Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: కాంట్రాక్టు కిల్లర్స్ తో భార్య డీలింగ్, కాలువలో శవమైన భర్త, ట్విస్ట్, ఆరు మంది !

లక్నో/ప్రయోగ్ రాజ్/ చెన్నై: వివాహం జరిగిన మొదట్లో దంపతులు చక్కగా కాపురం చెయ్యడంతో ముగ్గురు పిల్లలు పుట్టారు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రోజూ రాత్రి మద్యం సేవించి ఇంటికి వెలుతున్న భర్త అతని భార్యను చితకబాదడం మొదలుపెటాడు. అడ్డువెలుతున్న పిల్లలను కూడా భర్త చితకబాదుతున్నాడని తెలిసింది. రానురాను దంపతుల మద్య గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. కొన్ని రోజుల క్రితం తన భర్త కనపడటం లేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య మిస్సింగ్ కేసు పెట్టిన మరుసటి రోజు ఓ కాలువలో భర్త శవమై కనిపించాడు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు, ట్విస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధం, టార్చర్ కారణంగా భర్త హత్యకు గురైనాడని వెలుగు చూసింది. భర్త హత్య కేసులో అతని భార్య, ఆమె తమ్ముడితో పాటు కాంట్రాక్టు కిల్లర్లు తెరమీదకు రావడంతో కథ రసవత్తరంగామారింది.

దంపతుల హ్యీపీలైఫ్

దంపతుల హ్యీపీలైఫ్


ఉత్తరప్రదేశ్ లోని ప్రయోగ్ రాజ్ జిల్లాలోని బాఘ్రాయ్ ప్రాంతంలో రామ్ శంకర్ సరోజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రామ్ శంకర్, స్వప్నా సరోజ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రామ్ శంకర్, స్వప్నా సరోజ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహం జరిగిన మొదట్లో రామ్ శంకర్, స్వప్నా సరోజ్ దంపతులు సంతోషంగానే జీవించారని వారి బంధువులు అంటున్నారు.

మిస్సింగ్ కేసు పెట్టిన భార్య

మిస్సింగ్ కేసు పెట్టిన భార్య

కొన్న రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త రామ్ శంకర్ తరువాత కనపడటం లేదని అతని భార్య స్వప్నా సరోజ్ హతిగావ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య స్వప్నా సరోజ్ మిస్సింగ్ కేసు పెట్టిన మరుసటి రోజు ప్రతాప్ గఢ్ జిల్లాలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సునియావా గ్రామంలోని కాలువలో భర్త రామ్ శంకర్ శవమై కనిపించాడు. పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గంటకు ఒక మాట మార్చిన భార్య

గంటకు ఒక మాట మార్చిన భార్య


రామ్ శంకర్ హత్యకు గురైనాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రామ్ శంకర్ గొంతును తాడుతో బిగించి హత్య చేశారని నిర్దారించుకున్న పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. పోలీసుల విచారణలో రామ్ శంకర్ భార్య స్వప్నా సరోజ్ గంటకు ఒకమాట చెప్పడంతో ఆమె మీద పోలీసులకు అనుమానం పెరిగిపోయింది.

మ్యాటర్ మొత్తం చెప్పిన భార్య

మ్యాటర్ మొత్తం చెప్పిన భార్య

స్వప్నా సరోజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారణ చెయ్యడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. రోజూ రాత్రి మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుని ఇంటికి వస్తున్న తన భర్త రామ్ శంకర్ తనను చితకబాదడం మొదలుపెటాడని, అడ్డుపడుతున్న పిల్లలను కూడా చితకబాదుతున్నాడని స్వప్నా సరోజ్ పోలీసులకు చెప్పింది.

బయట అక్రమ సంబంధాలు

బయట అక్రమ సంబంధాలు

తన భర్త రామ్ శంకర్ ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని వారితో ఎంజాయ్ చేస్తున్నాడని, మద్యంకు, డ్రగ్స్ కు అలవాటుపడి తన గురించి, పిల్లల గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశాడని స్వప్నా సరోజ్ పోలీసులకు చెప్పింది. రానురాను తన భర్త రామ్ శంకర్ ఆగడాలు ఎక్కువ కావడంతో అతన్ని చంపేసి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యానని స్వప్నా సరోజ్ పోలీసులకు చెప్పింది.

తమ్ముడు..... కాంట్రాక్లు కిల్లర్స్ ఎంట్రీ

తమ్ముడు..... కాంట్రాక్లు కిల్లర్స్ ఎంట్రీ

తన తమ్ముడు గోవింద్ సరోజ్ ను ఇంటికి పిలిపించి అతనికి మ్యాటర్ మొత్తం చెప్పానని, తన భర్త హత్యను చెయ్యాలని చర్చించుకున్నామని స్వప్నా సరోజ్ పోలీసులకు చెప్పింది. సెప్టెంబర్ 15వ తేదీన కాంట్రాక్టు కిల్లర్స్ నదీమ్, దావోల్ సరోజ్, మోహిత్ కుమార్, శివకుమార్ మా ఇంటికి వచ్చారని, అందరూ కలిసి తన భర్త రామ్ శంకర్ హత్యకు మా ఇంట్లోనే స్కెచ్ వేశామని స్వప్నా సరోజ్ పోలీసుల విచారణలో అంగీకరించింది.

 చెవి కమ్మలు అడ్వాన్స్

చెవి కమ్మలు అడ్వాన్స్

తన భర్త రామ్ శంకర్ హత్యకు కాంట్రాక్లు కిల్లర్స్ తో తానే డీల్ మాట్లాడనని, వారికి తన చెవి కమ్మలు ఇచ్చి వాటిని కుదవ పెట్టి రూ. 35 వేలు తీసుకోవాలని తానే సూచించానని స్వప్నా సరోజ్ పోలీసులకు చెప్పింది. రూ. 35 వేలు అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టు కిల్లర్స్ తన భర్తను చంపేస్తామని తనకు హామీ ఇచ్చారని స్వప్నా సరోజ్ పోలీసులకు చెప్పింది.

ఇంటి నుంచి భర్తను బయటకు పంపించిన భార్య

ఇంటి నుంచి భర్తను బయటకు పంపించిన భార్య

తన సొదరుడు గోవింద్ సరోజ్ తనకు కావాలసి కొన్ని మందులు (మెడిసన్స్) తీసుకువస్తున్నాడని, వాటిని తీసుకుని ఇంటికి రావాలని తానే తన భర్త రామ్ శంకర్ ను కోరాహి సమీపంలోని దేవాలయం దగ్గరకు పంపించానని స్వప్నా సరోజ్ పోలీసులకు చెప్పింది. భార్య చెప్పిన చోటకు వెళ్లిన రామ్ శంకర్ ను అతని బావమరిది గోవింద్ సరోజ్, కాంట్రాక్లు కిల్లర్స్ కలిసి నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేసి తరువాత శవాన్ని తీసుకెళ్లి ప్రతాప్ గఢ్ జిల్లాలో విసిరేశారని స్వప్నా సరోజ్ విచారణలో అంగీకరించిదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంకా కొందరి ప్రమేయం ఉందని స్థానిక పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+