Illegal affair: భర్త మీద మోజు తగ్గి ప్రియుడి మీద మోజు పెరిగింది, అత్తతో కలిసి అల్లుడు, క్లైమాక్స్ !

తేనీ/ చెన్నై: ప్రియుడి మోజులో పడిపోయిన భార్య ఆమె భర్తను పూర్తిగా నిర్లక్షం చేసింది. భర్త దగ్గర ఒక యాంగిల్ లో, ప్రియుడి దగ్గర మరో యాంగిల్ లో నటించింది. భర్త మంచి తనాన్ని చనువుగా తీసుకున్న భార్య ఇంకా రెచ్చిపోయింది. ప్రేమించిన ప్రియుడి కోసం భార్య ఊరు వదిలి చెన్నై సిటీ చేరుకుంది. భర్త కేసు పెట్టడంతో పోలీసులు అతి కష్టం మీద భార్యను పట్టుకుని ఆమెను భర్తకు అప్పగించారు. రానురాను భార్య తీరు విచ్చలవిడిగా తయారైయ్యింది. అంతే భర్త, అతని అత్త డైరెక్ట్ డీల్ పెట్టుకున్నారు. హాట్ గా ఉన్న అత్తతో కలిసి భార్యను చంపేశాడు. అత్తతో కలిసి భార్యను చంపేసి శవాన్ని కాల్చేస్తున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అర్ధం కాలిపోయిన శవం స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చెయ్యడంతో అసలు మ్యాటర్ బయటకు రావడంతో అందరూ హడలిపోయారు.

ఇంట్లో సెట్ చేసిన పెళ్లి

ఇంట్లో సెట్ చేసిన పెళ్లి

తమిళనాడులోని తేనీ జిల్లాలోని ఉత్తమపాలళ్యం సమీపంలోని రాయప్పన్ పట్టిలోని కోవిల్ వీధిలో కల్యాణ్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 ఏళ్ల క్రితం కవిత (47) అనే మహిళ కుమార్తె రంజిత (30) అనే యువతిని కల్యాణ్ కుమార్ వివాహం చేసుకున్నాడు. కల్యాణ్ కుమార్, రంజితకు 8 సంవత్సరాల వయసు ఉన్న ఓ కుమార్తె ఉంది.

భర్త మీద మోజు తీరిపోయింది..... ప్రియుడి మీద మోజు పెరిగింది

భర్త మీద మోజు తీరిపోయింది..... ప్రియుడి మీద మోజు పెరిగింది


కల్యాణ్ కుమార్ భార్య రంజిత ఎప్పుడు అందంగా అలంకరించుకుని కనపడటానికి ఇష్టపడుతుంది. అందంగా తయారౌతున్న రంజితకు రానురాను భర్త కల్యాణ్ కుమార్ మీద మోజు తగ్గిపోయిందని సమాచారం. పెళ్లి జరిగిన తరువాత కొన్ని సంవత్సరాలకు భర్త కల్యాణ్ ను పట్టించుకోవడం తగ్గించుకుంటూ వచ్చింది. భార్య రంజిత రెండు సంవత్సరాల క్రితం సురేష్ అనే యువకుడితో చనువు పెంచుకుంది. సురేష్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. కల్యాణ్ కుమార్ భార్య రంజిత చెన్నై ఫ్రెండ్ సురేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త కల్యాణ్ కుమార్ కు తెలీకుండా అతని భార్య రంజిత ఆమె ప్రియుడు సురేష్ తో కలిసి ఎంజాయ్ చేసింది.

ప్రియురాలిని ఆకాశంలో పెట్టేసిన ప్రియుడు

ప్రియురాలిని ఆకాశంలో పెట్టేసిన ప్రియుడు

రంజితకు ఆమె ప్రియుడు సురేష్ మాయమాటలు చెప్పి ఆమెను ఆకాశానికి ఎత్తేయడంతో అతని మోజులో పడిపోయింది. ప్రియుడు సురేష్ మోజులో పడిపోయిన రంజిత ఆమె భర్త, కూతురితో పాటు ఈ ప్రపంచాన్ని మరిచిపోయింది. భర్త కల్యాణ్ కుమార్ ను, కూతురిని, పుట్టింటి వాళ్లను పూర్తిగా మరిచిపోయిన రంజిత ప్రతిరోజూ ఆమె ప్రియుడు సురేష్ వ్యామోహంలో పడిపోయి ఊహల్లో తేలిపోయింది.

ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య

ప్రియుడితో జెండా ఎత్తేసిన భార్య

రంజిత భర్తకు బాయ్ బాయ్ చెప్పేసి ప్రియుడి సురేష్ తో కలిసి చెక్కేసింది. కొన్ని రోజులు భార్య కోసం గాలించిన కల్యాణ్ కుమార్ చివరికి ఉత్తమపాళ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంజిత కోసం భర్త కల్యాణ్ కుమార్, ఆమె తల్లి కవిత, కుటుంబ సభ్యులు, పోలీసులు అనేక ప్రాంతాల్లో గాలించారు. రంజిత కనపడకుండా పోయిన కొన్ని రోజులకు ఆమె ప్రియుడు సురేష్ వ్యవహారం పోలీసులకు తెలిసింది. చెన్నై చేరుకున్న తేనీ పోలీసులు రంజితను, ఆమె ప్రియుడు సురేష్ ను పట్టుకున్నారు. తనతో చక్కగా కాపురం చెయ్యకుండా ప్రియుడు సురేష్ తో పారిపోవడంతో నా భార్య అక్రమ సంబంధం గురించి అందరికి తెలిసిపోయి తన పరువు పోయిందని ఆమె భర్త కల్యాణ్ కుమార్ ఆవేదనతో రగిలిపోయాడు

విసిగిపోయిన భర్త..... అత్తతో చర్చలు

విసిగిపోయిన భర్త..... అత్తతో చర్చలు


రంజిత వ్యవహారం గురించి ఆమె తల్లి కవితకు చెప్పిన కల్యాణ్ కుమార్ ఆమెను ఊరికి పిలిపించుకున్నాడు. ఇంట్లో పెద్ద పంచాయితీ జరిగింది. నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేస్తానని, నాకు ఎవరితో కాపురం చెయ్యాలనిపిస్తే వారితో చేస్తానని రంజిత ఎదురు తిరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కల్యాణ్ కుమార్ అతని భార్య రంజితను పట్టుకుని చితకబాదేశాడు. ఆ సమయంలో గొడవ పెద్దది అయ్యింది. ఇక లాభం లేదని, రంజితను చంపేయాలని ఆమె భర్త కల్యాణ్ కుమార్, అత్త కవిత మాట్లాడుకున్నారు.

ఊర్లో నమ్మించి శవానికి నిప్పు పెట్టిన భర్త

ఊర్లో నమ్మించి శవానికి నిప్పు పెట్టిన భర్త


చీర తీసుకుని రంజిత గొంతు బిగించిన భర్త కల్యాణ్ కుమార్ ఆమెను చంపేయాలని ప్రయత్నించాడు. అదే సమయంలో రంజిత కాళ్లను ఆమె తల్లి కవిత గట్టిగా పట్టుకోవడంతో గిలగిలా కొట్టుకున్న రంజిత ప్రాణాలు వదిలేసింది. రంజితను హత్య చేసే సమయంలో ఆమె భర్త కల్యాణ్ కుమార్ పెద్దమ్మ కుమారుడు అనంత్ కుమార్ (32) కూడా వారికి సహకరించాడు. రంజిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులకు చెప్పిన కుటుంబ సభ్యులు శవాన్ని తీసుకెళ్లి నిప్పంటించారు. గ్రామస్తులకు అనుమానం వచ్చి రాయప్పన్ పట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

    #TOPNEWS : Centre vs Twitter| Mehul Choksi | మోదీపై భారీ కుట్ర - Jaishankar || Oneindia Telugu
     మ్యాటర్ మొత్తం చెప్పిన అత్తా, అల్లుడు

    మ్యాటర్ మొత్తం చెప్పిన అత్తా, అల్లుడు


    రంజిత గొంతు బిగించడంతో ఆమె పీక తెగిపోయిందని, ఆమె హత్యకు గురైయ్యిందని పోస్టుమార్టుంలో వెలుగు చూసింది. పోలీసులు రంజిత భర్త కల్యాణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుంటే జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు. రంజిత హత్య కేసులో ఆమె తల్లి కవిత, భర్త కల్యాణ్ కుమార్, వీరి బంధువు అనంత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. చెప్పినమాట ఎంతకు వినకపోవడంతో కన్నతల్లి, భర్త చేతిలో రంజిత దారుణ హత్యకు గురి కావడం తేనీ

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+