Illegal affair: గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మాజీ భార్యను లేపేశాడు. బైక్ లో శవం తీసుకెళ్లి ? సెక్స్ దందా, మగాళ్లతో !
చెన్నై/కాంచీపురం: వివాహం చేసుకున్న యువతి, యువకుడు రెండు సంవత్సరాలు కాపురం చేశారు. తరువాత తన భార్య పరాయి మహిళలతో కలిసి సెక్స్ దందా నిర్వహిస్తోందని, ఆమె కూడా పలువురు మగాళ్లతో అక్రమ సంబందం ఉందని భర్తకు తెలిసింది. భార్యను వదిలేసిన భర్త అతనిపాటికి అతను జీవించడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో భర్తతో విడాకులు తీసుకున్న ఓ మహిళ ఆ యువకుడికి దగ్గర అయ్యింది. భార్యను వదిలేసిన ఆ యువకుడు భర్తతో విడాకులు తీసుకున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో కలిసి ఒకే ఇంటిలో కాపురం పెట్టాడు. తన మాజీ భర్త పెళ్లి చేసుకోకుండా వేరే మహిళతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకున్న అతని మాజీ భార్య రగిలిపోయింది, భర్త గురించి, అతని ప్రియురాలి గురించి చెడుగా ప్రచారం చేసింది. తన మాజీ భర్త, అతని ప్రియురాలు గంజాయి విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరిని జైలుకు పంపించింది. జైలు నుంచి విడుదలైన యువకుడు అతని గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మాజీ భార్యను దారుణంగా హత్య చేశాడు. మాజీ భార్య శవాన్ని బైక్ లో 40 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లిన ఆమె మాజీ భర్త, అతని ప్రియురాలు శవాన్ని విసిరేసి చేతులు దుపులుకున్నారు.

భార్యతో కాపురం చేసిన భర్త
చెన్నై సిటీలో నవీన్ కుమార్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం నవీన్ కుమార్ ప్రియా (22) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. రెండు సంవత్సరాలు నవీన్ కుమార్, ప్రియా కాపురం చేశారు. భార్య ప్రియా తీరుతో ఆమె భర్త నవీన్ కుమార్ కు అనుమానం మొదలైయ్యింది.

భార్యకు సెక్స్ దందాతో లింక్ ఉందని ?
కొంత కాలం తరువాత తన భార్య ప్రియా స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు మహిళలతో కలిసి సెక్స్ దందా నిర్వహిస్తోందని ఆమె భర్త నవీన్ కుమార్ కు తెలిసింది. తన భార్య ప్రియాకు పలువురు మగాళ్లతో అక్రమ సంబందం ఉందని ఆమె భర్త నవీన్ కుమార్ కు తెలిసింది. ఇదే విషయంలో నవీన్ కుమార్, ప్రియా దంపతుల మద్య గొడవలు జరిగాయి.

భార్యను వదిలేసి ఎక్కువ వయసు ఉన్న మహిళతో ?
భార్య ప్రియాను వదిలేసిన ఆమె భర్త నవీన్ కుమార్ అతని పాటికి అతను జీవించడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో భర్తకు విడాకులు ఇచ్చేసిన కల్పనా (27) అనే మహిళ నవీన్ కుమార్ కు పరిచయం అయ్యింది. తన కంటే వయసులో 2 సంవత్సరాలు పెద్దది అయిన కల్పనాతో చనువు పెంచుకున్న నవీన్ కుమార్ ఆమెతో అక్రమ సంబందం పెట్టుకున్నాడు.

మాజీ భర్త మీద రగిలిపోయిన ప్రియా
భర్తతో విడాకులు తీసుకున్న కల్పనాతో అక్రమ సంబంధం పెట్టుకున్న నవీన్ కుమార్ ఆమెతో కలిసి ఒకే ఇంటిలో కాపురం పెట్టాడు. తన మాజీ భర్త నవీన్ కుమార్ పెళ్లి చేసుకోకుండా కల్పనాతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని తెలుసుకున్న అతని మాజీ భార్య ప్రియా రగిలిపోయింది, మాజీ భర్త నవీన్ కుమార్ గురించి, అతని ప్రియురాలు కల్పనా గురించి ప్రియా ఆ ప్రాంతంలో చెడుగా ప్రచారం చేసింది.

మాజీ భర్త, అతని ప్రియురాలిని జైలుకు పంపించింది
తన మాజీ భర్త నవీన్ కుమార్, అతని ప్రియురాలు కల్పనా గంజాయి విక్రయిస్తున్నారని ప్రియా పోలీసులకు సమాచారం ఇచ్చింది. గంజాయి విక్రయిస్తున్నారని నవీన్ కుమార్, కల్పనాను పోలీసులు అరెస్టు చేసి ఇద్దరిని జైలుకు పంపించారు. జైలుకు వెళ్లి బెయిల్ మీద విడుదలైన నవీన్ కుమార్, అతని ప్రియురాలు కల్పనా మమ్మల్ని జైలుకు పంపించిన ప్రియా అంతు చూడాలని రగిలిపోయారు.

గర్ల్ ఫ్రెండ్ తో కలిసి మాజీ భార్యను చంపేసిన భర్త
నవీన్ కుమార్ అతని గర్ల్ ఫ్రెండ్ కల్పనాతో కలిసి మాజీ భార్య ప్రియాను దారుణంగా హత్య చేశాడు. మాజీ భార్య ప్రియా శవాన్ని చెన్నై నుంచి బైక్ లో 40 కిలోమీటర్ల దూరంలోని చిన్న కాంచీపురం సమీపంలోని నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ విసిరేశారు. ప్రియా హత్య కేసులో ఆమె మాజీ భర్త నవీన్ కుమార్, అతని ప్రియురాలు కల్పనా కోసం పోలీసులు గాలించారు. ప్రియా శవాన్ని విసిరేసి చేతులు దుపులుకోవాలని ప్రయత్నించిన నవీన్ కుమార్, అతని గర్ల్ ఫ్రెండ్ కల్పనా పోలీసులకు చిక్కిపోయారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications