Illegal affair: ఇద్దరు ప్రియులు, మధ్యలో మొగుడు ఎందుకు ?, మర్మాంగం, ముఖం చట్నీ, భాను !
జైసల్మేర్/జైపూర్/రాజస్థాన్: భర్తతో కలిసి కాపురం చేస్తున్న భార్యకు పోయేకాలం దాపురించింది. పెళ్లి కాకముందే సమీప బంధువుతో ఆమెకు అక్రమ సంబంధం పెట్టుకునింది. ప్రియుడి మ్యాటర్ పక్కన పెట్టిన కిలాడీ లేడి అమాయకుడైన వ్యక్తిని వివాహం చేసుకుంది. భర్తతో కాపురం చేస్తున్న భార్య సీక్రేట్ గా ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇదే సమయంలో దంపతులు నివాసం ఉంటున్న ఇంటి మేడ మీదకు మరో వ్యక్తి అద్దెకు దిగాడు. భర్త ఉద్యోగం చెయ్యడానికి బయటకు వెళ్లిన తరువాత మేడమీద వ్యక్తిని భార్య లైన్ లో పెట్టింది. ఇంట్లో మొగుడితో, మేడ మీద ప్రియుడితో భార్య పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ఇద్దరు చాలక సమీప బంధువు కూడా ఇంటికి వచ్చి వెలుతుంటే అతనితో కూడా భార్య ఎంజాయ్ చేస్తోంది. ఇద్దరు ప్రియులు ఉన్నారు కదా, మధ్యలో మొగుడు ఎందుకు ? అంటూ భార్య ఆలోచించింది. ఇద్దరు ప్రియులను కాంప్రమైజ్ చేసిన భార్య తన భర్తను చంపేస్తే జీవితాంతం మీతో కలిసి ఉంటానని చెప్పింది. ఇదేదో బాగుందని అనుకున్న ప్రియులు పక్కాప్లాన్ తో భర్త ముఖం, మర్మాంగం చట్నీ చేసి చంపేశారు. ముద్దుల ప్రియులతో కలిసి భర్తను చంపించిన కిలాడీ లేడీతో పాటు ఆమె ఇద్దరు ప్రియులు ఇప్పుడు జైలుపాలైనారు.

భర్తతో భాను కాపురం
రాజస్థాన్ లోని బలోతరా ప్రాంతంలోని బర్మార్ పోలీస్ స్టేషన్ పరిధిలో యూసబ్ ఖాన్ (44) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జహీరా భాను అనే మహిళను యూసబ్ ఖాన్ వివాహం చేసుకున్నాడు. భార్య జహీరా భానుతో సంతోషంగా కాపురం చేస్తున్న యూసబ్ ఖాన్ ఓం ప్రకాష్ అనే సేఠ్ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు.

పెళ్లికి మందే అల్లావుద్దీన్ ప్రియుడు
జహీరా భానుకు పెళ్లి కాకముందే సమీప బంధువు అయిన అల్లావుద్దీన్ తో అక్రమ సంబంధం పెట్టుకునింది. ప్రియుడు అల్లావుద్దీన్ మ్యాటర్ పక్కన పెట్టిన కిలాడీ లేడి జహీరా భాను అమాయకుడైన యూసబ్ ఖాన్ ను వివాహం చేసుకుంది. భర్త యూసబ్ ఖాన్ తో కాపురం చేస్తున్న అతని భార్య జహీరా భాను పుట్టింటికి వెళ్లి వచ్చే సమయంలో సీక్రేట్ గా ప్రియుడు అల్లావుద్దీన్ తో ఎంజాయ్ చేసింది.

మేడ మీద కేటుగాడు
యూసబ్ ఖాన్ నివాసం ఉంటున్న ఇంటి మేడ మీదకు సంవత్సరం క్రితం భర్కత్ ఖాన్ అనే వ్యక్తి అద్దెకు తిగాడు. భర్త యూసబ్ ఖాన్ ఉద్యోగం చెయ్యడానికి బయటకు వెళ్లిన తరువాత మేడమీద ఉంటున్న భర్కత్ ఖాన్ ను భార్య జహీరా భాను లైన్ లో పెట్టింది. జహీరా భాను, భర్కత్ ఖాన్ కు ఓ మంచి రోజు చూపులు కలసిన శుభవేళ అంటూ దగ్గర అయ్యారు.

ఖాళీగా లేకుండా బిజీ అయిపోయిన భార్య జహీరా భాను
భర్త యూసభ్ ఖాన్ ఉద్యోగానికి వెళ్లిపోయిన తరువాత ఇంట్లో ఖాళీగా ఉంటున్న జహీరా భాను మేడ మీద ప్రియుడు భర్కత్ ఖాన్ ను ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసింది. భర్త యూసబ్ ఖాన్ తో ఏ బెడ్ మీద అయితే కాపురం చేస్తుందో అదే బెడ్ మీద ప్రియుడు భర్కత్ ఖాన్ తో జహీరా భాను జల్సా చేసింది. పగలు పూట ఖాళీగా లేకుండా జహీరా భాను ఆమె ముద్దుల ప్రియుడు భర్కత్ ఖాన్ కు స్వర్గం చూపించింది. జహీరా భాను ఇంట్లో మొగుడితో, మేడ మీద ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. ఇదే సమయంలో భర్కత్ ఖాన్ ప్రియురాలు జహీరా భాను జల్సాలకు డబ్బులు ఇవ్వడంతో ఇంకా దగ్గర అయ్యారు.

భర్తకు తెలిసి ప్రియుడికి గేట్ పాస్
నువ్వు బయటకు వెళ్లిపోయిన తరువాత భర్కత్ ఖాన్ నీ భార్య జహీరా భానుతో చనువుగా ఉంటున్నాడని, ఇద్దరు తలుపులు మూసేసి ఏదేదో చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్లు యూసబ్ ఖాన్ కు చెప్పారు. భార్య జహీరా భాను భాగోతం తెలుసుకున్న ఆమె భర్త యూసబ్ ఖాన్ రగిలిపోయాడు. వెంటనే భర్కత్ ఖాన్ ను ఆ ఇంటి నుంచి ఖాళీ చేపించి బయటకు పంపించేశాడు.

ఇద్దరు ప్రియులు ఉన్నారు.... మధ్యలో మొగుడు ఎందుకు ?
తనకు స్వర్గం చూపిస్తున్న ప్రియుడు భర్కత్ ఖాన్ ను ఇంటి నుంచి బయటకు పంపించేయడంతో జహీరా భాను ఆమె భర్త యూసబ్ ఖాన్ మీద రగిలిపోయింది. పుట్టింటి దగ్గర ఉన్న ప్రియుడు అల్లావుద్దీన్, ఇదే ఊరిలో ఉంటున్న మరో ప్రియుడు భర్కత్ ఖాన్ తో ఎంజాయ్ చెయ్యాలంటే తన భర్త యూసబ్ ఖాన్ అడ్డుపడుతున్నాడని జహీరా భాను రగిలిపోయింది. ఇద్దరు ప్రియులు ఉంటే మధ్యలో మొగుడు ఎందుకు అని జహీరా భాను ఆలోచించింది.

ఇద్దరు ప్రియులను రాజీ చేసిన కిలాడి లేడీ
ఇద్దరు ప్రియులు ఉన్నారు కదా, మద్యలో మొగుడు ఎందుకు ? అంటూ భార్య జహీరా భాను చాలా రోజులు ఆలోచించింది. ఇద్దరు ప్రియులు అల్లావుద్దీన్, భర్కత్ ఖాన్ ను ఒక చోటకు పిలిపించిన జహీరా భాను ఇద్దరిని కాంప్రమైజ్ చేసింది. నా భార్య యూసబ్ ఖాన్ ను చంపేస్తే జీవితాంతం మీతో కలిసి ఉంటానని జహీరా భాను ఇద్దరు ప్రియులకు చెప్పింది. ఇదేదో బాగుందని అనుకున్న ప్రియులు పక్కాప్లాన్ జహీరా భాను భర్త యూసబ్ ఖాన్ ను చంపేయాలని డిసైడ్ అయ్యారు.

ప్రియులకు మ్యాటర్ లీక్ చేసిన భార్య
గత 20 రోజుల నుంచి జహీరా భాను భర్త యూసబ్ ఖాను హత్య చెయ్యాలని ఆమె ప్రియులు వేసి చూస్తున్నారు. ఆగస్టు 2వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో తన యజమాని ఓం ప్రకాష్ సేఠ్ దగ్గర జీతం తీసుకుని వస్తానని యూసబ్ ఖాన్ అతని భార్య జహీరా భానుకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అదే సమయంలో జహీరా భాను ఆమె ఇద్దరు ప్రియులు అల్లావుద్దీన్, భర్కత్ ఖానకు సమాచారం ఇచ్చింది.

భర్తను చట్నీ చేసి చంపేసిన ప్రియులు
జహీరా భాను భర్త యూసబ్ ఖాన్ జీతం తీసుకోవడానికి వెళ్లిన రోజు రాత్రి జహీరా భాను భర్త యూసబ్ ఖాన్ ను ప్రియులు భర్కత్ ఖాన్, అల్లావుద్దీన్ కలిశారు. తరువాత ముగ్గురు కలిసి మద్యం సేవించారు. యూసబ్ ఖాన్ కు పీలదాక మద్యం తాగించిన భర్కత్ ఖాన్, అల్లావుద్దీన్ అతని మర్మాంగం, ముఖం, తల మీద బలమైన ఆయుధంతో దాడి చేశారు. తరువాత యూసబ్ ఖాన్ తల మీద బండరాళ్లు వేసి చంపేసి శవాన్ని తీసుకెళ్లి ముంగ్లా రోడ్డు పక్కన విసిరేసి పరారైనారు.

బెండ్ తీస్తే అసలు మ్యాటర్ చెప్పిన భార్య
మరుసటి రోజు యూసబ్ ఖాన్ శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు యూసబ్ ఖాన్ తో ఆరోజు రాత్రి కలిసి మద్యం సేవించిన భర్కత్ ఖాన్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. అల్లావుద్దీన్ తో కలిసి యూసబ్ ఖాన్ ను హత్య చేశామని భర్కత్ ఖాన్ అంగీకరించాడు. అక్రమ సంబంధం కారణంగా జహీరా భాను ఆమె భర్త యూసబ్ ఖాన్ ను హత్య చేయించిందని ఆమె స్వయంగా అంగీకరించిందని బార్మర్ జిల్లా ఎస్పీ ఆనంద్ శర్మా స్థానిక మీడియాకు చెప్పారు. ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను చంపించిన జహీరా భాను, ఆమె ముద్దుల ప్రియులు భర్కత్ ఖాన్, అల్లావుద్దీన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించామని బర్మార్ జిల్లా ఎస్పీ ఆనంద్ శర్మా మీడియాకు చెప్పారు. మొత్తం మీద ఇద్దరు ప్రియుల మోజులో పడిన జహీరా భాను జైలు పాలు కావడం హాట్ టాపిక్ అయ్యింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications