Illegal affair: డ్రగ్స్ కు బానిస అయిన లేడీ, లైన్ లో పెట్టిన డ్రైవర్, మరో ప్రియుడితో ?, ఫినిష్!
అమృత్ సర్/ పంజాబ్: మద్యంకు, డ్రగ్స్ కు ఓ మహిళ బానిస అయ్యింది. ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. ట్రక్స్ డ్రైవర్ నిత్యం మద్యం, డ్రగ్స్ తీసుకెళ్లి ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్లతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తికి బాగా పరిచయం ఉంది. ఇదే సమయంలో ఆమె మరో వ్యక్తితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందని డ్రైవర్ ప్రియుడికి తెలిసింది. డ్రగ్స్ సేవిస్తున్న మహిళ కు ట్రక్ డ్రైవర్ ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పాడు.
అనుకున్నట్లు మహిళను ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వెళ్లిన నిందితులు ఆమెను కూరగాయాల మార్కెట్ దగ్గరకు పిలుచుకుని వెళ్లారు. అక్కడ డ్రగ్స్ సేవించి ఎంజాయ్ చేశారు. డ్రగ్స్ మత్తులో ఊగుతున్న మహిళను దారుణంగా చంపేసి ఇద్దరూ అక్కడి నుంచి చెక్కేశారు. మహిళను హత్య చేసిన నిందితులు ఎవరి పనులు వారు చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోయి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారు.

డ్రగ్స్ కు బానిస అయిన మహిళ
పంజాబ్ లోని అమృత్ సర్ సమీపంలోని వల్లా ప్రాంతంలో గురుప్రీత్ కౌర్ (36) అనే మహిళ నివాసం ఉంటున్నది. గురుప్రీత్ కౌర్ డ్రగ్స్ సేవిస్తూ మద్యం తాగుతోంది. గురుప్రీత్ కౌర్ పూర్తిగా డ్రగ్స్ కు బానిస అయ్యిందని వెలుగు చూసింది. గురుప్రీత్ కౌర్ ను మార్చడానికి ఆమె కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

ట్రక్కు డ్రైవర్ తో అక్రమ సంబంధం
పంజాబ్ లోని మోగా ప్రాంతంలో సుఖ్ చైన్ సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సుఖ్ చైన్ సింగ్ అతని ట్రక్కులో వల్లా ప్రాంతంలోని కూరగాయల మార్కెట్ కు నిత్యం కూరగాయాలు సరఫరా చేస్తుంటాడు. ఇదే సమయంలో కూరగాయాల మార్కెట్ సమీపంలోనే నివాసం ఉంటున్న గురుప్రీత్ కౌర్ డ్రైవర్ సుఖ్ చైన్ సింగ్ కు పరిచయం అయ్యింది.

లేడీతో ఎంజాయ్ చేశాడు
ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తున్న సుఖ్ చైన్ సింగ్ తో గుర్ ప్రీత్ కౌర్ అక్రమ సంబంధం పెట్టుకుంది. ట్రక్స్ డ్రైవర్ సుఖ్ చైన్ సింగ్ నిత్యం మద్యం, డ్రగ్స్ తీసుకెళ్లి గురుప్రీత్ కౌర్ తో కలిసి చేవిస్తూ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. గురుప్రీత్ కు, ట్రక్కు డ్రైవర్ సుఖ్ చైన్ సింగ్ కు సితారా సింగ్ డ్రగ్స్, వాళ్లు తినడానికి స్నాక్స్ సరఫరా చేస్తున్నాడు.

లేడీతో తేడా వచ్చేసింది
మద్యంకు బానిస అయిన గురుప్రీత్ కౌర్ మద్యం, డ్రగ్స్ తెప్పించుకున్న తరువాత సితారా సింగ్ కు సక్రమంగా డబ్బులు ఇచ్చేది కాదని సమాచారం. ఇదే సమయంలో మద్యం మత్తులో ప్రియుడు సుఖ్ చైన్ సింగ్ తో నిత్యం ఆమె గొడవపడేదని తెలిసింది. అంతే కాకుండా గురుప్రీత్ కౌర్ మరో వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుని అతనితో చాలా చనువుగా ఉంటున్న విషయం ఆమె ట్రక్కు డ్రైవర్ ప్రియుడు సుఖ్ చైన్ సింగ్ కు తెలిసిపోవడంతో అతను రగిలిపోయాడు.

ఫోన్ చేసి పిలిపించుకున్న ప్రియుడు
తనతో పాటు డ్రగ్స్ సేవిస్తున్న గురుప్రీత్ కౌర్ మరో వ్యక్తితో అక్రమ సంబందం పెట్టుకుని నన్ను మోసం చేస్తోందని ట్రక్కు డ్రైవర్ సుఖ్ ైన్ సింగ్ రగిలిపోయాడు. గురుప్రీత్ కౌర్ కు ట్రక్ డ్రైవర్ సుఖ్ చైన్ సింగ్ ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పాడు. అనుకున్నట్లు గురుప్రీత్ కౌర్ ఇంటి నుంచి బయటకు పిలుచుకున్న ట్రక్కు డ్రైవర్ సుఖ్ చైన్ సింగ్ ఆమెను బైక్ లో వల్లా కూరగాయాల మార్కెట్ దగ్గరకు పిలుచుకుని వెళ్లారు.

పక్కాప్లాన్ తో లేడీ హత్య
కూరగాయల మార్కెట్ లో గురుప్రీత్ కౌర్, ఆమె ప్రియుడు సుఖ్ చైన్ సింగ్ డ్రగ్స్ సేవించి ఎంజాయ్ చేశారు. డ్రగ్స్ మత్తులో ఊగుతున్న గురుప్రీత్ కౌర్ ను దారుణంగా చంపేసిన సుఖ్ చైన్ సింగ్, సితారా సింగ్ అక్కడి నుంచి చెక్కేశారు. గురుప్రీత్ కౌర్ అనే మహిళను హత్య చేసిన నిందితులు ఇద్దరూ ఎవరి పనులు వారు చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోయి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించారు. అయితే మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా, స్థానికుల ఇచ్చిన సమాచారం మేరకు సుఖ్ చైన్ సింగ్, సితారా సింగ్ ను అరెస్టు చేశామని డీసీపీ హర్పాల్ సింగ్ మీడియాకు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications