Illegal affair: దుబాయ్ లో మొగుడు, అక్కడే స్కెచ్, అపార్ట్ మెంట్ లో భార్య?, సుపారి కిల్లర్స్ !
బెంగళూరు/ ఉడిపి: దుబాయ్ నుంచి వచ్చిన వివాహిత మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లిన మహిళ నేరుగా బ్యాంకుకు వెళ్లింది. బ్యాంకు నుంచి అపార్ట్ మెంట్ లోకి వచ్చిన మహిళ శవమై కనిపించడంతో కలకలం రేపింది. దుబాయ్ లో మకాం వేసిన ఆంటీ మొగుడు హత్యకు వేరే రాష్ట్రంలోని కిరాయి హంతకులతో స్కెచ్ వేశాడని వెలుగు చూడటంతో బంధువులు షాక్ అయ్యారు. అక్రమ సంబంధం, ఆస్తి విషయంలో భార్యను దారుణంగా హత్య చేయించిన భర్త నాటకాలు ఆడుతున్నాడని పోలీసులు పసిగట్టారు. భర్త క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

దుబాయ్ లో ఫ్యామిలీ
కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన రామక్రిష్ణ, విశాల గాణి (45) దంపతులు కూతురితో కలిసి దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. గత నెల చివరి వారంలో విశాల ఉడిపి చేరుకుంది. ఉడిపి జిల్లాలోని బ్రహ్మావర సమీపంలోని ఉప్పికోటే ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లో విశాల ఆమె కూతురిలో కలిసిఉండేది.

అపార్ట్ మెంట్ లో విశాల దారుణ హత్య
జులై 12వ తేదీన విశాల బ్యాంకుకు వెళ్లింది. బ్యాంకులో పని ముగించుకుని అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లోకి విశాల వెళ్లిన విషయం అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. తరువాత అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో విశాల దారుణ హత్యకు గురైయ్యింది. మరుసటి రోజు విశాల హత్యకు గురైన విషయం వెలుగు చూడటం కలకలం రేపింది.

పక్కాప్లాన్ తో హత్య
దుబాయ్ నుంచి వచ్చిన కొన్ని రోజులకే విశాల హత్యకు గురికావడంతో ఉడిపి ప్రజలు ఉలిక్కిపడ్డారు. తెలిసినవాళ్లే విశాలను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. విశాల హత్యకు గురి కావడంతో దుబాయ్ లో ఉన్న ఆమె భర్త రామక్రిష్ణ ఉడిపి చేరుకున్నాడు.

ఏమాత్రం ఫీలింగ్ లేదు
భార్య విశాల హత్యకు గురైయ్యిందని ఆమె భర్త రామక్రిష్ణకు ఏమాత్రం ఫీలింగ్ లేదని, అతను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. విశాల భర్త రామక్రిష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. విచారణలో పోలీసులు కొన్ని వివరాలు సేకరించి విశాల భర్త రామక్రిష్ణను ఏమీ అనకుండా అతన్ని ఇంటికి పంపించేశారు.

కిరాయి హంతకులతో భార్యను చంపించాడు
దుబాయ్ నుంచి భార్య విశాలను ఉడిపి పంపించిన రామక్రిష్ణ అక్కడే ఉండిపోయాడు. దుబాయ్ లో ఉంటున్న భర్త రామక్రిష్ణ అతని భార్య విశాలను హత్య చెయ్యడానికి ఉత్తర భారతదేశానికి చెందిన కిరాయి హంతకులతో కాంట్రాక్టు మాట్లాడుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అక్రమ సంబంధం కారణం
రామక్రిష్ణకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అక్రమ సంబంధం విషయంలో, భార్య విశాల ఆస్తి విషయంలోనే ఆమెను భర్త రామక్రిష్ణ హత్య చేయించాడని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మొదట బంగారు నగలు, నగదు కోసం విశాల హత్యకు గురైయ్యిందని పోలీసులు బావించారు. అయితే భర్త అక్రమ సంబంధం కారణంగానే విశాలను ఆమె భర్త రామక్రిష్ణ హత్య చేయించాడని వెలుగు చూడటం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications