Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

nurse: ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ తో రొమాన్స్, గాయిత్రీ డబుల్ గేమ్ కి యువరాజు ఢమాల్, క్లైమాక్స్ లో ?

ఉద్యోగం చేస్తున్న మహిళ మాజీ ప్రియుడితో సరసాలు ఆడింది. మ్యాటర్ తెలుసుకున్న భర్త అతని భార్యను ఉద్యోగం మానేయాలని చెప్పాడు. ప్రియుడిని కలవడానికి అవకాశం లేకపోవడంతో ఆమె చేసిన పనికి అందరూ హడలిపోయారు.

చెన్నై/తిరుచ్చి: కాలేజ్ లో చదువుతున్న సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కాలేజ్ లో చదువుతున్న ప్రేమికులు ఎంజాయ్ చేశారు. కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత ఎవరిపాటికి వాళ్లు వాళ్ల ఇంటికి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న ప్రేమికులు చాలా కాలం పాటు కలుసుకుని ఎంజాయ్ చేశారు. అయితే ప్రియురాలికి వేరే యువకుడితో పెళ్లి జరిగింది. కూతురు పుట్టిన తరువాత కూడా ఉద్యోగం చేస్తున్న మహిళ మాజీ ప్రియుడితో సరసాలు ఆడింది. మ్యాటర్ తెలుసుకున్న భర్త అతని భార్యను ఉద్యోగం మానేయాలని చెప్పాడు. ప్రియుడిని కలవడానికి అవకాశం లేకపోవడంతో ఆమె చేసిన పనికి అందరూ హడలిపోయారు.

భర్త అనుమానాస్పద స్థితిలో ?

భర్త అనుమానాస్పద స్థితిలో ?

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని ఆర్‌కే పేట్టై యూనియన్‌ సుందరరాజపురం గ్రామానికి చెందిన అరుముగం కుమారుడు యువరాజ్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. యువరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువరాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

యువరాజ్ భార్యకు ?

యువరాజ్ భార్యకు ?

పోలీసుల విచారణలో యువరాజ్ భార్య గాయత్రి మీద అనుమానం వచ్చింది. మేడమ్ గాయిత్రీ గురించి పోలీసులు పిన్ టూ పిన్ బయటకులాగేశారు. యువరాజ్ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. యువరాజ్ భార్య పుట్టుపూర్వోత్తరాలు బయటకు లాగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తమిళనాడులోని తిరుత్తణిలోని ఆగూర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్ తో గాయిత్రీకి అక్రమ సంబందం ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

పెళ్లికి ముందు ?, పెళ్లి తరువాత

పెళ్లికి ముందు ?, పెళ్లి తరువాత

పెళ్లికి ముందు గాయత్రి, శ్రీనివాసన్‌ ప్రేమలో ఉన్నారనే విషయం కూడా వెల్లడైంది. చెన్నైలోని ఒకే మెడికల్ కాలేజీలో నర్సింగ్ చదువుతున్నప్పుడు గాయిత్రీ, శ్రీనివాసన్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. గాయత్రి ఇంట్లో వాళ్లకు ఆమె ప్రేమ గురించి తెలిసి హడలిపోయారు. గుట్టుచప్పుడు కాకుండా అదే గ్రామానికి చెందిన యువరాజ్ అనే బంధువుల అబ్బాయితో మూడు సంవత్సరాల క్రితం గాయిత్రీ వివాహం జరిపించారు.

మేడమ్ కు కూతురు ఉంది

మేడమ్ కు కూతురు ఉంది

యువరాజ్ తో గాయత్రికి పెళ్లయిన తరువాత ఆమె భర్తతో సంతోంగానే కాపురం చేసింది, యువరాజ్, గాయిత్రీ దంపతులకు రెండేళ్ల కూతురు ఎంది. కూతురు ఉన్నప్పటికీ మాజీ ప్రియుడు శ్రీనివాసన్‌తో గాయిత్రీ అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. తిరుత్తణిలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో గాయత్రి నర్సుగా, అదే ఆసుపత్రిలో శ్రీనివాసన్ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగంలో చేరారు. భార్య గాయిత్రీ ఉద్యోగం చేస్తానని చెప్పడంతో ఆమె భర్త యువరాజ్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదు.

భర్తకు మ్యాటర్ లీక్ అయ్యింది

భర్తకు మ్యాటర్ లీక్ అయ్యింది

ఒకే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న గాయిత్రీ, ఆమె ప్రియుడు శ్రీనివాసన్ ఇంతకాలం పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. ఒకే ఆసుపత్రిలో పని చెయ్యడంతో ఈ మ్యాటర్ అంతత్వరగా బయటకురాలేదు. ఇటీవల భార్య గాయిత్రీ, శ్రీనివాస్ ల అక్రమ సంబంధం విషయం యువరాజ్ కు తెలిసిపోయింది. ఇకపై నువ్వు ఆసుపత్రికి పనికి వెళ్లవద్దని, ఇంట్లోనే ఉండమని గాయత్రికి ఆమె భర్త యువరాజ్ తేల్చి చెప్పాడు.

ప్రియుడికి మొరపెట్టుకున్న గాయిత్రీ

ప్రియుడికి మొరపెట్టుకున్న గాయిత్రీ

తన భర్త యువరాజ్ ఉద్యోగానికి వెళ్లకూడదని తేల్చి చెప్పాడని, ఇక ముందు మనం కలవడం సాధ్యం కాదని గాయత్రి ఆమె ప్రియుడు శ్రీనివాసన్‌కు ఫోన్ చేసి బోరున ఏడ్చింది. దీని తరువాత, శ్రీనివాసన్ వారి స్నేహితులు తిరుత్తణి పెరియార్‌కు చెందిన మణికందన్, ఎహోథన్‌లను వెంటపెట్టుకుని ప్రియురాలు గాయిత్రీ ఇంటికి చేరుకుని ఆమె భర్త యువరాజ్ తో గొడవ పడ్డాడు.

నలుగురు కలిసి యువరాజ్ ను చంపేశారు

నలుగురు కలిసి యువరాజ్ ను చంపేశారు

గొడవ జరుగుతున్న సమయంలో శ్రీనివాసన్ అతని స్నేహితులు యువరాజ్‌తో వాగ్వాదానికి దిగారు, తరువాత యువరాజ్ కు కిందకు తోసేయడంతో గాయత్రి యువరాజ్ ఛాతీపై కూర్చోని అతన్ని కదలకుండా పట్టుకునింది. ప్రియుడు శ్రీనివాసన్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులు యువరాజ్ చేతులు మరియు కాళ్ళు పట్టుకుని యువరాజ్‌ను గొంతు నులిమి చంపారు. తరువాత యువరాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

విషం తాగిన కిలాడీ పెళ్లామ్

విషం తాగిన కిలాడీ పెళ్లామ్

కేసు దర్యాప్తు చేసిన పోలీసులు గాయిత్రీని విచారణ చేశారు. చిక్కిపోతాం అనే భయంతో గాయిత్రీ విషం తాగేసింది. తరువాత తిరుత్తణిలో ఉన్న మణికందన్‌, ఎహోనాథన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీపెరంబుదూర్‌లో తలదాచుకున్న గాయిత్రీ ప్రియుడు శ్రీనివాసన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ స్థితిలో విషం తాగి చేయి కోసుకుని సోలింగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతుడు యువరాజ్ భార్య గాయత్రిని ఆర్కే పేట్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+