Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: పూజారికి గుడిలో అసిస్టెంట్, ఇంట్లో ఆంటీకి ?, పువ్వులు పట్టిన చేతితో కత్తి !

చెన్నై/ బెంగళూరు: గుడిలో పూజారిగా పని చేస్తున్న బ్రాహ్మణుడు సంతోషంగా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. గుడికి వస్తున్న భక్తుల కష్టాలు తీర్చడానికి ఆ పూజారి ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నాడు. ఒక్కడే అన్ని పనులు చూసుకోవడం కష్టం కావడంతో ఆ పూజారి ఓ అసిస్టెంట్ ను పెట్టుకున్నాడు. పాపం పూజారికి గ్రహాలు అనుకూలించలేదో ఏమో కాని తన అసిస్టెంట్ ను ఏకంగా ఇంట్లో పెట్టుకున్నాడు. వయసులో ఉన్న కుర్రాడి మీద పూజారి భార్య, మంచి నున్నగా ఉన్న గురువు గారి భార్య మీద కుర్రాడికి మనసు పడింది. అంతే గుడిలో పూజారి పూజలు చేస్తుంటే ఆయన అసిస్టెంట్ ఇంట్లో గురువు గారి భార్యకు అభిషేకాలు చెయ్యడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న పూజారి ఇద్దరికి నచ్చచెప్పినా ఎవ్వరూ మాటమాత్రం వినలేదు. అంతే పువ్వులు చేతిలో పట్టుకున్న పూజారి చివరికి కత్తి పట్టుకుని భార్యను కసకసా పొడిచిపొడిచి చంపేయడం కలకలం రేపింది.

17 ఏళ్ల క్రితం పెళ్లి.... హ్యాపీ లైఫ్

17 ఏళ్ల క్రితం పెళ్లి.... హ్యాపీ లైఫ్


తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని వేపనపల్లి సమీపంలోని బాగలూర్ బ్రాహ్మణ వీధిలో (బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరం)ని మార్కెట్ స్ట్రీట్ లో చెన్నబసప్ప (45), గౌరమ్మ (41) దంపతులు నివాసం ఉంటున్నారు. 17 ఏళ్ల క్రితం చెన్నబసప్ప, గౌరమ్మలకు వివాహం జరిగింది. చెన్నబసప్ప, గౌరమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గుడిలో పూజారి

గుడిలో పూజారి

ప్రముఖ దేవాలయంలో చెన్నబసప్ప పూజారిగా పని చేస్తున్నాడు. గుడికి వస్తున్న భక్తుల కష్టాలు తీర్చడానికి పూజారి చెన్నబసప్ప ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నాడు. స్థానికుల దగ్గర, భక్తుల దగ్గర పూజారి చెన్నబసప్పకు మంచి పేరు ఉంది. ఏదైనా మంచి పని చేసే ముందు చెన్నబసప్ప దగ్గర ఒక్కమాట అడిగినా, ఆయన ఆశీర్వాదం తీసుకున్న మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతున్నారని సమాచారం.

పూజారికి అసిస్టెంట్

పూజారికి అసిస్టెంట్

గుడికి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నాడు. ఒక్కడే అన్ని పనులు చూసుకోవడం కష్టం కావడంతో పూజారి చెన్నబసప్ప ఆయన పనులకు సహాయం చెయ్యడానికి మృంత్యుంజయ (23) అనే బ్రాహ్మణ కులానికి చెందిన యువకుడిని అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. తనకు సహాయంగా ఉంటున్న మృంత్యుంజయను ఆ పూజారి అతని ఇంట్లోనే పెట్టుకున్నాడు.

గురువుకు సహాయం.... అమ్మయ్యకు సహకారం

గురువుకు సహాయం.... అమ్మయ్యకు సహకారం


వయసులో ఉన్న కుర్రాడు మృంత్యుంజయ మీద పూజారి భార్య గౌరమ్మ కన్నుపడింది. మంచి నున్నగా ఉన్న గురువు గారి భార్య గౌరమ్మ మీద కుర్రాడు మృంత్యుంజయ మనసు పడింది. అంతే ఆ పనిఈపని అంటూ గురువు వారి ఇంట్లో తిరుగుతున్న మృంత్యుంజయ మంచి టైపు చూసి గౌరమ్మను వాటేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి గౌరమ్మ, మృంత్యుంజయ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు.

గురువు దగ్గర బుద్దిమంతుడు...... మేడమ్ దగ్గర చక్క భజన

గురువు దగ్గర బుద్దిమంతుడు...... మేడమ్ దగ్గర చక్క భజన

పూజారి చెన్నబసప్ప కళ్లు కప్పిన మృంత్యుంజయ ఎప్పుడుపడితే అప్పుడు ఆయన ఇంటికి వెళ్లి ఆయన భార్య గౌరమ్మతో సరసాలు ఆడుతూ చెక్కభజన చెయ్యడం మొదలుపెట్టాడు. కుర్రాడు వలలో పడటంతో గౌరమ్మ తనివితీరా ఆమె కోరికలు అన్నీ తీర్చుకునింది. రానురాను గౌరమ్మ, మృంత్యుంజయల వ్యవహారం ముదురిపోయి పగలే ఇంట్లోని బెడ్ రూమ్ లో విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు.

ఇద్దరికీ లాస్ట్ వార్నింగ్

ఇద్దరికీ లాస్ట్ వార్నింగ్

రెండు రోజులు పాటు తనకు అనారోగ్యంగా ఉందని చెప్పిన మృంత్యుంజయ గురువు చెన్నబసప్పకు సహాయం చెయ్యడానికి వెళ్లకుండా ఆయన భార్య గౌరమ్మతో గంటల గంటలు ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. అనుకోకుండా ఇంట్లోకి వెళ్లిన చెన్నబసప్ప బెడ్ రూమ్ లో తన భార్య, శిష్యుడు మృంత్యుంజయ నగ్నంగా కనపడటంతో ఆ విషయం జీర్ణించుకోలేకపోయాడు, భార్య గౌరమ్మ, శిష్యుడు మృంత్యుంజయను పట్టుకుని చితకబాదేశాడు. మృంత్యుంజయను ఇంటి నుంచి తన్ని తరిమేసిన పూజారి చెన్నబసప్ప ఇద్దరికి లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు.

పువ్వులు పట్టిన చేతితో కత్తి పట్టిన పూజారి

పువ్వులు పట్టిన చేతితో కత్తి పట్టిన పూజారి

భార్య గౌరమ్మకు బుద్దిమాటలు చెప్పడానికి చెన్నబసప్ప ఆమెను గురువారం సాయంత్రం వేపనపల్లి సమీపంలోని ఆలయం దగ్గరకు పిలుచుని వెళ్లాడు. మృంత్యుంజయతో ఇంతకాలం నువ్వు తిరిగిన తిరుగుడు చాలు, ఇక ముందు బుద్దిగా ఉండాలని మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. ఆ సమయంలో దంపతుల మధ్యమాటామాటా పెరిగిపోయింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన చెన్నబసప్ప నువ్వు జీవితంలో మారవు అంటూ కత్తి తీసుకుని భార్య గౌరమ్మను పదేపదే పొడిచిపొడి చంపేశాడు. భార్య గౌరమ్మ ప్రాణం పోయిందని నిర్దారించుకున్న పూజారి చెన్నబసప్ప అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Recommended Video

    Irrfan Khan పై కొడుకు Babil Khan ఎమోషనల్.. నాన్నకు ప్రేమతో..!! || Oneindia Telugu
    నా భార్య శవం అక్కడే ఉంది తెచ్చుకోండి

    నా భార్య శవం అక్కడే ఉంది తెచ్చుకోండి

    వేపనపల్లి నుంచి రాత్రిపొద్దు పోయిన తరువాత హోసూరు పోలీస్ స్టేషన్ చేరుకున్న పూజారి చెన్నబసప్ప తన భార్య తిరుగుబోతు అయ్యిందని, అందుకే చంపేశానని, శవం గుడి దగ్గర ఉంది తెచ్చుకొండి అని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. హోసూరు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వేపనపల్లి పోలీసులు గౌరమ్మ శవాన్ని స్వాధీనం చేసుకుని హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన గురువు ఆంటీ గౌరమ్మను హత్య చేశాడని తెలుసుకున్న ప్రియుడు మృంత్యుంజయ అయిపోయాడు. గురువుకు సహాయం చెయ్యడానికి వెళ్లిన శిష్యుడు ఆయన భార్యనే వలలో వేసుకుని ఆమె ప్రాణం పోవడానికి కారణం అయ్యాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+