Illegal affair: ఆంటీ లవ్ స్టోరీలో భర్త విలన్, రివాల్వర్ తో కాల్చి చంపిన ప్రియుడు, రివర్స్ గేర్ తో !

న్యూఢిల్లీ: తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా వినకుండా కుటుంబ సభ్యులు బలవంతంగా ఆమెకు పెళ్లి చేశారు. వివాహం చేసుకుని భర్తతో కాపురం చేసిన మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు. నలుగురు పిల్లల తల్లి అయిన తరువాత కూడా భర్తతో కలిసి ఉండటానికి ఆమెకు మనసు అంగీకరించలేదు. ఇదే సమయంలో భార్య వయసులో ఉన్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొడుకు వయసు ఉన్న ప్రియుడితో ఆమె ఫుల్ గా ఎంజాయ్ చేసింది. .భర్త ఉదయం వెళితే రాత్రి ఇంటికి వస్తుండటంతో పక్కా టైమ్ టేబుల్ సెట్ చేసుకున్న ఆంటీ ఆమె ప్రియుడితో మస్త్ మజా చేసింది. నా భర్తను చంపేసి మనం జీవితాంతం సుఖంగా ఉంటామని భార్య ఆమె ప్రియుడికి చెప్పింది. ఆంటీ మోజులో పడిపోయిన ప్రియుడు ఆమె భర్తను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. రెండు వారాలపాటు భర్త దినచర్య గురించి తెలుసుకోవడానికి ప్రియుడు రెక్కీ నిర్వహించాడు. పక్కాస్కెచ్ వేసుకున్న ప్రియుడు ప్రియురాలి భర్తను స్మశానం దగ్గరకు పిలుచుకుని వెళ్లి వెనుక నుంచి రివాల్వర్ తో కాల్చి చంపేశాడు. తన భర్త ప్రాణాలు పోయాయని, ఇక ప్రియుడితో జీవితాంతం హ్యాపీగా ఉంటానని అనుకున్న ఆంటీ స్కెచ్ పూర్తిగా రివర్స్ అయ్యింది.

 ఆటో డ్రైవర్ తో పెళ్లి

ఆటో డ్రైవర్ తో పెళ్లి

ఢిల్లీలోని మంగోల్ పురి ఏరియాలో రాజ్ కుమార్ (ప్రస్తుతం అతనికి 60 సంవత్సరాలు) నివాసం ఉంటున్నాడు. 30 సంవత్సరాల క్రితం రాజ్ కుమార్ కు ఉర్మిళ అనే యువతికి వివాహం చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. రాజ్ కుమార్ ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని అప్పట్లో ఉర్మిళా చెప్పినా వినకుండా ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా రాజ్ కుమార్ తో ఆమె పెళ్లి చేశారు.

 నలుగురు బిడ్డలు....... ఇద్దరికి వివాహం జరిగిపోయింది

నలుగురు బిడ్డలు....... ఇద్దరికి వివాహం జరిగిపోయింది

భర్త రాజ్ కుమార్ ఆటో నడుపుతున్నాడు. రాజ్ కుమార్, ఉర్మిళ దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. భర్త రాజక కుమార్ తో కళ్లు మూసుకుని కాపురం చేసిన ఉర్మిళా నలుగురు పిల్లలకు తల్లి కావడమే కాకుండా ఇద్దరికి పెళ్లి చేశారు. పిల్లలకు పెళ్లి చేసినా కూడా భర్త రాజ్ కుమార్ తో ఊర్మిళ సంతోషంగా కాపురం చెయ్యలేకపోయింది. ఇద్దరి మధ్య వయసులో తేడా కూడా వరి సంసారంలో చిచ్చురేపింది.

 ఆంటీకి కొడుకు వయసు ఉన్న ప్రియుడు

ఆంటీకి కొడుకు వయసు ఉన్న ప్రియుడు

ఊర్మిళా ఆంటీకి సాజిమ్ ఖాన్ (28) అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొడుకు వయసు ఉన్న సాజిమ్ ఖాన్ తో ఉర్మిళ ఎక్కువ చనువు పెంచుకుంది. పెళ్లి చేసుకోకుండానే పడఖ సుఖం ఇవ్వడానికి రెఢీగా ఉన్న ఊర్మిళతో సాజిద్ ఖాన్ ఇంకా చనువు పెంచుకున్నాడు. సాజిద్ ఖాన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఊర్మిళ అతనితో ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది.

