Illegal affair: భర్తను చంపేసి సంచిలో ప్యాక్ చేసి ప్రియుడి ఇంట్లో పెట్టేసింది, భర్త ఎత్తులకు ఊర్మిళ పైఎత్తులు!
కాన్పూర్/ లక్నో: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భార్యలో మార్పులు రావడంతో ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య మీద నిఘా వేసిన భర్త ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే కిలాడీ భార్య ఆమె భర్త వేస్తున్న స్కెచ్ ల పసిగట్టి చాకచక్యంగా తప్పించుకుంటున్నది. ఎలాగైనా భార్యను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న భర్త అతని భార్య ప్రియుడి ఇంట్లో గోనె సంచిలో శవమై కనిపించడం కలకలం రేపింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య అతని శవాన్ని మూటకట్టి, పిల్లలను గాలికి వదిలేసి ప్రియుడితో కలిసి చెక్కేయడం హాట్ టాపిక్ అయ్యింది.

దంపతులకు పిల్లలు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలోని దేహత్ లోని మంగళ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలియాపూర్ గ్రామంలో సంతోష్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సంతోష్ ఉర్మిళ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల పాటు భర్త సంతోష్ తో అతని భార్య ఊర్మిళ చాలా సంతోషంగా కాపురం చేసింది.

ఊర్మిళ మీద అనుమానం మొదలైయ్యింది
వివాహం చేసుకున్న తరువాత సంతోష్ ఊర్మిళ దంపతులు కొన్ని సంవత్సరాలు హ్యాపీగా కాపురం చెయ్యడంతో ఇరు వైపుల బంధువులు చాలా సంతోషించారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత సంతోష్ భార్య ఊర్మిళ ప్రవర్తనలో చాలా మార్పులు రావడంతో ఆమె భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఊర్మిళ అదే ఏరియాలో నివాసం ఉంటున్న సునీల్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

భర్త ఎత్తులు..... ఊర్మిళ పై ఎత్తులు
భార్య ఊర్మిళ మీద నిఘా వేసిన సంతోష్ ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే కిలాడీ భార్య ఊర్మిళ ఆమె భర్త సంతోష్ వేస్తున్న స్కెచ్ లు పసిగట్టి చాకచక్యంగా తప్పించుకుంటున్నది. భర్త సంతోష్ కళ్లుకప్పిన అతని బార్య ఊర్మిళ ఆమె ప్రియుడు సునీల్ తో ఎంజాయ్ చేస్తోంది.

మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన కిలాడీ పెళ్లామ్
భార్య ఊర్మిళ, పిల్లలను పిలుచుకుని అత్తారింటికి వెళ్లిన సంతోష్ మూడు రోజులు అక్కడే ఉన్నాడు. మూడు రోజుల తరువాత సంతోష్ అతని భార్య ఊర్మిళ, పిల్లలతో కలిసి ఆలియాపూర్ గ్రామంలో సొంత ఇంటికి వెళ్లాడు. అదే రోజు రాత్రి సంతోష్ కనపడకుండా పోయాడు. మరుసటి రోజు అయినా సంతోష్ ఆచూకి చిక్కలేదు.

పిల్లల దెబ్బతో ఎస్కేప్
మరుసటి రోజు మా తండ్రి సంతోష్ ఎక్కడ అంటూ పిల్లలు వాళ్ల తల్లి ఊర్మిళను ప్రశ్నించారు. పిల్లలు పదేపదే తండ్రి సంతోష్ గురించి ప్రశ్నిస్తుండటంతో తల్లి ఊర్మిళ కూడా మాయం అయ్యింది. భర్త సంతోష్ కనపడకుండా పోవడం, మరుసటి రోజు అతని భార్య ఊర్మిళ కూడా మాయం కావడంతో అతని బంధువులు పోలీసు కేసు పెట్టారు.

ప్రియుడు కూడా మాయం
ఇదే సమయంలో ఆదే ఊరిలో ఉన్న సునీల్ అనే యువకుడు కూడా మాయం అయ్యాడని పోలీసులు గుర్తించారు. ఊర్మిళ, సునీల్ ఇద్దరి మొబైల్ ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. ఇదే సందర్బంలో మాయం అయిన సునీల్ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ప్రియుడితో కలిసి భర్తను చంపేసి నీట్ గా ప్యాకింగ్ చేసిన భార్య
పోలీసులు సునీల్ ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా మూడు రోజుల ముందు మాయం అయిన ఊర్మిళ భర్త సంతోష్ గోనె సంచిలో శవమై కనిపించాడు. మూడు రోజుల ఊర్మిళ ఆమె ప్రియుడు సునీల్ తో కలిసి ఆమె భర్త సంతోష్ కాళ్లు, చేతులు కట్టేసి అతన్ని హత్య చేసి శవాన్ని గోనె సంచిలో మూటకట్టేశారని పోలీసులు అన్నారు.
సంతోష్ శవం చిక్కిన సునీల్ ఇల్లు హత్యకు గురైన వ్యక్తి భార్య ఊర్మిళ ప్రియుడిది అని వెలుగు చూడటంతో స్థానికులు బిత్తరపోయారు. భర్త సంతోష్ ను హత్య చేసిన ఊర్మిళ ఫోన్ నెంబర్, ఆమె ప్రియుడు సునీల్ ఫోన్ నెంబర్లు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications