Wife: మేడమ్ కు ముచ్చటగా ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్, మసాలా పూరీ, పానీపూరీ, బేల్ పూరీ, క్లైమాక్స్ లో ?

చెన్నై/తిరుచ్చి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో హ్యాపీగా కాపురం చేసింది. డబ్బు బాగా సంపాధించాలని భర్త అతని భార్యను పిలుచుకుని వేరే రాస్ట్రానికి చేరుకున్నాడు. దంపతులకు చంటి బిడ్డ ఉంది. భార్యతో హ్యాపీగా జీవిస్తున్న భర్త చనిపోయాడు. భర్త ఎలా చనిపోయాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. భార్య మాత్రం ఆమె కుమార్తెతో కలిసి అదే సిటీలో ఉంటున్నది. ఈ సందర్బంలో బస్ స్టాండ్ సమీపంలో ఓ వ్యక్తిని వెంటాడి వెంటాడి దారుణంగా నరికి చంపేశారు. ఈ కేసులో హంతకులతో పాటు ఆ మహిళ కూడా అరెస్టు కావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ఇంతకాలం మసాలా పూరీ, పానీపూరీ, బేల్ పూరీ అనుకున్న లేడీకి మైండ్ బ్లాక్ అయ్యింది.

అసలు అక్కడ ఏం జరిగింది ?

అసలు అక్కడ ఏం జరిగింది ?


పశ్చిమ బెంగాల్‌కు చెందిన విక్రమ్ (34) అనే వ్యక్తిని తిరుచ్చి సిటీలోని పుత్తూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదురుగా ఉన్న వివిధ రెస్టారెంట్లలో వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తిరుచ్చి ఫోర్ట్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో విక్రమ్ నిలబడి ఉన్నాడు. ఆ సందర్బంలో ఇద్దరు వ్యక్తులు వెళ్లి అతని తో గొడవ పెట్టుకున్నారు. ఒక్కసారిగా మారణాయుధాలతో విక్రమ్ మీద నిందితులు దాడి చేశారు. ప్రాణ భయంతో విక్రమ్ అక్కడి నుంచి పరుగు తీశాడు.

 వెంటాడి వెంటాడి నరికేశారు

వెంటాడి వెంటాడి నరికేశారు

మారణాయుధాలతో దాడి చెయ్యడంతో విక్రమ్ అక్కడి నుంచి పరుగు తీశాడు. అయితే మారిస్ థియేటర్ వైపు పరుగెత్తిన విక్రమ్‌ను వారు వెంబడించారు. తరువాత విక్రమ్ ను కత్తులతో పొడిచి దారుణంగా స్పాట్ లో చంపేశారు. విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందాడని నిర్దారించుకున్న నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు పశ్చిమ బెంగాల్‌ నుంచి విక్రమ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.

హంతకులు ఎలా చిక్కారంటే ?

హంతకులు ఎలా చిక్కారంటే ?


పశ్చిమ బెంగాల్ వ్యక్తి హత్య కేసులో పోలీసులు తిరుచ్చిలోని వీరయ్యూరు వినాయగర్ కోయిల్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న దీపికా అలియాస్ దీపా (27) అనే మహిళతో పాటు చింతామణి బాల (34), చందుకాడై ప్రాంతానికి చెందిన గణేశన్ (35) అనే నిందితులను అరెస్టు చేశారు. తిరుచ్చి సమీపంలోని చత్రం బస్టాండ్ ప్రాంతంలో నిల్చున్న ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

 మేడమ్ కు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్

మేడమ్ కు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్


భర్త చనిపోవడంతో పసిపాపతో చత్రం ప్రాంతంలో మసాలా పూరీ, పానీపూరీ విక్రయిస్తున్న దీపికాకు మిగిలిన ఇద్దరితో అక్రమ సంబంధం ఉందని పోలీసులు అన్నారు. ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న దీపికా తరువాత విక్రమ్ తో కూడా చనువు పెట్టుకుని అతనితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందని, ఆ విషయంలో రగిలిపోయిన నిందితులు గణేశన్, బాలా విక్రమ్ ను హత్య చేశారని పోలీసులు తెలిపారు. విక్రమ్ ను హత్య చేసిన తరువాత దీపికాతో పాటు తిరుచ్చి వదిలి పారిపోవడానికి ప్రయత్నించడంతో అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+