Illegal affair: ఫ్యామిలీ ఫ్రెండ్స్, పాన్ మసాలా వ్యాపారితో భార్య ?, భర్త ఏం చేశాడంటే ?, వ్యాపారి భార్య కూడా !
బెంగళూరు/మంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త పాన్ షాప్ లకు పాన్ మసాలాలు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నాడు. దంపతులకు ముందు నుంచి పరిచయం ఉన్న మరో జంట కూడా వీరు నివాసం ఉంటున్న భవనంలోని ఓ ఇంటిలో అద్దెకు నివాసం ఉంటున్నారు. ఇటీవల పాన్ మసాలాలు సరఫరా చేసే వ్యక్తి మెయిన్ రోడ్డు డ్రైనేజ్ లో శవమై కనిపించాడు. రెండు రోజుల తరువాత శవం కుళ్లిపోయిన తరువాత పాన్ మసాలా వ్యాపారం చేసే వ్యక్తి హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. పోలీసులు అనేక కోణాల్లో కేసు విచారణ చేశారు. పాన్ మసాలా వ్యాపారి భార్యతో పాటు అతని ఇంటి పక్కన నివాసం ఉంటున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం, నగదు లావాదేవీలు, బ్లాక్ మెయిల్ కారణంగా పాన్ మసాలా వ్యాపారి హత్యకు గురైనాడని వెలుగు చూసింది. హత్యకు గురైన వ్యక్తి భార్య హంతకులతో చేతులు కలపడం కలకలం రేపింది.

బీహార్ టూ బెంగళూరు
బీహార్ కు చెందిన ఓంనాథ్ సింగ్ అలియాస్ సింగ్ (48) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని కాడుగోడిలోి బేలత్తూర్ ప్రాంతంలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం వీధిలోని రాజేంద్ర భవన్ బిల్డింగ్ లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. గుంజా దేవి (37) అనే మహిళను వివాహం చేసుకున్న ఓంనాథ్ సింగ్ అతని భార్యతో కాడుగోడిలో నివాసం ఉంటూ సంతోషంగా కాపురం చేస్తున్నాడు.

పాన్ మసాలా వ్యాపారం
ఓంనాథ్ సింగ్ కాడుగోడితో పాటు పరిసర ప్రాంతాల్లోని పాన్ షాప్ లకు పాన్ మసాలా డబ్బాలు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నాడు. ఓంనాథ్ సింగ్, గుంజాదేవి దంపతులు నివాసం ఉంటున్న బిల్డింగ్ లోని మరో ఇంటిలో విశాల్ ప్రజాపతి (24), అతని భార్య రూబీ ప్రజాపతి అలియాస్ రూబీ (23) దంపతులు నివాసం ఉంటున్నారు.

అమ్మాయితో అక్రమ సంబంధం
విశాల్ ప్రజాపతి, రూబీ కాడుగోడిలోని గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నారు. గుజరాత్ లో ఓంనాథ్ సింగ్ కు, విశాల్ ప్రజాపతి కుటుంబ సభ్యులకు పరిచయం ఉందని, ఆ పరిచయంతో వీళ్లు కాడుగోడిలో పక్కపక్క ఇళ్లలోనే నివాసం ఉంటున్నారని వెలుగు చూసింది. రూబీతో పాన్ మసాలా వ్యాపారి ఓంనాథ్ సింగ్ అక్రమ సంబందం పెట్టుకున్నాడు.

డబ్బులు అప్పు ఇచ్చి బ్లాక్ మెయిల్
విశాల్ ప్రజాపతి తనకు అవసరం ఉందని పాన్ మసాలా వ్యాపారి ఒంనాథ్ సింగ్ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని తెలిసింది. తీసుకున్న అప్పు సరైన సమయంలో విశాల్ తీర్చలేకపోయాడు. ఇదే అదనుగా బావించిన ఓంనాథ్ సింగ్ విశాల్ భార్య రూబీతో ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎంజాయ్ చెయ్యాలని రూబీకి చెబుతున్న ఓంనాథ్ సింగ్ ఆమె నిరాకరిస్తే నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి అంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడని వెలుగు చూసింది.

డ్రైనేజ్ లో కుళ్లిపోయిన శవం
ఇటీవల కాడుగోడిలోని బైలత్తూర్ ప్రాంతంలోని మెయిన్ రోడ్డు పక్కన గోనె సంచిలో వ్యక్తి శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవం కుళ్లిపోవడంతో రెండురోజుల పాటు కేసు విచారణ చేసిన పోలీసులు చివరికి పాన్ మసాలా వ్యాపారి ఓంనాథ్ సింగ్ శవం అని గుర్తించారు. ఓంనాథ్ సింగ్ మీద దాడిచేసి హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పోలీసులు అనేక కోణాల్లో కేసు విచారణ చేశారు.

అక్రమ సంబంధం, బ్లాక్ మెయిల్, ఆర్థిక లావాదేవీలు
రూబీ ఇంటికి వెళ్లిన ఓంనాథ్ సింగ్ ఆమెతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆమె భర్త విశాల్ పాన్ మసాలా వ్యాపారిని పట్టుకున్నాడు. మూడు రోజులు ఓంనాథ్ సింగ్ ను ఇంట్లోనే కట్టేసిన విశాల్ అతని భార్య రూబీ కలిసి పాన్ మసాలా వ్యాపారిని టార్చర్ పెట్టి చంపేశారు. తరువాత ఓంనాథ్ సింగ్ శవాన్ని గోనె సంచిలో మూటకట్టి లాక్కెళ్లి డ్రైనేజ్ విసిరేశారు.

భార్యకు ఏమిటి సంబంధం ?
పాన్ మసాలా వ్యాపారి ఓంనాథ్ సింగ్ ను టార్చర్ పెట్టి హత్య చేసిన విషయం అతని భార్య గుంజాదేవికి తెలిసినా చుట్టుపక్కలవాళ్లకు, పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త ఓంనాథ్ సింగ్ ను హత్య చేసిన విశాల్, రూబీతో కలిసి గుంజాదేవి మంగళూరు పారిపోవడం అనేక అనుమానాలకు దారితీసోందని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications