Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఒకే ఆంటీతో ఫ్రెండ్స్ వన్స్ మోర్, బర్త్ డే పార్టీలో నేరుజారి ?, కట్ చేసి రోడ్డు మీద !

చెన్నై/కడలూరు: చిన్నప్పటి నుంచి కలిసి చదువుతున్న యువకులు ఇప్పుడు ఎవరిపని వారు చేసుకుంటున్నారు. స్నేహితులు కొందరు ఒకే చోట వ్యాపారం చేస్తున్నారు. స్నేహితులు అందరూ రాత్రి సొంత ఊరిలో కలిశారు. ఒకేచోట చిన్ననాటి స్నేహితులు కలవడంతో మందు పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో ఓ స్నేహితుడు మిస్ కావడంతో అతన్ని ఫోన్ చేసి మరీ అక్కడికి పిలిపించారు. మద్యం పీకలదాక సేవించిన స్నేహితులు ఒకరి మనసులోని మాట ఒకరు బయటకు చెప్పడం మొదలు పెట్టారు. మద్యం మత్తులో ఉన్న స్నేహితుల మద్య ఓ ఆంటీ టాపిక్ వచ్చింది. ఆమెతో నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, అలా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఓ యువకుడు చెప్పాడు.

అదే సమయంలో అతని స్నేహితుడు కూడా అదే ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న విషయం బయటపడింది. ఇంతకాలం ఒకరికి తెలీకుండా ఒకరు సోరచేప లాంటి ఆంటీతో ఎంజాయ్ చేస్తున్నారని అక్కడ బయటపడింది. ఆ సమయంలో స్నేహితుల మద్య మాటామాటా పెరిగిపోవడం, అప్పటికే పీకలదాక మద్యం సేవించి ఉండటంతో గొడవ జరిగింది. ఆంటీ ముద్దుల ప్రియులు గొడవపడటంతో యువకులు సహనం కోల్పోయి కత్తి తీసుకుని ఫోన్ చేసి బలవంతంగా అక్కడికి పిలిపించిన సాటి స్నేహితుడిని దారుణంగా పొడిచి చంపేశారు. యువకుడిని హత్య చేసిన స్నేహితులు అతని శవాన్ని తీసుకెళ్లి రొడ్డు పక్కన విసిరేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

 చిన్ననాటి స్నేహితులు

చిన్ననాటి స్నేహితులు

తమిళనాడులోని విరుదాచలంలోని అన్నానగర్ లో మోహమ్మద్ నబీస్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. విరుదాచలంలోని అయ్యంపేటలో అసురాజ్ కుమార్ కుమారుడు అరుణ్ రాజ్ నివాసం ఉంటున్నాడు. మోహమ్మద్ నబీస్, అరుణ్ రాజ్, అదే ఊరిలో నివాసం ఉంటున్న మనోజ్, ప్రేమ్ కుమార్ తదితరులు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు.

 మనోజ్ బర్త్ డే పార్టీ

మనోజ్ బర్త్ డే పార్టీ

చిన్నప్పటి నుంచి కలిసి చదువుతున్న యువకులు ఇప్పుడు ఎవరిపని వారు చేసుకుంటున్నారు. అరుణ్ రాజ్, ప్రేమ్ కుమార్ తదితర స్నేహితులు కొందరు చెన్నైలోని మెరీనా బీచ్ లో ఒకే చోట కీచైన్ ల మీద పేర్లు రాసే షాపులు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. మనోజ్ బర్త్ డే సందర్బంగా స్నేహితులు అందరూ రాత్రి సొంత ఊరు విరుదాచలంలో కలిశారు.

 ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీ

ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీ

అరుణ్ రాజ్ తల్లిదండ్రులు కుటుంబ గొడవల కారణంగా విడిపోయి వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. అరుణ్ రాజ్ ఎప్పుడు సొంత ఊరుకు వెళ్లినా అతని తల్లి ఇంటికి వెళ్లి వస్తున్నాడు. రాత్రి అరుణ్ రాజ్ అతని తల్లి ఇంటిలో ఉన్నాడు. రాత్రి మనోజ్ ఇంటి సమీపంలో ఖాలీగా ఉన్ని మెహమ్మద్ నబీస్ ఇంటిలో లిక్కర్ పార్టీ ఏర్పాటు చేశారు.

 ఫోన్ చేసి బలవంతంగా పిలిపించారు

ఫోన్ చేసి బలవంతంగా పిలిపించారు

మనోజ్, ప్రేమ్ కుమార్, మోహమ్మద్ నబీస్ తదితరులు లిక్కర్ పార్టీకి హాజరైనారు. ఆ సమయంలో అరుణ్ రాజ్ మిస్ కావడంతో అతన్నికి ఫోన్ చేసిన మనోజ్ అతన్ని మందు పార్టీకి బలవంతంగా పిలిపించారు. మందు పార్టీ ప్రారంభం అయిన గంట తరువాత అరుణ్ రాజ్ స్నేహితులు ఉన్న ఇంటి దగ్గరకు వెళ్లాడు.

 ఒకే ఆంటీతో ఫ్రెండ్స్ ఎంజాయ్

ఒకే ఆంటీతో ఫ్రెండ్స్ ఎంజాయ్

చెన్నై మెరీనా బీచ్ లో కీచైన్స్ వ్యాపారం చేస్తున్న ప్రేమ్ కుమార్, అరుణ్ రాజ్ అక్కడ చేపలు విక్రయించే సెల్వీ (పేరు మార్చడం జరిగింది) అనే ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఒకరికి తెలీకుండా ఒకరు సెల్వీ ఆంటీతో ఇంతకాలం ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అరుణ్ రాజ్, ప్రేమ్ కుమార్ స్నేహితులు అని ముందే తెలిసినా సెల్వీ ఆంటీ వారు ఒకరికంట ఒకరు పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇద్దరు ప్రియులతో సెల్వీ ఆంటీ ఇంతకాలం మస్త్ మజా చేస్తూ వచ్చింది.

 ఆంటీతో ఫ్రెండ్స్ వన్స్ మోర్ టాపిక్ తో గొడవ

ఆంటీతో ఫ్రెండ్స్ వన్స్ మోర్ టాపిక్ తో గొడవ

పీకలదాక మద్యం సేవించిన స్నేహితులు ఒకరి మనసులోని మాట ఒకరు బయటకు చెప్పడం మొదలు పెట్టారు. మద్యం మత్తులో ఉన్న స్నేహితుల మద్య చెన్నై మెరీనా బీచ్ సెల్వీ ఆంటీ టాపిక్ వచ్చింది. సెల్వీ ఆంటీతో నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, అలా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ప్రేమ్ కుమార్ చెప్పాడు. అదే సమయంలో అతని స్నేహితుడు అరుణ్ రాజ్ కూడా నేను కూడా అదే సెల్వీ ఆంటీతో ఎంజాయ్ చేస్తున్నానని నోరుజారి అసలు విషయం బయటకు చెప్పాడు.

 కత్తులతో పొడిచేసిన ఫ్రెండ్స్

కత్తులతో పొడిచేసిన ఫ్రెండ్స్

ఆ సమయంలో ప్రేమ్ కుమార్, అరుణ్ రాజ్ తో పాటు వారి స్నేహితుల మద్య మాటామాటా పెరిగిపోయింది. అప్పటికే అందరూ పీకలదాక మద్యం సేవించి ఉండటంతో గొడవ పెద్దది అయ్యింది. సెల్వీ ఆంటీ ముద్దుల ప్రియులు ప్రేమ్ కుమార్, అరుణ్ రాజ్ గొడవపడటంతో సాటి స్నేహితులు సహనం కోల్పోయారు. ఆ సమయంలో కత్తి తీసుకున్న ప్రేమ్ కుమార్ ఫోన్ చేసి బర్త్ డే పార్టీకి బలవంతంగా అక్కడికి పిలిపించిన సాటి స్నేహితుడు అరుణ్ రాజ్ ను దారుణంగా పొడిచి చంపేశారు.

Recommended Video

    తన ఇంటిపై దాడిన అడ్డుకున్న కార్యకర్తలపై అక్రమకేసులు ఎత్తేయాలన్న రేవంత్ రెడ్డి!!
     రోడ్డు మీద శవం విసిరేసి డ్రామాలు

    రోడ్డు మీద శవం విసిరేసి డ్రామాలు

    అరుణ్ రాజ్ ను హత్య చేసిన స్నేహితులు అతని శవాన్ని తీసుకెళ్లి రొడ్డు పక్కన విసిరేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. మనోజ్ 108కు ఫోన్ చేసి అక్కడి నుంచి జారుకున్నాడు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే అరుణ్ రాజ్ చనిపోయాడని విరుదాచలం అసిస్టెంట్ పోలీసు కమీషనర్ అంజిత్ జైన్ అన్నారు. అరుణ్ రాజ్ ను హత్య చేసిన ప్రేమ్ కుమార్, హత్యకు సహకరించిన మనోజ్, మోహమ్మద్ నబీస్ తదితరులను అరెస్టు చేశామని విరుదాచలం అసిస్టెంట్ పోలీసు కమీషనర్ అంజిత్ జైన్ చెప్పారు. ఒకే ఆంటీ కోసం స్నేహితులు గొడవ పడి ఒకరు హత్యకు గురి కావడం విరుదాచలంలో కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+