Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ప్రియుడితో ఎస్కేప్, కజిన్ తో కాపురం, లిక్కర్ పార్టీతో చంపేసిన ఇద్దరు ప్రియులు!

మోహలి: భర్తతో కాపురం చేసుకుంటున్న మహిళ అడ్డదారి కొట్టింది. మంచి కుర్రాడిని సెట్ చేసుకున్న భార్య అతనితో జల్సా చేసింది. భర్త అతని భార్యను మందలించి ప్రియుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ ముందు ప్రియుడితో కలిసి భార్య జెండా ఎత్తేసింది. భార్య కోసం ఎక్కడెక్కడో వెతికిన భర్త పోలీసు కేసు పెట్టాడు. అప్పటి నుంచి భర్త అతని భార్య కోసం గాలిస్తూనే ఉన్నాడు. అయితే భార్య ఆచూకి మాత్రం ఎక్కడా చిక్కకపోవడంతో భర్త విసిగిపోయాడు. మాయం అయిపోయిన భార్య ఓ గోనె సంచిలో శవమై కనిపించింది.

గోనె సంచిలో కుళ్లిపోయి భార్య శవం బయటపడిందని తెలుసుకున్న భర్త హడలిపోయాడు. ప్రియుడికి తెలీకుండా సీక్రేట్ గా అతని కజిత్ తో ప్రియురాలు కాపురం చేసిన విషయం బయటపడింది. నమ్మి వచ్చిన ప్రియురాలికి మత్తు మందుతో పాటు లిక్క్ పార్టీ ఇచ్చిన ప్రియుడు, అతని బంధువుతో కలిసి హత్య చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ప్రియురాలిని ఆమె ప్రియుడు ఎంత దారుణంగా హత్య చేశాడో అనే విషయం తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు.

హ్యాపీలైఫ్ లో కుర్రాడు ఎంట్రీ

హ్యాపీలైఫ్ లో కుర్రాడు ఎంట్రీ

బీహార్ లో సుభోద్ శర్మా, సంజనా దేవి (35) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి మూడు సంవత్సరాల క్రితం వరకు సంజనా దేవి ఆమె భర్త సుభోద్ శర్మాతో చక్కగా కాపురం చేసింది. తరువాత సుభోద్ దేవి జీవితంలో పంకజ్ శర్మా అనే కుర్రాడు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ కథ రసవత్తరంగా మారింది.

పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది

పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది

భర్త సుభోద్ శర్మాతో చక్కగా కాపురం చేసుకుంటున్న సంజనా దేవి తరువాత అడ్డదారి కొట్టింది. పంకజ్ శర్మా ను సెట్ చేసుకున్న సంజనా దేవి అతనితో జల్సా చేసింది. భర్తకు తెలీకుండా సుమారు రెండు సంవత్సరాల వరకు సంజనా దేవి ఆమె ప్రియుడు పంకజ్ శర్మా తో ఎప్పుడు పడితే అప్పుడు ఎంజాయ్ చేస్తూ కాలం గడింది.

భర్తకు అడ్డంగా చిక్కిపోయిన భార్య

భర్తకు అడ్డంగా చిక్కిపోయిన భార్య

భర్త సుభోద్ శర్మా ఊరికి వెళ్లాడు. ఆ సమయంలో తన భర్త ఇంటికి రాడని అనుకున్న సంజనా దేవి ఆమె ప్రియుడు పంకజ్ ను ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఊరికి వెళ్లిన సుభోద్ శర్మా త్వరగా పని ముగించుకుని ఇంటికి వచ్చేశాడు. సుభోద్ ఇంటికి వచ్చి చూడగా అతని భార్య సంజనా దేవి, ఆమె ప్రియుడు పంకజ్ బెడ్ రూమ్ లో నుంచి తీరికగా బయటకు వచ్చారు.

భర్తను చంపడం వీలుకాదని ప్రియుడితో లేచిపోయిన భార్య

భర్తను చంపడం వీలుకాదని ప్రియుడితో లేచిపోయిన భార్య

భార్య సంజనా దేవిని చూడరాని పోజిషన్ లో చూసిన సుభోద్ శర్మా రగిలిపోయాడు. భార్య సంజనా దేవిని గట్టిగా మందలించిన సుభోద్ ఇంకోసారి ఇలా చూస్తే నిన్ను చంపేస్తానని ఆమె ప్రియుడు పంకజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. భర్తను చంపేస్తే జైలుకు పోతామనే భయంతో సంజనా దేవి ఇద్దరు పిల్లలను పిలుచుకుని ఇదే ఏడాది ఫిబ్రవరి నెలలో ఆమె ప్రియుడు పంకజ్ తో కలిసి లేచిపోయింది.

ప్రియుడితో కాపురం

ప్రియుడితో కాపురం

పంజాబ్ లోని మోహాలి ఫేస్ 1 ఏరియాలో ప్రియుడు పంకజ్ తో కలిసి సంజనా దేవి అద్దె ఇంటిలో కాపురం పెట్టింది. ఫిబ్రవరి నెల నుంచి సంజనా దేవి ఆమె ప్రియుడు పంకజ్ తో కలిసి జీవిస్తోంది. భార్య సంజనా దేవి కోసం ఎక్కడెక్కడో వెతికిన ఆమె భర్త సుభోద్ శర్మా పోలీసు కేసు పెట్టాడు. అప్పటి నుంచి సుభోద్ శర్మా అతని భార్య సంజనా దేవి కోసం గాలిస్తూనే ఉన్నాడు. అయితే సంజనా దేవి ఆచూకి మాత్రం ఎక్కడా చిక్కకపోవడంతో సుభోద్ విసిగిపోయాడు.

గోనె సంచిలో శవమైన భార్య

గోనె సంచిలో శవమైన భార్య

ఈ మద్యకాలంలో ప్రియుడు పంకజ్ కజిన్ నితీష్ కుమార్ తో సంజనా దేవి అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కూడా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఆగస్టు 15వ తేదీన సంజనా దేవి ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి మోహాలీలోని బధ్మజా ఏరిలో కొత్తగా అద్దె ఇల్లు తీసుకుని నితీష్ కుమార్ తో కలిసి జీవించడం మొదలుపెట్టింది.

ఆగస్టు 21వ తేదీన గోసల్ గ్రామం సమీపంలోని ఖరార్- రోపర్ హైవే ఎక్స్ ప్రెస్ రోడ్డులో ఓ ప్లాసిక్ గోనె సంచిలో మహిళ శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో మూడు రోజుల తరువాత బీహార్ కు చెందిన సుభోద్ శర్మా భార్య సంజనా దేవి శవంగా గుర్తించి అతనికి సమాచారం ఇచ్చారు.

పోలీసులకు భార్య లవ్ స్టోరీ చెప్పిన మొగుడు

పోలీసులకు భార్య లవ్ స్టోరీ చెప్పిన మొగుడు

మాయం అయిపోయిన తన భార్య సంజనా దేవి ప్లాస్టిక్ గోనె సంచిలో కుళ్లిపోయి శవంగా బయటపడిందని తెలుసుకున్న ఆమె భర్త సుభోద్ హడలిపోయాడు. తన భార్య సంజనా దేవి ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు పంకజ్ శర్మా మోజులో పడి అతనితో పారిపోయిందని, తాను కొన్ని నెలల క్రితమే కేసు పెట్టానని సుభోద్ పంజాబ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ప్రియురాలి మీద ఇద్దరు ప్రియులకు మోజు తీరిపోయింది

ప్రియురాలి మీద ఇద్దరు ప్రియులకు మోజు తీరిపోయింది

పోలీసులు రెండు రోజుల ముందు సంజనా దేవి ఆమె కొత్త ప్రియుడు నితీష్ కుమార్ ను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నితీష్ కుమార్ షాకింగ్ విషయాలు బయటకు చెప్పాడు. సంజనా దేవి మీద మోజు తీరిపోయిందని పంకజ్ తనతో చెప్పాడని, అంతకు ముందు నుంచి ఆమెతో తాను ఎంజాయ్ చేస్తున్నానని, ఇద్దరూ కలిసి ఆమె ను చంపేయాలని స్కెచ్ వేశామని అన్నారు.

Recommended Video

    డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న టీటీడిపి
    పక్కాప్లాన్ తో చంపేశారు

    పక్కాప్లాన్ తో చంపేశారు

    సంజనా దేవికి పీకలదాక మద్యం తాగించామని, తరువాత మత్తు పదార్థాలు ఆమెకు తినిపించామని చెప్పాడు. మత్తులోకి జారుకున్న సంజనా దేవి గొంతు కోసి చంపేసి శవాన్ని గోనె సంచిలో మూటకట్టి హైవే రోడ్డు పక్కన విసిరేశామని నితీష్ కుమార్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. నితీష్ కుమార్ బంధువు పంకజ్ తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని మోహాలిలోని సదర్ కురాలి పోలీసులు అన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+