 ప్రియుడి కోసం టైమ్ టేబుల్ సెట్ చేసుకున్న ఆంటీ

ప్రియుడి కోసం టైమ్ టేబుల్ సెట్ చేసుకున్న ఆంటీ

భర్త రాజ్ కుమార్ ఆటో తీసుకుని ఉదయం వెళితే రాత్రి ఇంటికి వస్తుండటంతో పక్కా టైమ్ టేబుల్ సెట్ చేసుకున్న ఊర్మిళ ఆంటీ ఆమె ప్రియుడు సాజిద్ ఖాన్ తో మస్త్ మజా చేసింది. నలుగురు పిల్లల తల్లి అయిన తరువాత కూడా ఊర్మిళ ఆమె భర్త రాజ్ కుమార్ తో కలిసి ఉండటానికి ఆమెకు మనసు అంగీకరించలేదు.

 ప్రియుడి వ్యామోహంలో భర్త హత్యకు స్కెచ్

ప్రియుడి వ్యామోహంలో భర్త హత్యకు స్కెచ్

తాను ఇక ముందు తన భర్త రాజ్ కుమార్ తో తన కోరికలు తీర్చుకోలేనని ఊర్మిళ భావించింది. ఇదే సమయంలో భార్య ఊర్మిళ ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్లి వస్తోందని తెలుసుకున్న రాజ్ కుమార్ అతని భార్యను పట్టుకుని చితకబాదుతున్నాడు. నా భర్త రాజ్ కుమార్ ను చంపేసి మనం జీవితాంతం సుఖంగా ఉందామని ఉర్మిళ ఆమె ప్రియుడు సాజిద్ ఖాన్ కు చెప్పింది.

 ప్రియుడి పక్కాస్కెచ్ తో

ప్రియుడి పక్కాస్కెచ్ తో

రెండు వారాలపాటు రాజ్ కుమార్ దినచర్య గురించి తెలుసుకోవడానికి ఊర్మిళ ప్రియుడు సాజిద్ ఖాన్ రెక్కీ నిర్వహించాడు. రాజ్ కుమార్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెలుతున్నాడు అని తెలుసుకున్నాడు. ప్రతిరోజు రాత్రి చివరిసారిగా కరోల్ బాగ్ లోని ప్రయాణికుడి కోసం రాజ్ కుమార్ వస్తాడని సాజిద్ ఖాన్ తెలుసుకున్నాడు.

 రివాల్వర్ తో కాల్చి చంపేసిన ప్రియుడు

రివాల్వర్ తో కాల్చి చంపేసిన ప్రియుడు

పక్కాస్కెచ్ వేసుకున్న ఊర్మిళ ప్రియుడు నవంబర్ 2వ తేదీన కరోల్ బాగ్ లో రాజ్ కుమార్ ఆటో ఎక్కాడు. తరువాత ప్రియురాలు ఊర్మిళ భర్త రాజ్ కుమార్ ను మంగోల్ పురి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫేస్ 1 దగ్గర ఉన్న స్మశానం దగ్గరకు పిలుచుకుని వెళ్లాడు. తరువాత సాజిద్ ఖాన్ అతని జోబులో ఉన్న రివాల్వర్ తీసుకుని రాజ్ కుమార్ ను వెనుక నుంచి కాల్చి చంపేశాడు.

 ఆంటీ స్కెచ్ రివర్స్.... ఇద్దరూ అందర్

ఆంటీ స్కెచ్ రివర్స్.... ఇద్దరూ అందర్

రాజ్ కుమార్ ను హత్య చేసిన సాజిద్ ఖాన్ నేరుగా అక్కడి నుంచి మల్కాగంజ్ ఏరియాలోకి వెళ్లిపోయి అక్కడ లాడ్జ్ లో రూమ్ తీసుకుని రెండు రోజులు ఉన్నాడు. రాజ్ కుమార్ హత్య కేసులో తన పేరు బయటకు రాదని సాజిద్ ఖాన్ అనుకున్నాడు. ఆటో డ్రైవర్ రాజ్ కుమార్ ను రివాల్వర్ తో ఎందుకు కాల్చి చంపారు అంటూ పోలీసులు కూపీలాగారు. తన భర్త రాజ్ కుమార్ ప్రాణాలు పోయాయని, ఇక ప్రియుడు సాజిద్ ఖాన్ తో జీవితాంతం హ్యాపీగా ఉంటానని అనుకున్న ఊర్మిళ ఆంటీ స్కెచ్ పూర్తిగా రివర్స్ కావడంతో ఆమె పోలీసులకు చిక్కిపోయింది. ఊర్మిళతో ఆమె ప్రియుడు సాజిద్ ఖాన్ కు ఫోన్ చేయించి అతన్ని కూడా అరెస్టు చేశామని ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+