వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును చంపిన తల్లి
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే నెపంతో మూడేళ్ళ కన్నకొడుకునే ఓ తల్లి విపరీతంగా కొట్టి చంపింది. భారతీ బాబురావు సింగ్ కు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో మూడేళ్ళ చిన్న కొడుకును తీసుకొని ముంబాయికి వ
పూణె : అమ్మను మించిన ధైవముందా...ఆత్మను మించి అర్థముందా అని ఓ కవి అమ్మను గురించి ఎంత గొప్పగా చెప్పాడు. కాని, వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని చిన్నారి ప్రాణాలను చిదిమేసింది కన్నతల్లి. వివాహేతర సంబంధం కొనసాగించేందుకు కొడుకును అడ్డుతొలగించుకొంది.
వివాహేతర సంబంధానికి కొడుకు అడ్డువస్తున్నాడని ఓ తల్లి తన కొడుకునే చంపేసింది. కన్నతల్లి అంటే అర్థం మారేలా వ్యవహారించింది.నాందేడ్ కు చెందిన భారతి బాబురావ్ షిండే కు ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్ళ క్రితం ఆమె భర్త మరణించాడు. బతుకుదెరువు కోసం ఆమె ముంబైకి వచ్చింది.

కన్నపేగును చిదిమేసింది
పొట్టనింపుకోవడం కోసం చిన్నకొడుకును తీసుకొని ముంబైకి వచ్చింది. ముంబైకి చేరుకోగానే ఆమె జీవితంలో మార్పులు వచ్చాయి. ముంబాయిలో కుమార్ పరిచయమయ్యాడు. కుమార్ పరిచయం ఆమె జీవితంలో మార్పులకు కారణమైంది. కుమార్ తో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఈ సంబంధం కొనసాగించడానికి మూడేళ్ళ కొడుకు అడ్డు అని భావించారు.
భారతితో సంబంధం కొనసాగించే విషయమై మూడేళ్ళ కొడుకు అడ్డుగా ఉన్నాడని పదేపదే కుమార్ ఆమెతో చెప్పాడు. ఈ విషయమై వారిద్దరి మద్య వాగ్వాదం జరిగింది. ఈ సంబంధం కొనసాగాలంటే మూడేళ్ళ చిన్నారిని వదిలించుకోవాలని కుమార్ తెగేసి చెప్పాడు.దీంతో కన్నపేగు కంటే వివాహేతర సంబంధమే ముఖ్యమని భావించింది ఆమె.
మూడేళ్ళ కొడుకును వదిలించుకోవాలని భావించింది.ఇష్టమొచ్చినట్టు భారతీ తన కొడుకును కొట్టింది.ఈ దెబ్బలకు తాళలేక అతను స్పృహా కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్థారించారు. భారతిని పోలీసులు అరెస్టు చేశారు. కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications