Illegal affair: ప్రియురాలితో ఎంజాయ్ చేసి అక్కడే చంపేశాడు, 11 ఏళ్ల క్రితం భార్యను చంపి తీహార్ జైల్లో!

న్యూఢిల్లీ/తీహార్: చర్చి రోడ్డు సమీపంలోని ఖాళీ స్థలంలో ఓ మహిళ శవమై కనిపించింది. మహిళతో శారీరక సంబంధం సాగించిన తరువాత ఆమె తల మీద బండరాళ్లు వేసి హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. హత్యకు గురైన మహిళ వివరాలు తెలీక పోలీసులు నానా తంటాలు పడ్డారు. మహిళ హత్యకు గురైన ప్రాంతంలో ఓ షాపు క్యారీ బ్యాగ్ చిక్కింది. క్యారీ బ్యాగ్ ఆధారం ఆ షాపు ఉన్న పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు.

మహిళ మిస్సింగ్ కేసులు ఎక్కడైనా నమోదు అయ్యాయా అని ఆరా తీశారు. చివరికి హత్యకు గురైన మహిళ వివరాలు తెలిశాయి. హత్యకు గురైన మహిళ ఉపయోగించిన మొబైల్ ఫోన్ నెంబర్ డేటా బయటకులాగారు. ఇదే సమయంలో మహిళతో చివరిసారిగా ఫోన్ లో మాట్లాడిన వ్యక్తిని పట్టుకున్నారు. గతంలో వివాహం చేసుకుని భర్తను వదిలేసిన మహిళతో తనకు అక్రమ సంబంధం ఉందని, ఆమెను నేనే చంపేశానని అతను అంగీకరించాడు.

అయితే 11 ఏళ్ల క్రితం కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసి 7 సంవత్సరాలు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను కూడా హత్య చేశాడని వెలుగు చూడటంతో పోలీసులు బిత్తరపోయారు.

చర్చి రోడ్డులో మహిళ దారుణ హత్య

చర్చి రోడ్డులో మహిళ దారుణ హత్య

ఢిల్లీలోని వసంత్ కుంజ్ ఏరియాలోని చర్చి రోడ్డు సమీపంలోని ఖాళీ స్థలంలో 42 ఏళ్ల మహిళ హత్యకు గురైయ్యింది. మరుసటి రోజు శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళతో శారీరక సుఖం అనుభవించిన తరువాత ఆమె తల మీద బండరాళ్లు వేసి హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

క్యారీ బ్యాగ్.... సీసీటీవీ కెమెరాలు

క్యారీ బ్యాగ్.... సీసీటీవీ కెమెరాలు

హత్యకు గురైన మహిళ వివరాలు తెలీక ఢిల్లీ పోలీసులు నానా తంటాలు పడ్డారు. మహిళ హత్యకు గురైన ప్రాంతంలో ఓ షాపు క్యారీ బ్యాగ్ చిక్కింది. క్యారీ బ్యాగ్ ఆధారం ఆ షాపు ఉన్న పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. మహిళ మిస్సింగ్ కేసులు ఎక్కడైనా నమోదు అయ్యాయా అని ఆరా తీశారు. ఇదే సమయంలో సంధ్యా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ కనపడటం లేదని వెలుగు చూసింది.

ప్రియుడిని పట్టుకున్న పోలీసులు

ప్రియుడిని పట్టుకున్న పోలీసులు

హత్యకు గురైన సంధ్యా ఉపయోగించిన మొబైల్ ఫోన్ నెంబర్ డేటా బయటకులాగారు. ఇదే సమయంలో సంధ్యాతో చివరిసారిగా ఫోన్ లో మాట్లాడిన వసంత్ కుంజ్ లోని మసూద్ పూర్ లో నివాసం ఉంటున్న రాకేష్ (38) అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో సంధ్యాను తానే హత్య చేశానని రాకేష్ అంగీకరించాడు.

అక్రమ సంబంధం.... పెళ్లి చేసుకోవాలని టార్చర్

అక్రమ సంబంధం.... పెళ్లి చేసుకోవాలని టార్చర్

రెండు సంవత్సరాల నుంచి సంధ్యాతో తనకు అక్రమ సంబంధం ఉందని రాకేష్ పోలీసులకు చెప్పాడు. చాలాకాలం ఇద్దరూ విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేశామని రాకేష్ పోలీసులకు చెప్పాడు. తనను పెళ్లి చేసుకోవాలని సంధ్యా ఎక్కువ టార్చర్ పెట్టిందని, ఆమెను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని రాకేష్ పోలీసులకు చెప్పాడు.

రాత్రి ఆంటీతో ఎంజాయ్ చేసి అక్కడే చంపేశాను

రాత్రి ఆంటీతో ఎంజాయ్ చేసి అక్కడే చంపేశాను

సంధ్యాను పెళ్లి చేసుకోకపోతే ఆమె తనను వదిలిపెట్టదని తెలుసుకున్నానని, అందుకే ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యారని రాకేష్ అన్నాడు. మే 24వ తేదీన సంధ్యాకు ఫోన్ చేసి పిలిపించి ఆమెను ఖాళీగా ఉన్న స్థలంలోకి పిలిపించామని, మద్యం సేవించి ఆమెతో రాసలీలలు సాగించానని రాకేష్ అన్నాడు, తరువాత ఆమె తల మీద బండరాళ్లు వేసి చంపేశానని రాకేష్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

భార్య హత్య కేసులో తీహార్ జైల్లో నిందితుడు

భార్య హత్య కేసులో తీహార్ జైల్లో నిందితుడు

పోలీసుల విచారణలో రాకేష్ గురించి మైండ్ బ్లాక్ అయ్యే విషయం వెలుగు చూసింది. 11 ఏళ్ల క్రితం రాకేష్ అతని భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసి 7 సంవత్సరాలు తీహార్ జైల్లో శిక్ష అనుభవించాడని, జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత అక్రమ సంబంధం పెట్టుకున్న సంధ్యాను కూడా రాకేష్ హత్య చేశాడని వెలుగు చూడటంతో స్థానికులు బిత్తరపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+