటికే టీటీవీ దినకరన్ కు సినిమా చూపించిన పన్నీర్ సెల్వం ఇక మిగిలిన వారి మీద కన్ను వేశారు. ఇంతకాలం టీటీవీ దినకరన్ కు అన్ని రకాలుగా అండగా ఉన్న శశికళ సోదురుడి కుమారుడు, జాజ్ సినిమాస్ సీఈవో వివేక్ మీద కన్ను వేశారు.

పన్నీర్ సెల్వం తదుపరి టార్గెట్ శశికళ సోదరుడు జయరామన్ కుటుంబ సభ్యుల మీద పెట్టారని వెలుగు చూసింది. అక్రమాస్తుల కేసులో శశికళతో పాటు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇళవరసి కుటుంబం మీద పన్నీర్ సెల్వం వర్గం గురి పెట్టింది.

శశికళ సోదరుడి ఫ్యామిలీ

శశికళ సోదరుడి ఫ్యామిలీ

శశికళ సోదరుడు జయరామన్ హైదరాబాద్ లోని జయలలిత ద్రాక్ష తోటలు చూసుకునే వారు. గత సంవత్సరం ఆయన మరణించారు. జయలలిత అక్రమాస్తుల కేసులో ఇళవరసి మూడో నిందితురాలు. ఆమె శశికళతో పాటు పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభిస్తున్నారు.

ఇళవరిసి కుమారుడు వివేక్

ఇళవరిసి కుమారుడు వివేక్

ఇళవరసి కుమారుడు వివేక్ వివాహం గత సంవత్సరం ఆగస్టు 29వ తేది జరిగింది. కీర్తన అనే అమ్మాయిని వివేక్ వివాహం చేసుకున్నాడు. శశికళ బినామీ ఆస్తుల్లో కొన్నింటికి వివేక్ వారసుడని ఆరోపణలు ఉన్నాయి.

జాజ్ సినిమాస్ టార్గెట్

జాజ్ సినిమాస్ టార్గెట్

ళవరసి కుమారుడు వివేక్ జాజ్ సినిమాస్ సీఈవోగా పని చేస్తున్నాడు. అప్పట్లో కబాలి సినిమా తమిళనాడు పంపిణీ హక్కులకు రూ. 68 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న వివేక్ వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి వివేక్ వార్తల్లోకి తరచూ వస్తున్నాడు.

అప్పుడు కరుణానిధి, ఇప్పుడు పన్నీర్

అప్పుడు కరుణానిధి, ఇప్పుడు పన్నీర్

జాజ్ సినిమాస్ కు దేశ వ్యాప్తంగా 137 సినిమా థియేటర్లు ఉన్నాయని, జయలలితను అడ్దంపెట్టుకుని శశికళ కుటుంబ సభ్యులు అక్రమంగా ఈ ఆస్తులు సంపాధించారని గతంలో డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం సైతం జాజ్ సినిమాస్ ను టార్గెట్ చేసుకున్నారు. .

శశికళకు బినామి అంటూ ?

శశికళకు బినామి అంటూ ?

జాజ్ సినిమాస్ శశికళ బినామీ అంటూ అనేక మంది ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే శశికళను దెబ్బ తియ్యాలంటే జాజ్ సినిమాస్ ను టార్గెట్ చేసుకోవాలని పన్నీర్ సెల్వం వర్గం ప్లాన్ వేసిందని సమాచారం. ఇక ముందు పన్నీర్ సెల్వం శశికళ కుటుంబ సభ్యులను ఎంత మందిని టార్గెట్ చేస్తారో ? వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+